నల్గొండ

డిండి ప్రాజెక్ట్ నింపి సాగు, తాగునీరు అందించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేవరకొండ, డిసెంబర్ 4: తీవ్రమైన వర్షాభావ పరిస్ధితుల వల్లకరవుతో విలవిలలాడుతున్న దేవరకొండ నియోజకవర్గాన్ని ఆదుకునేందుకు డిండి ప్రాజెక్ట్‌ను కృష్ణా జలాలతో నింపి సాగు, తాగునీరు అందించాలని, దొండ తోటలను అధికంగా సాగు చేస్తున్న పెద్దఅడిశర్లపల్లి మండలంలో దొండ మార్కెట్‌ను ఏర్పాటు చేయాలని కోరుతూ జడ్పీ చైర్మెన్ బాలూనాయక్ ఆదివారం హైద్రాబాద్‌లో భారీనీటిపారుదల శాఖ, మార్కెటింగ్ శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు, విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డిని కలిసి వినతీపత్రం సమర్పించారు. నూతనంగా ఏర్పాటు అయిన కొండమల్లేపల్లి మండల కేద్రంలో మార్కెట్ ఏర్పాటుకు నిధులను మంజూరు చేయాలని ఆయన మంత్రులను కోరారు. మంత్రులను కలిసిన వారిలో టి ఆర్ ఎస్ నాయకులు ఎం ఎ సిరాజ్‌ఖాన్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మెన్ తిప్పర్తి సురేశ్‌రెడ్డి, హన్మంతు వెంకటేశ్‌గౌడ్, దేవరకొండ మండల పార్టీ అధ్యక్షుడు మారుపాకుల సురేశ్‌గౌడ్, ఏవి రెడ్డి, దొంతినేని వెంకటేశ్వర్‌రావు, ప్రభాకర్‌రెడ్డి, శశిధర్‌రెడ్డి, నీటిసంఘం చైర్మెన్ వెంకట్‌రెడ్డి, రాంకిరణ్, విష్ణువర్ధన్‌రెడ్డి, శేఖర్‌రెడ్డి, రామకృష్ణ పాల్గొన్నారు.
భూసార పరీక్షల విస్తరణకు కొత్త మార్గదర్శకాలు

నల్లగొండ, డిసెంబర్ 4: పంటల సాగులో విచ్చలవిడిగా రసాయన ఎరువులు వినియోగించంతో భూసారం క్షీణతతో పాటు మనిషి ఆరోగ్యానికి ముప్పు ఏర్పడుతుందంటూ ప్రపంచ ఆరోగ్య సంస్ధ హెచ్చరికల నేపధ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భూసార పరిరక్షణకు సరికొత్త కార్యక్రమాలు చేపట్టాయి. నేడు జాతీయ భూసార దినోత్సవం సందర్భంగా భూసార పరీక్షలను మరింత మంది రైతులకు చేరువ చేసే లక్ష్యంతో వ్యవసాయ, అనుబంధ శాఖలు కసరత్తు చేస్తున్నాయి. ఇకమీదట వ్యవసాయ అధికారులు ధృవీకరించిన రశీదు తీసుకెళ్తేనే డీలర్లు ఎరువులు, పురుగుమందులను విక్రయించేలా కొత్త కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. వ్యవసాయ అధికారి ధృవీకరణ లేకుండా, ఎరువులు, పురుగులమందులు విక్రయాలు జరిపితే చట్టపరమైన చర్యలు తీసుకోనున్నారు. ఈ క్రమంలో ఎరువుల దుకాణాల్లో తరుచు ఆకస్మిక తనిఖీ నిర్వహించి నిబంధనల మేరకు విక్రయాలు సాగుతున్నాయా.. లేదా.. అన్న అంశంపై పరిశీలించనున్నారు. అలాగే తపాల శాఖతో కొత్తగా వ్యవసాయ శాఖ కుదుర్చుకున్న ఒప్పందం మేరకు ఈనెల నుండి తపాల