నల్గొండ

సామాన్యులకు కష్టాలు.. నేతల ఇళ్లకు నోట్ల కట్టలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిట్యాల, డిసెంబర్ 20: ప్రధానమంత్రి నరేంద్రమోది రూ. 500, రూ. 1000నోట్లను రద్దు చేయడంతో సామాన్యులు బ్యాంకుల వద్ద డబ్బుల కోసం చిన్ననోట్ల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సామాన్యులకు నోట్ల కష్టాలను భాజపా నాయకుల ఇండ్ల వద్దకు నోట్ల కట్టలా అని సిపిఎం మండల కార్యదర్శి అవిశెట్టి శంకరయ్య అన్నారు. నోట్ల రద్దుపై మంగళవారం చిట్యాల ఎస్‌బిహెచ్ ఎదుట సిపిఎం ఆధ్వర్యంలో నాయకులు ధర్నా నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న శంకరయ్య మాట్లాడుతూ నల్లధనం, అవినీతిని నిర్మూలించేందుకు ప్రధాని మోది నోట్లు రద్దుచేసి సామాన్య ప్రజలకు కష్టాలను కలిగిస్తున్నారన్నారు. ఇతర దేశాల్లోని నల్లధనం దేశంలోని అవినీతిని నిర్మూలించకుండా నోట్లు రద్దుచేసి దేశంలోని ప్రజలను అవస్థలపాలు చేయడం సరికాదన్నారు. నల్లధం అవినీతి అంతం చేసేందుకు నోట్లు రద్దుచేసి ప్రధాని మోది తన చుట్టూ ఉన్న అవినీతి బకాసురులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా రూ.2000ల నోట్లను చెలామణిలోకి తీసుకురావడం సమంజసమేనా అని ప్రశ్నించారు. తమ డబ్బులను బ్యాంకుల్లో దాచుకుని వాటి తీసుకునేందుకు ప్రజలు బ్యాంకుల చుట్టూ తిరుగుతూ ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.

పలుచోట్ల కార్డన్ సెర్చ్
నల్లగొండ టౌన్, డిసెంబర్ 20: నల్లగొండ పట్టణంలో గొల్లగూడెం, పెద్ధబండ ప్రాంతాల్లో 200మంది సిబ్బందితో మంగళవారం రాత్రి జిల్లా ఎస్పీ ఎన్.ప్రకాశ్‌రెడ్డి కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సరైన పత్రాలు లేని 65ద్విచక్ర వాహనాలు, 20ఆటోలు, ఒక బెల్ట్‌షాప్, మూడు గ్యాస్‌సిలిండర్లు స్వాధీనం చేసుకున్నట్లుగా తెలిపారు. ఎస్పీ మాట్లాడుతు గుర్తు తెలియని వారికి ఇల్లు అద్దెకు ఇవ్వరాదని, అసాంఘీక కార్యకలాపాల నియంత్రణకే ఈ తనిఖీలు, సోదాలు నిర్వహించామని, హోటల్స్, లాడ్జీలను కూడా తనిఖీ చేశామన్నారు. ఈ సోదాల్లో ఆరుబృందాలుగా పోలీస్ సిబ్బంది పాల్గొనగా ఇందులో డిఎస్పీ, ఎడుగురు సిఐలు, 15 మంది ఎస్‌ఐలు, 120 మంది సిబ్బంది, 8 మంది మహిళా సిబ్బంది, 30 మంది రాపిడ్ యాక్షన్‌ఫోర్స్, రెండు స్పెషల్ పార్టీ బృందాలు పాల్గొన్నాయని తెలిపారు.