నల్గొండ

అధిక దిగుబడులు పొందవచ్చ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, డిసెంబర్ 5: భూసార పరీక్షల ఫలితాలను అనుసరించి పంటల సాగు చేసిన పక్షంలో రైతులు వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకుని అధిక దిగుబడులు పొందవచ్చని కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ అన్నారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ ఉదయాధిత్య భవన్‌లో వ్యవసాయ శాఖ నిర్వహించిన ఉమ్మడి నల్లగొండ జిల్లా జాతీయ భూసార దినోత్సవం సదస్సును ఆయన ఎంపి గుత్తా సుఖేందర్‌రెడ్డితో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఉప్పల్ మాట్లాడుతు భూసార రక్షణకు, మానవాళి సంక్షేమానికి రసాయానిక ఎరువులు, మందులను విడనాడి సేంద్రీయ, ప్రకృతి పద్ధతులతో పంటల సాగు చేపట్టాలని కోరారు. రైతులు తమ భూమిలో ఏ పంట వేస్తే బాగా పండుతుందన్న విషయంతో పాటు ఆ భూమికి ఏ ఎరువు ఎంత అవసరమన్నదానిపై అవగాహాన కల్గి పంటల సాగు చేపట్టినట్లయితే పంటల సాగులో నష్టాలు తగ్గించుకుని అధిక దిగుబడులు పొందవచ్చన్నారు. ఇందుకు రైతులు విధిగా తమ భూముల భూసార పరీక్షలను తప్పక జరిపించుకోవాలన్నారు. ఇందుకు కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు భూఆరోగ్య కార్డు పథకం ద్వారా రైతులకు ఉచితంగా భూసార పరీక్షలు చేయించి సూఛనలందిస్తున్నారు. వ్యవసాయ రంగ సంక్షేమానికి ప్రభుత్వాలు అందించే పథకాలను సద్వినియోగం చేసుకుని రైతులు ఆర్ధికంగా బలోపేతం కావాలన్నారు. పంజాబ్, గుజరాత్ రాష్ట్రాల్లో సాంకేతిక విజ్ఞానంతో వ్యవసాయాన్ని సాగిస్తు లాభాల బాటలో సాగుతున్నారని వారి స్ఫూర్తితో పంటల సాగు చేపట్టాలని రైతులను కోరారు.
ఫసల్ బీమా యోజన పథకం ఈ డిసెంబర్ 31వరకు ఉందని రైతులు పంటల బీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. విత్తన ఎంపికలో రైతులు వ్యవసాయ అధికారులు, శాస్తవ్రేత్తలు సూఛనలు పాటించడం ద్వారా నకిలీ విత్తన బెడద సమస్యను అధిగమించాలన్నారు. యాసంగి పంటల సీజన్‌కు సాగర్ ఆయకట్టుకు నీరందించేందుకు త్వరలోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. ఎంపి గుత్తా సుఖేందర్‌రెడ్డి మాట్లాడుతు వ్యవసాయ అధికారులు రైతులకు పంటల సాగులో తగిన అవగాహాన కల్పించేందుకు కృషి చేయాలన్నారు. క్షేత్ర స్థాయిలో రైతులతో భేటీ కావాలన్నారు. సీజన్‌ల వారిగా పంటల సాగులో వాతావరణ మార్పులను అనుసరించి రైతులకు కావాల్సిన సమాచారం అందించాలన్నారు. సాగర్ ఎడమకాలువ ఆయకట్టుకు యాసంగి పంటల సాగుకు వారబందీ పద్ధతిలో నీటి విడుదల చేయనున్నందునా రైతులకు కావాల్సిన ఆరుతడి పంటల విత్తనాలను సిద్ధం చేయాలన్నారు.