ఉద్యోగులు రైతుల పంటభూముల నుండి మట్టి నమూనాలు సేకరించి భూసార పరీక్ష కేంద్రాలకు పంపిస్తారు. ప్రయోగశాలల్లో పరీక్షలు జరిపిన పిదప భూసార వివరాలతో కూడిన భూమి ఆరోగ్య కార్డులను వ్యవసాయ అధికారుల నుండి తీసుకొని రైతులకు అందిస్తారు. ప్రయోగాత్మకంగా యాదాద్రి జిల్లాలోని 16 మండలాల్లో తపాల శాఖ భూ ఆరోగ్య కార్డులను రైతులకు చేరవేసే కార్యక్రమంలో భాగస్వామ్యం కానుంది. యాదాద్రి జిల్లాల్లో 9119 మట్టి నమూనాలు సేకరించి పరీక్షల పిదప భూ ఆరోగ్య కార్డులను రైతులకు అందిస్తారు. ప్రతి మండలం నుండి కనీసం 500 మేరకు మట్టి నమూనాలు సేకరిస్తారు. భూ ఆరోగ్యకార్డు పథకంలో భాగంగా ఈ ఏడాది నల్లగొండ జిల్లా పరిధిలో 50443 మట్టి నమూనాలు సేకరించగా మరో 33348 నమూనాలను సేకరించాల్సి ఉంది. సూర్యాపేట జిల్లాలో 28389 మట్టి నమూనాలకు గానూ ఇప్పటివరకు 21450 నమూనాలు సేకరించారు. యాదాద్రిభువనగిరి జిల్లాలో 9133 మట్టి నమూనాలు సేకరించగా మరో 9119 నమూనాల సేకరణలో పోస్టల్ శాఖ భాగస్వామ్యం కానుంది.
ఎడమకాల్వకు నీటి విడుదల పొడిగింపు
నాగార్జునసాగర్, డిసెంబర్ 4: నాగార్జునసాగర్ జలాశయం నుండి ఖరీఫ్ పంటకు గాను నీటివిడుదలను మరో ఆరు రోజులపాటు పొడిగిస్తూ ఆదివారం డ్యాం అధికారులు నీటివిడుదల చేశారు. ఖరీఫ్ పంటలో భాగంగా ఎడమకాల్వ పరిదిలో ఆరుతడి పంటలకుగాను ఆరు విడతలుగా నీటివిడుదల చేసిన డ్యాం అధికారులు ఖరీఫ్ పంటకు నీటివిడుదల పూర్తయిందని గతంలోనే ప్రకటించారు. అయితే ఎడమకాల్వ పరిదిలో మొదటి, రెండవ జోన్‌లో కొన్ని చోట్ల వేసిన పంట చేతికి రావడానికి చివరిదశలో ఉన్నందున ఆయకట్టు రైతాంగం అభ్యర్ధన మేరకు మరో 5,6రోజులపాటు నీటివిడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా నాగార్జునసాగర్ ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ సునీల్ మాట్లాడుతూ పంట చివరి దశలో ఉన్న కారణంగా రైతులకు పంట చేతికి రావాలంటే 5,6రోజుల వరకు పంటకు నీరు అవసరమని ఆయకట్టు ప్రజాప్రతినిధులు, రైతుల వినతిమేరకు, ప్రభుత్వం ఆదేశం మేరకు ఆదివారం మధ్యాహ్నం 2గంటల నుండి ఎడమకాల్వ ద్వారా నీటివిడుదల చేస్తున్నామన్నారు. రోజుకు సగటున 4వేల నుండి 5వేల క్యూసెక్కుల వరకు సుమారు 6రోజుల వరకు నీటివిడుదల చేస్తామని ఆపై నిలిపివేస్తామని తెలిపారు. ప్రస్తుతం సాగర్ జలాశయంలో 526.60అడుగుల నీటిమట్టం ఉండగా శ్రీశైలంలో 871.70అడుగుల నీటిమట్టం ఉంది. అయితే యాసంగి పంటకుగాను నీటివిడుదల విషయంలో కృష్ణారివర్‌బోర్డు టువంటి నిర్ణయం తీసుకోనందున పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది.

