నల్గొండ

అత్యాచారం.. గుప్త నిధుల కేసులో నిందితుల అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, ఫిబ్రవరి 20: గుప్త నిధుల కోసం మైనర్ బాలికను మభ్యపెట్టి పూజలు చేయించి అత్యాచారం చేసిన నిందితులను అరెస్టు చేసి కోర్టు రిమాండ్‌కు తరలించినట్లుగా డిఎస్పీ సుధాకర్ తెలిపారు. సోమవారం కేసు వివరాలను ఆయన విలేఖరులకు వెల్లడించారు. నార్కట్‌పల్లి మండలం నెమ్మాని గ్రామానికి చెందిన జె.లింగయ్యయాదవ్, అలుగుబెల్లి ఇందిరమ్మ, ఉయ్యల వెంకన్నలు గుప్త నిధుల తవ్వకాలతో ఒకేసారి భారీగా డబ్బు పొగేసుకునే ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇందుకోసం క్షుద్ర పూజలను నిర్వహించేందుకు హైద్రాబాద్, నిజామాబాద్‌లకు చెందిన వినోద్‌కుమార్, విలియం వినోద్‌లను పిలిపించుకున్నారు. బాజకుంటకు చెందిన రాజు, మహేష్, పాపట్ల కళమ్మ, అశ్వారావుపల్లి రేణుకలతో కలిసి వారంతా ముఠాగా ఏర్పడ్డారు. గుప్త నిధుల తవ్వకాల కోసం నెమ్మానికి చెందిన మైనర్ బాలికను వారు మాయమాటలతో లోబరుచుకుని బాలికతో ఇటీవల అర్వపల్లిలో, అల్గుబెల్లి ఇందిరమ్మ ఇంట్లో క్షుద్ర పూజలు నిర్వహించి గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపారు. పూజల అనంతరం మైనర్ బాలికపై అత్యాచారం చేశారు. బాధితురాలు, ఆమె తండ్రి ఫిర్యాదు మేరకు సంబంధిత సెక్షన్‌లను అనుసరించి కేసు నమోదు చేశామన్నారు. ప్రధాన నిందితులుగా ఉన్న వినోద్‌కుమార్, విలియం వినోద్, ఉయ్యాల వెంకన్న, ఇందిరమ్మ, కళమ్మ, రేణుకలను అరెస్టు చేసి కోర్టుకు రిమాండ్ చేసినట్లుగా తెలిపారు. ఈ సమావేశంలో సిఐలు సుబ్బరాంరెడ్డి, ఎస్‌ఐ గోవర్ధన్, సిబ్బంది ప్రభాకర్, విష్ణులు ఉన్నారు.
ఆన్‌లైన్ మోసగాడి అరెస్ట్
ఆలేరు, ఫిబ్రవరి 20: ఒఎల్‌ఎక్స్ ఆన్‌లైన్ వ్యాపారంలో మోసం చేస్తూ పట్టుబడిన నిందితుడిని సోమవారం అరెస్ట్‌చేసి ఆలేరు పోలీసులు రిమాండ్‌కు తరలించారు. వివరాల్లోకి వేల్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజమండ్రి రాజేంద్ర నగర్‌కు చెందిన మద్ద వినోద్ తనకు కారులేకున్న ఉన్నట్లు బ్రమింపజేస్తూ ఒఎల్‌ఎక్స్ ఆన్‌లైన్ వ్యాపారంలో తన కారును విక్రయిస్తున్నట్లు నవంబర్‌లో ప్రకటన ఇచ్చారు. యాదాద్రి జిల్లా రాజపేట మండల పుట్టగూడం గ్రామానికి మూడోతు నర్సింహా ఈ ప్రకటనను చూసి వినోద్‌ను ఆన్‌లైన్‌లో సంప్రదించగాకారును 3.50 లక్షలకు విక్రయిస్తానని చెప్పి ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ క్రమంలో తనకు వేరే ప్రాంతానికి బదిలీ అయిందని, ముందస్తుగా డబ్బును తమ ఖాతాలో జమచేయమని కోరగా ఇది నమ్మి 1 లక్ష 40 వేల రూపాయలను నాలుగు విడుతలుగా వినోద్ ఖాతాకు జమచేశారు. అనుమానం వచ్చి వినోద్‌ను కారు ఏదని అడగగా తనకు ఒరిస్సా బార్డర్‌లోని అటవీ ప్రాంతానికి బదిలీ అయిందని బుకాయించాడు. దీంతో అనుమానం వచ్చి నర్సింహా ఆలేరు పోలీసులను సంప్రదించాడు. ఎస్సై కేసు నమోదు చేసుకొని, సెల్‌ఫోన్ డాటా, ఆన్‌లైన్ డాటా అధారంగా నిందితుడిని అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.
నేత కార్మికులను ఆదుకుంటాం
* హ్యాండ్‌లూమ్ క మిషనర్ శైలజా రామయ్యర్
భూదాన్‌పోచంపల్లి, ఫిబ్రవరి 20: నేత కార్మికులకు ఆదుకునేందుకు తగిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర హ్యాండ్‌లూమ్ కమిషనర్ శైలజా రామయ్యర్ అన్నారు. సోమవారం సాయంత్రం మండల కేంద్రంలోని టూరిజం పార్కులో నేత కార్మికులు, మహిళలు, చేనేత సంఘాల ప్రతినిధులు, మాస్టవ్‌వీవర్లు, ప్రైవేట్‌షాపు యజమానులచే జరిగిన సమావేశంలో కష్టసుఖాలు తెలుపుకున్నారు. రోజు పనిచేస్తే ఎంత గిట్టుబాటు వస్తుంది. మీ ఇంట్లో ఎంతమంది పనిచేస్తారు, ప్రభుత్వ గుర్తింపుకార్డులు ఉన్నాయా, మీకున్న సమస్యలు ఏంటి మీకేం కావాలి ? మార్కెటింగ్ సౌకర్యం కావాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలని అడిగి తెలుసుకున్నారు. నూలు ధరలను నియంత్రించాలని నూలు ఢిపో ఏర్పాటు చేయాలని, ప్రింటింగ్‌ను అరికట్టాలని, వస్త్రాల కొనుగోలు చేసేందుకు మార్కెట్‌లను ఏర్పాటు చేయాలని, అర్హులందరికి గుర్తింపు కార్డులు, హెల్త్‌కార్డులు ఇవ్వాలని కోరారు. ఈసందర్భంగా మాట్లాడుతూ నేతన్నలను ఆర్ధిక అభివృద్ధికి తోడ్పాటు అందిస్తామని, మార్కెట్ సమస్యలు రాకుండా ప్రభుత్వ తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈకార్యక్రమంలో యాదాద్రి జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్, జిల్లా హ్యాండ్‌లూమ్ ఎడి పద్మ, జిల్లా గ్రామాణాభివృద్ధి అధికారి వెంకటరావు, ఆర్డీవో సూరజ్ కుమార్, ఎంపిపి సారె సరస్వతి, ఎంపిడివో నరేందర్ రెడ్డి, సర్పంచ్ తడక లతా, నాయకులు భాస్కర్, రమేష్, వాసుదేవ్, లక్ష్మీ నారాయణ, మురళీ, యాదగిరి, తదితరులు పాల్గొన్నారు.