నల్గొండ

దివ్యాంగులు మనోధైర్యంతో ముందుకెళ్లాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భువనగిరి,ఐ జనవరి 20: శారీరక లోపాలను అధిగమించి దివ్యంగులు మనోధైర్యంతో ముందుకు సాగాలని, వివిధ రంగాలలో నైపుణ్యం కలిగిన దివ్యంగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తామని ప్రభుత్వ విప్ గొంగిడి సునీత అన్నారు. శుక్రవారం భువనగిరి ఏరియా ఆసుపత్రిలో చౌటుప్పల్, సంస్థాన్‌నారాయణపురం, పోచంపల్లి, రామన్నపేట మండలాలకు చెందిన దివ్యంగులకు ఏర్పాటు చేసిన సదరం క్యాంపును గొంగిడి సునీత, కలెక్టర్ అనితారామచంద్రన్‌లు ప్రారంభించారు. ఈ సందర్భంగా దివ్యంగుల అంగవైకల్యశాతాన్ని నిర్ధారించేందుకు పరీక్షలు నిర్వహించారు. గొంగిడి సునీత మాట్లాడుతూ సదరం క్యాంపు నిరంతరం కొనసాగిస్తామని అన్నారు. విద్యావంతులైన వికలాంగులకు శిక్షణను ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని అన్నారు. వికలాంగులు అంగవైకల్యాన్ని అధిగమించి మనోధైర్యంతో ముందుకు సాగాలన్నారు. వికలాంగులకు పెన్షన్‌తో పాటు వివిధ రంగాలలో శిక్షణను ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ప్రభుత్వ అవకాశాలను వినియోగించుకోవాలని కోరారు.
నోట్ల రద్దుతో సామాన్యులకు ఇబ్బందులు
* సిపిఐ జాతీయ నాయకుడు పువ్వాడ
చిలుకూరు, జనవరి 20: పెద్దనోట్ల రద్దుతో సామాన్య ప్రజల నడ్డి విరిచారని కార్పోరేట్, బడా సంస్థల వ్యక్తులకు ఏ ఇబ్బంది కలగలేదని సామాన్యులే ఇబ్బందులు పాలు అయ్యారని సిపిఐ జాతీయ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే పువ్వాడ నాగేశ్వర్‌రావు అన్నారు.
శుక్రవారం మండలకేంద్రంలోని డిఎన్ భవన్‌లో జరిగిన దొడ్డా నర్సయ్య శతజయంతి ఉత్సవాల సందర్భంగా ఆయన పాల్గొని మాట్లాడారు. దేశ సమగ్రాభివృద్ది, ప్రజాపోరులో 10వేల మంది కమ్యూనిస్టులు బలిదానం చేసిన ఘనత సిపిఐ పార్టీదే అన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన టిఆర్‌ఎస్, కేంద్రంలో బిజెపి ప్రభుత్వాలు ప్రజలను ఆశయ పల్లకిలో ఊరేగిస్తున్నారని ప్రజలను ఎంతో కాలం మోసచేయలేరని విమర్శించారు.