రాష్టస్థ్రాయి వాలీబాల్ క్రీడోత్సవాలకు ముస్తాబైన సూర్యాపేట
* ప్రారంభించనున్న మంత్రులు జగదీశ్‌రెడ్డి, పద్మారావు
సూర్యాపేట, డిసెంబర్ 4: కొత్త జిల్లాగా ఆవిర్భావించిన సూర్యాపేట రాష్టస్థ్రాయి క్రీడోత్సవాలకు వేధికగా నిలిచింది. జిల్లాల ఏర్పాటుకు ముందు గత ఏడాది జాతీయస్థాయి క్రీడలకు ఆతిధ్యం ఇవ్వగా జిల్లా ఏర్పాటైన తర్వాత తొలిసారిగా రాష్టస్థ్రాయి రెండవ సీనియర్ వాలీబాల్ టోర్నమెంట్స్ నిర్వహించేందుకు ఈ పాటికే ఏర్పాట్లు అన్ని పూర్తయ్యాయి. జిల్లాకేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో సోమవారం సాయంత్రం ఈ క్రీడోత్సవాలను రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, ఎక్సైజ్, క్రీడల శాఖ మంత్రి టి.పద్మారావులు ప్రారంభించనున్నారు. నాలుగు రోజుల పాటు నిర్వహించే ఈ క్రీడా పోటీల్లో గత ఉమ్మడి జిల్లాల ప్రాతిపధికన బాలుర, బాలికల విభాగంలో 20జట్లు తలపడనున్నాయి. జిల్లాకు ఒక పురుషులు, మహిళల జట్ల చొప్పున మొత్తం 160మంది క్రీడాకారులు పోటీల్లో పాల్గొనున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా వాలీబాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్రీడల నిర్వాహణకు ఘనంగా ఏర్పాట్లు చేపట్టారు. ఇందుకోసం జూనియర్ కళాశాల మైదానాన్ని అందంగా ముస్తాబు చేశారు. మైదానంలోని సగభాగాన్ని ఎర్రమట్టితో చదును చేసి రెండు వాలీబాల్ కోర్టులను నిర్మించారు. రాత్రి పగలు పోటీలు నిర్వహించనున్నందున భారీ ఫ్లెడ్‌లైట్లను ఏర్పాటుచేశారు. క్రీడా ప్రాంగణంలో వాలీబాల్‌కు సంబంధించిన చిత్రాలను గోడలపై వేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. క్రీడాపోటీలను తిలకించేందుకు పెద్దసంఖ్యలో క్రీడాభిమానులు రానున్నందున చుట్టు భారీకెడ్లను ఏర్పాటుచేశారు. వివిధ జిల్లాల నుండి తరలివచ్చే క్రీడాకారులకు భోజన, వసతి సదుపాయాలను కల్పించే విధంగా చర్యలు తీసుకున్నారు. మహిళా క్రీడాకారులకు జూనియర్ కళాశాల ఆవరణలో ఉన్న ప్రభుత్వ వసతిగృహంలో, పురుషులకు సాంఘీక సంక్షేమ శాఖ వసతిగృహంలో బస ఏర్పాటుచేశారు. జూనియర్ కళాశాల సమీపంలో గల కిరాణా ఫ్యాన్సీ భవనంలో క్రీడాకారులందరికి భోజనం ఏర్పాట్లుచేశారు.

