నల్గొండ

ఆనందోత్సాహంతో క్రిస్మస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, డిసెంబర్ 25: క్రిస్మస్ పర్వదినాన్ని క్రైస్తవ సోదరులు నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో ఆదివారం భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. ప్రత్యేక ప్రార్ధనలు, గేయాలాపనలతో చర్చిలు మారుమ్రోగాయి. శాంతిసందేశాలు, బైబిల్ పఠనాలతో, ఏసు జన్మదిన కేక్‌లను కట్ చేస్తూ క్రైస్తవ సోదరులు క్రిస్మస్ వేడుకలను సంబరంగా జరుపుకున్నారు. మిర్యాలగూడ, దేవరకొండ, కోదాడ, హుజూర్‌నగర్, సాగర్, హాలియా, తిరుమలగిరి, మోత్కూర్, నకిరేకల్, ఆలేరు, మూటకొండూరు, కేతెపల్లి, మునగాల, చౌటుప్పల్, మర్రిగూడ, వలిగొండ, రాజాపేట, మునుగోడు, శాలిగౌరారంలలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా సాగాయి. సూర్యాపేటలో క్రిస్మస్ వేడుకల్లో మంత్రి జి.జగదీష్‌రెడ్డి, మిర్యాలగూడలో ఎమ్మెల్యే ఎన్. భాస్కర్‌రావు, నకిరేకల్, నల్లగొండలలో ఎంపి గుత్తా సుఖేందర్‌రెడ్డి, గాదరి కిషోర్, వేముల వీరేశం, ఎమ్మెల్సీ పూల రవిందర్‌లు, కలెక్టర్ గౌరవ్ ఉప్పల్‌లు హాజరై ప్రత్యేక ప్రార్ధనల్లో పాల్గొని కేక్‌లు కట్ చేశారు. నల్లగొండలోని మరియారాణి కేతిడ్రాల్ చర్చిలో బిషప్ ఘనగోవింద్‌జోజి ఆధ్వర్యంలో క్రిస్మస్ ప్రార్ధనలు నిర్వహించారు. సెంటినరీ సెల్ఫ్ సపోర్టింగ్ తెలుగు బాప్టిస్ట్ చర్చి, గెరిజిముకొండ ప్రార్ధన మందిరాల్లో ఎమ్మెల్యే గాదరి కిషోర్ ప్రార్ధనల్లో పాల్గొన్నారు. కల్వరి చర్చిలో పేదలకు దుస్తులు పంపిణీ చేశారు. సిఎస్‌ఐ చర్చి, ఏబ్రోల్ చర్చి, కవనెంట్ చర్చిలలో సైతం క్రిస్మస్ వేడుకలు ఘనంగా సాగాయి. ఏసుజన్మదినం పురస్కరించుకుని శనివారం అర్ధరాత్రి జిల్లా కేంద్రంలోని చర్చిల్లో గంటలు మ్రోగించి కొవ్వోత్తులు వెలిగించారు. ఈ కార్యక్రమాల్లో ఎస్పీ ప్రకాశ్‌రెడ్డి, ఫాస్టర్స్ మోజెస్, క్రిస్ట్ఫోర్, పశల శౌరయ్య, ఏసురాజ్, ఆనంద్‌ప్రసాద్, విలియమ్స్, టిఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి దుబ్బాకనరసింహారెడ్డి, ఎంపిపి పాశంరాంరెడ్డి, పుల్లెంల వెంకటనారాయణగౌడ్, దుబ్బ అశోక్‌సుందర్ తదితరలులు పాల్గొన్నారు.

హోరాహోరీగా కబడ్డీ పోటీలు
నల్లగొండ టౌన్, డిసెంబర్ 25: జాతీయ స్ధాయి అండర్-17 కబడ్డీ పోటీలు పట్టణంలోని ఎన్జీ కళాశాల మైదానంలో హోరాహోరీగా సాగుతున్నాయి. రెండవ రోజు ఆదివారం బాలికల విభాగంలో పంజాబ్ జట్టు సిబిఎస్‌ఈ జట్టుపై, ఒరిస్సా జట్టు కేరళపై, తమిళనాడు జట్టు ఎన్‌విఎస్‌పై, విద్యాభారతి జట్టు జమ్ము కాశ్మీర్‌పై, బిహార్ జట్టు ఉత్తరప్రదేశ్‌పై, కర్ణాటక జట్టు రాజస్ధాన్‌పై, ఢిల్లీ జట్టు వెస్ట్‌బెంగాల్‌పై, చత్తీస్‌ఘడ్ జట్టు చండీఘర్‌పై, కేరళ జట్టు తెలంగాణపై, పంజాబ్ జట్టు ఎన్‌విఎస్‌పై, గుజరాత్ జట్టు జమ్ముకాశ్మీర్‌పై, మధ్యప్రదేశ్ జట్టు బిహార్‌పై, మహారాష్ట్ర జట్టు చండీఘర్‌పై, ఆంధ్రప్రదేశ్ జట్టు రాజస్ధాన్‌పై, వెస్ట్‌బెంగాల్ జట్టు జార్ఖండ్‌పై, ఒరిస్సా జట్టు గోవాపై విజయం సాధించారు.
బాలుర విభాగంలో..
చత్తీస్‌ఘర్ జట్టు ఉత్తరాఖాండ్‌పై, ఉత్తరప్రదేశ్ జట్టు సిబి ఎస్ ఈపై, మహారాష్ట్ర జట్టు త్రిపురపై, గుజరాత్ జట్టు బిహార్‌పై, రాజస్ధాన్ జట్టు తమిళనాడుపై, విద్యాభారతి జట్టు వెస్ట్‌బెంగాల్‌పై, హరియానా జట్టు చండీఘర్‌పై, మహారాష్ట్ర జట్టు గోవాపై, ఒరిస్సా జట్టు సిబి ఎస్ ఈపై, ఢిల్లీ జట్టు తెలంగాణపై, బిహార్ జట్టు పుడిచ్ఛెరిపై, రాజస్థాన్ జట్టు మధ్యప్రదేశ్‌పై, ఆంధ్రప్రదేశ్ జట్టు వెస్ట్‌బెంగాల్‌పై, చండీఘర్ జట్టు జార్ఖండ్‌పై, కేరళ జట్టు గోవాపై, పంజాబ్ జట్టు చత్తీస్‌ఘర్‌పై, ఢిల్లీ జట్టు కర్ణాటకపై, ఉత్తరప్రదేశ్ జట్టు ఒరిస్సాపై విజయం సాధించాయి.