నల్గొండ

ఘనంగా రామానుజన్ జయంతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ టౌన్, డిసెంబర్ 22 : ప్రఖ్యాత గణిత శాస్తవ్రేత్త శ్రీనివాస రామానుజన్ 128వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని జాతీయ గణిత దినోత్సవాన్ని స్దానిక ఎన్జీ కళాశాలలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్సీ, ఐ ఐటి కోచింగ్ నిపుణులు చుక్కా రామయ్య ముఖ్య అతిధిగా, జాయ అవార్డు గ్రహిత ఎం.రామానుజాచార్యులు గౌరవ అతిధులుగా హాజరై శ్రీనివాస రామానుజన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం చుక్కా రామయ్య మాట్లాడుతూ రామానుజన్ గణిత శాస్త్రానికి చేసిన సేవలను కొనియాడారు. గణిత శాస్త్ర పరిశోధనలందు విద్యార్ధులు ముఖ్యంగా సంఖ్యావాద సిద్దాంతాల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉందని దాన్ని విద్యార్ధులకు వివరించారు. కళాశాలలోని గణిత గ్రూపులనందు ప్రతి సెక్షన్‌లో టాపర్లకు ఒక్కొక్కరికి 5వేల చొప్పున 25వేల బహుమానం ప్రకటించారు.
ఈ కార్యక్రమానికి కళాశాల వైప్ ప్రిన్సిపల్ ఉస్తెల శ్రీనివాస్‌రెడ్డి అధ్యక్షత వహించగా అధ్యాపకులు కేశవరెడ్డి, సముద్రాల ఉపేందర్, కనకయ్య, ఏడు కొడల్, సిఈఒ రవికుమార్, ఇతర శాఖల అధ్యాపకులు నీరజ, వెంకటకృష్ణ, చిత్తరంజన్, శ్రీనివాస్‌రెడ్డి, భిక్షమయ్య, విద్యార్ధినీ, విద్యార్ధులు తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా రామానుజన్ జయంతి..
భారతదేశ కీర్తిని ప్రపంచ దేశాలకు చాటి రామానుజన్‌ను విద్యార్ధులు ఆదర్శంగా తీసుకోవాలని న్యూస్ స్కూల్ కరస్పాంటెండెంట్ గంట్ల అనంతరెడ్డి సూచించారు. గురువారం పట్టణంలోని న్యూస్ పాఠశాల నందు రామానుజన్ 128వ జయంతిని జాతీయ గణిత దినోత్సవంగా చిన్నారుల మధ్య ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. విద్యార్ధులు చిన్ననాటి నుండే గణితం పట్ల భయందోళన వీడి అభ్యాసం చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ గంట్ల పద్మ, అలుగుబెల్లి తిరుమల్‌రెడ్డి, పర్వతరెడ్డి, ఫాతిమా, సౌజన్య, నిరూప, విజయలక్ష్మి, దీపక్, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.