సంక్షేమ పథకాలు ప్రజల్లోకి చేర్చాలి: నూకల
నల్లగొండ టౌన్, డిసెంబర్ 4: కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి చివరివరకు చేర్చేవిధంగా పార్టీ కార్యకర్తలు కృషి చేయాలని బిజెపి జిల్లా అధ్యక్షులు నూకల నర్సింహ్మారెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా బిజెపి కార్యాలయంలో 23, 24, 27, 28, 29, 31 వార్డుల యొక్క జోనల్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడుతూ రానున్న రోజుల్లో నియోజకవర్గ స్ధాయిలో మొదటివిడతగా 20 గ్రామాల్లో కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు తీరుతెన్నులపై అవగాహన సదస్సులను నిర్వహించనున్నామని పేర్కొన్నారు. కార్యకర్తలు పూర్తిస్ధాయిలో అందుకు సన్నద్దం కావాలని కోరారు. ఈ నెల 9న భారత రాజ్యాంగ నిర్మాణ డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ వర్థంతి సభ కార్యక్రమాన్ని పట్టణంలోని శాంతినగర్‌లో అశోకగార్డెన్స్‌లో నిర్వహిస్తున్నట్లు, ఈ సభకు జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు హాజరవుతున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి కౌన్సిలర్, ఫ్లోర్‌లీడర్ నూకల వెంకటనారాయణరెడ్డి, చింత ముత్యాల్‌రావు, పోతెపాక సాంబయ్య, బొజ్జ నాగరాజు, పెరిక ముణికుమార్, బైరు సత్తయ్య, పుప్పల శ్రీనివాస్, వెంకన్న, వంగూరి రాఖి, ప్రదీప్, మోహన్‌రెడ్డి, మహేష్, యాదయ్య, బక్కయ్య, సురేందర్‌రెడ్డి, శ్రీరాంరెడ్డి, రవికిషన్, నాగిరెడ్డి, దినేష్, తదితరులు పాల్గొన్నారు.ప్రతి దళిత కుటుంబానికి మూడెకరాల భూమి ఇవ్వాలి
వలిగొండ, డిసెంబర్ 4: ప్రతి దళిత కుటుంబానికి మూడెకరాల భూమిని ఇస్తామని వాగ్థానం చేసిన ప్రభుత్వం మాటకు కట్టుబడి ఉండి దళితులకు మూడెకరాల భూమిని ఇవ్వాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్ డిమాండ్ చేశారు. అధికార పార్టీ ఎన్నికలకు ముందు ప్రతి దళిత కుటుంబానికి మూడెకరాల భూమిని ఇస్తామని చెప్పి నేటికి రెండున్నర సంవత్సరాలు కావస్తున్న భూమిని ఇవ్వడంలో పూర్తిగా విఫలమైందన్నారు. మండలంలోని వేములకొండ గ్రామంలోని ఆరుగురు దళిత కుటుంబాలకు బండరాళ్లు, కంపచెట్లతో ఉన్న 18ఏకరాల సాగుకు అనువుగా లేని భూమిని అందించగా వృధాగా ఉండిపోయిందన్నారు. అనంతరం మండల నూతన కమిటీలో అధ్యక్షుడిగా కొండె కిష్టయ్య, కార్యదర్శిగా కల్కూరి రాంచందర్‌ను, దొడిబిక్షపతి, జక్క ప్రభాకర్, రాఘవరెడ్డి తదితరులను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో కూర శ్రీనివాస్, దుర్గయ్య, ముత్యాలు, సుదర్శన్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.
10 నుంచి డిటిఎఫ్
విద్యా వైజ్ఞానిక మహాసభలు
వలిగొండ, డిసెంబర్ 4: ఈనెల 10 నుండి 12 వరకు దేవరకొండలో డిటిఎఫ్ విద్యావైజ్ఞానిక మహాసభలను నిర్వహించడం జరుగుతుందని డిటిఎఫ్ అధ్యక్షుడు గంగాధారి బిక్షపతి అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో డిటిఎఫ్ విద్యావైజ్ఞానిక మహాసభ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బిక్షపతి మాట్లాడుతూ విద్యామహాసభలో కామన్‌స్కూల్ విద్యావిధానం, నూతన విద్యావిధానం, సామాజిక వివక్ష, మహిళా ఉద్యమాలు, ప్రపంచీకరణ యుగంలో కార్మికోద్యమం అనే అంశాలపై ప్రసంగాలు,చర్చలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో డిటిఎప్ ప్రధాన కార్యదర్శి కట్ట ప్రభాకర్, జిల్లా కౌన్సిలర్ అక్కెనపల్లి కృష్ణమూర్తి, ఉపాధ్యాయులు గౌస్‌పాషా, స్వామిరాజ్, గౌసోద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
యాదాద్రిలో భక్తుల రద్దీ
యాదగిరిగుట్ట, డిసెంబర్ 4: స్వయంభూ పంచనారసింహ్మక్షేత్రమైన యాదాద్రిలో ఆదివారం భక్తుల రద్ది నెలకొంది. ఆదివారం సెలవు దినం కావడంతో నగర వాసులే కాకుండా పలు ప్రాంతాలకు చెందిన భక్తులు కుటుంబసభ్యులతో క్షేత్రాన్ని సందర్శించి పూజలు నిర్వహించారు.్భక్త జనులతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి.శనివారం సాయంత్రం నుండే భక్తుల రాక పెరగడంతో వసతుల కరువు ఏర్పడింది.ఇటీవలి కాలంలో కొండపైన వందలాది గా వసతిగదులు కూల్చివేసిన వైటిడి ఏ అధికార్లు భక్తులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టక పోవడంతో బస చేసేందుకు గదులు లభించక భక్తులు నానా తిప్పలు పడ్డారు.రద్దితో ఆలయాన్ని వేకువ జామున 3 గంటలకే తెరిచి సుప్రభాతం చేపట్టారు.నిజాభిషేఖం,తులసి అర్చన అనంతరం ఉదయం 6 గంటలనుండే భక్తుల దైవదర్శనాలకు అనుమతించారు.స్వామి వారి నిత్యకళ్యాణం,వ్రతపూజల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
అభివృద్ధ్ది పనులను
పరిశీలించిన కలెక్టర్
యాదగిరిగుట్ట, డిసెంబర్ 4: యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రాన్ని ఆదివారం యాదాద్రి జిల్లా కలెక్టర్ అనితారామచంధ్రన్ సందర్శించారు. ఈ సందర్బంగా ఆలయం, ఆలయ పరిసరాలను అభివృద్ది పనులను పరిశీలించారు.అభివృద్ది పనుల తీరును దేవస్దానం కార్యనిర్వహనాధికారి ఎన్.గీత కలెక్టర్‌కు వివరించారు.అంతకు ముందు యాదగిరిగుట్టలో జరుగుతున్న రహదారి పనులను కలెక్టర్ పరిశీలించారు.
కాంగ్రెస్ ఓబిసి సెల్ నూతన కార్యవర్గం ఎన్నిక
నల్లగొండ టౌన్, డిసెంబర్ 4: ఓబిసి సెల్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు చిత్తరంజన్‌దాసు సూచనల మేరకు ఆదివారం నల్లగొండ పట్టణ ఓబిసి సెల్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా చాపల యాదయ్యను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమానికి పట్టణ కమిటీ అధ్యక్షులు గుమ్ముల మోహన్‌రెడ్డి పాల్గొని మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి, 2019 పార్టీ అధికారమే లక్ష్యంగా, రైతుల సమస్యలను పరిష్కరించేందుకు ఐక్యంగా పోరాడేందుకు కార్యకర్తలు సహాకరించాలని కోరారు. కమిటీ జిల్లా కార్యదర్శిగా కేమ నారాయణ, ఉపాధ్యక్షులు మునుగోటి రామకృష్ణ, ప్రధాన కార్యదర్శిగా పగిళ్ల చైతన్యలను ఎన్నుకున్నారు. అదేవిధంగా పలు వార్డులకు అధ్యక్ష కార్యదర్శులను నియమించారు. ఈ కార్యక్రమంలో పట్టణ కౌన్సిలర్లు ఎండి.లతీఫ్, ఊట్కూరి వెంకట్‌రెడ్డి, మందడి శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.
సిపిఎస్ పెన్షన్ విధానం రద్దుకై టిపియుఎస్ ఉద్యమం
నల్లగొండ టౌన్, డిసెంబర్ 4: తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం (టిపియుఎస్) ఆధ్వర్యంలో సిపి ఎస్ విధానం రద్దుకై దశలవారీగా ఉద్యమాలు నిర్వహించేందుకు సిద్దంగా ఉండాలని అధ్యక్ష కార్యదర్శులు అలుగుబెల్లి పాపిరెడ్డి, పెంటయ్యలు ఆదివారం పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ముఖ్యకార్యకర్తల కోర్‌కమిటీ సమావేశం టిపస్ భవన్‌లో నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ సిపి ఎస్ పెన్షన్ విధానం రద్దు కోసం టిపియు ఎస్ ఏకైక ఎజెండా అంశంగా దశలవారీగా ఉద్యమానికి తీర్మానించామన్నారు. ఈ కార్యక్రమంలో నరేందర్‌రెడ్డి, ఇరుగు శ్రీరాములు, దామోదర్‌రెడ్డి, తుమ్మలపల్లి దామోదర్‌రెడ్డి, కంచనపల్లి విజయ్, నంద్యాల నర్సిరెడ్డి, బంటు నాగేందర్, కోల నాగయ్య పాల్గొన్నారు.

ఈ నెల 10 నుండి హనుమాన్ వ్రతాలు, హోమాలు
నల్లగొండ టౌన్, డిసెంబర్ 4: ఈనెల 10, 11 తేదీల్లో నల్లగొండ పట్టణంలోని విటి కాలనీ పంచముఖ హనుమాన్ దేవాలయంలో రెండు రోజుల పాటు హనుమాన్ వ్రతాలు, హోమం అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు హనుమాన్ సేవాసమితి అధ్యక్షులు రావుల శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. రెండు రోజుల పాటు నిర్వహించనున్న కార్యక్రమాలకు సంబంధించిన కరపత్రాలను దేవస్ధానంలో పలువురు ప్రముఖుల సమక్షంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్షేత్రపాలక ఆంజనేయస్వామి దేవస్ధానం హైద్రాబాద్ రోడ్డుపై ఉండటంతో పాటు అత్యంత పురాతనమైనదని భక్తుల కొంగుబంగారంగా నిలుస్తూ స్వామివారి ఆశీస్సులతో దేవస్ధానం దిన దిన ప్రవర్ధమానంగా వెలుగొందుతుందన్నారు. ఈకార్యక్రమంలో వీరెల్లి చంద్రశేఖర్, బండారు స్రసాద్, ఎదుళ్ల అంజిరెడ్డి, హనుమాన్ సేవా సమితి సభ్యులు మేడం ప్రభాకర్, నూకల జైపాల్‌రెడ్డి, కసిరెడ్డి, సీతారాంరెడ్డి, మోహన్‌రావు, శ్రీనివాసమూర్తి, వెంకటేశ్వర్లు, మధుసూధన్‌రెడ్డి, రాధాకృష్ణమాచారి, నారాయణ తదితరులు పాల్గొన్నారు.
మామిడి తోటల బీమాను సద్వినియోగం చేసుకోవాలి
మోత్కూరు, డిసెంబర్ 4: మోత్కూరు, అడ్డగూడురు మండలాల పరిధిలోని మామిడి తోటల రైతులకు కల్పిస్తున్న భీమా సౌకర్యాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని హార్టికల్చర్, సెరికల్చర్, క్లస్టర్ లేవెల్ అధికారులు శ్రీరాంకుమార్, జె.నర్సింహ్మలు ఆదివారం ఒక ప్రకటనలో కోరారు.
చోల్ల మండలం ఎంఎస్ జనరల్ ఇన్సురెన్సు కంపెనీ లిమిటెడ్ హైద్రాబాద్ వారు ఈ అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. వివరాలకు కంపెనీ ప్రతినిధి శ్రవణ్ 8939612974 నెంబర్‌ను సంప్రదించాలని కోరారు.

పెద్దనోట్ల రద్దుతో కష్టాలు వెల్లువ
సూర్యాపేటటౌన్, డిసెంబర్ 4: పెద్దనోట్ల రద్దు ప్రయోజనం సామాన్య ప్రజలు, గ్రామీణ పేదలకు జరిగిందేమి లేదని కష్టాలు పడుతున్నారని సిపి ఎం జిల్లా కార్యదర్శి ముల్కలపల్లి రాములు, బిసి సబ్‌ప్లాన్ సాధన సమితి కన్వీనర్ అంగిరేకుల నాగార్జునలు అన్నారు. స్థానిక జిల్లాకేంద్రంలోని జెడ్పిహెచ్ ఎస్‌లో ఎస్ ఎఫ్ ఐ, డివై ఎఫ్ ఐల ఆధ్వర్యంలో నిర్వహించిన పెద్దనోట్ల రద్దు వివిధ రంగాలపై ప్రభావం అనే అంశంపై నిర్వహించిన రౌండు టేబుల్ సమావేశానికి హాజరై మాట్లాడారు. ప్రధాని నరేంద్రమోదీ ఏకపక్ష నిర్ణయం మూలంగా బ్యాంకుల చుట్టు నిలబడి ప్రాణాలు కొల్పోయిన వృద్దులు, సామాన్యులు ఉన్నారే తప్ప నిజమైన నల్లధనం కలిగి ఉన్న వాల్లు ఏ ఒక్కరు బ్యాంకుల చుట్టు లైన్లలో నిలబడే పరిస్థితి లేదన్నారు. ప్రస్తుతమున్న నోట్లను రద్దు చేస్తూనే నల్లధనం వెలికి వచ్చినట్లు కాదని స్వీస్ బ్యాంకుల్లో దాగి ఉన్న ధనాన్ని ఏమీ అనాలో ప్రధాని చెప్పాలన్నారు. ముందస్తూ ప్రణాళిక లేకుండా అనాలోచితంగా నిర్ణయం చేయడం సరైంది కాదన్నారు. ప్రజలు వివిధ రంగాలల్లో చాల అసహనాలతో ఉన్నారని ఇంత జరుగుతున్న మోదీ మాత్రం నియంతలా వ్యవహరిస్తున్నారన్నారు. 4 ప్రయోజనాల పేరుతో అందరిని మభ్యపెడుతున్న మోదీ ఎక్కవ సమస్యలు ప్రజలు అన్న భవించేలా చేయడం జరిగిందని ఈనెల చివరి వరకు ప్రజలు ఇబ్బందులను గుర్తించి చలామణి అయ్యే విధంగా చూడాలని ప్రజల ఆవేధనను అర్ద చేసుకోకుంటే పర్యావసానం వేరే విధంగా ఉంటుందని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు బత్తుల విద్యాసాగర్, దన్యాకుల శ్రీకాంత్‌వర్మ, డివైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు కొండేటి ఉపేందర్, టిఎస్‌యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి సోంబాబు, టిడిఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్ సిహెచ్. వెంకటేశ్వర్, టివీవీ, ఏఐఎస్‌ఎఫ్ జిల్లా కార్యదర్శిలు సాందీప్, నాగరాజు, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి రాములు, గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు రవినాయక్ పాల్గొన్నారు.