నల్గొండ

రైతు సంక్షేమ పథకాలపై శే్వతపత్రం విడుదల చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేరేడుచర్ల, ఏప్రిల్ 20: రైతు పక్షపాతి అని చెప్పుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం మూడు సంవత్సరాల్లో రైతు సంక్షేమం కోసం చేపట్టిన పనులపై శే్వతపత్రం విడుదల చేయాలని కిసాన్‌మోర్చ రాష్ట్ర అధ్యక్షుడు గోలి మధుసుదన్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఆయన గురువారం నేరేడుచర్లలో బిజెపి నేరేడుచర్ల, పాలకీడు, గరిడేపల్లి మండలాల స్థాయి సమావేశాల్లో మాట్లాడుతూ విడతలవారీగా రైతు రుణమాఫీ చేయడంతో రైతుల జీవితం దుర్భరంగా మారిందన్నారు. కేంద్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన ఇన్‌పుట్ సబ్సిడీ కూడా రాష్ట్ర ప్రభుత్వం చెల్లించలేదన్నారు. కేంద్రం ఇచ్చిన నిధులను దారి మళ్లిస్తూ సొమ్ము కేంద్రానిదిగా సోకు రాష్ట్రానిదిగా వ్యవహరిస్తుందని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చే విధంగా మిర్చి రైతులకు రూ.1500 బోనస్ ఇవ్వాలని, రైతులను కాపాడడానికి రాష్ట్ర ప్రభుత్వాలు బోనస్‌లు ఇవ్వాలన్నారు. ఈనెల 23న నల్లగొండలో ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పార్లమెంట్ స్థాయి సమావేశాలు నిర్వహిస్తున్నట్లు, 1650 బూత్‌ల నుండి నాయకులు, కార్యకర్తలు తరలివస్తారని పేర్కొన్నారు. ఈసమావేశంలో అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి బొబ్బా భాగ్యారెడ్డి, కిసాన్‌మోర్చ జిల్లా కార్యదర్శి గంగా వేణుగోపాల్‌రెడ్డి, మండల బిజెపి అధ్యక్షుడు బాలా వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి శీలం వీరేంద్రనాయుడు, గిరిజన మోర్చ రాష్ట్ర కార్యదర్శి మర్రినాయక్, నాయకులు అశోక్‌రెడ్డి, రాచకొండ రామకోటేశ్వర్‌రావు, మెట్టు శ్రీనివాస్‌రెడ్డి, తాళ్లూరి రమేశ్, చిన్నపల్లి శ్రీనివాస్, కడారి ఎల్లయ్యలు పాల్గొన్నారు.

కూలీ పనులు చేసి 10.25 లక్షలు
సంపాదించిన జిల్లా పరిషత్ చైర్మన్ బాలూనాయక్
దేవరకొండ, ఏప్రిల్ 20: వరంగల్ పట్టణంలో ఈ నెల 27 న జరుగనున్న టిఆర్‌ఎస్ పార్టీ ప్లీనరీ సమావేశాలకు వెళ్ళేందుకు సిఎం కెసిఆర్ ఆదేశాల మేరకు జిల్లా పరిషత్ చైర్మన్ నేనావత్ బాలూనాయక్ గురువారం రోజు నియోజకవర్గంలోని దేవరకొండ, కొండమల్లేపల్లి, చింతపల్లి, పెద్దఅడిశర్లపల్లి మండలాల్లోని పలు మిల్లులు, స్వర్ణకారుల దుకాణం, సామిల్లుల్లో పని చేసి 10.25 లక్షల కూలీని సంపాదించారు. దేవరకొండ పట్టణంలోని స్వర్ణకారుల దుకాణంలో, గాంధీనగర్‌లోని కట్టెమిల్లులో కర్రలను కోశారు. దీంతో దేవరకొండ మండలంలో 4.25 లక్షలు, చింతపల్లి మండలంలో75 వేలు, డిండి మండలంలో లక్ష, కొండమల్లేపల్లి మండలంలో 2.75 లక్షలు, పెద్దఅడిశర్లపల్లి మండలంలో 1.50 లక్షల రూపాయల కూలీ డబ్బులను సంపాదించారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి మేకల శ్రీనివాస్‌యాదవ్, రవినాయక్, మేడారం రాజమ్మ, చింతపల్లి జడ్పీటిసి హరినాయక్, నగరపంచాయతి చైర్మెన్ కేతావత్ మంజ్యానాయక్, ముక్కమళ్ల వెంకటయ్యగౌడ్, నాయిని మాదవరెడ్డి, నాయకులు ఎంఎ సిరాజ్‌ఖాన్, హన్మంతు వెంకటేశ్‌గౌడ్, సురేశ్‌గౌడ్, కొర్ర రాంసింగ్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.

అగ్ని ప్రమాదాలపై అవగాహన అవసరం
* ఎస్పీ ప్రకాశ్‌రెడ్డి

నల్లగొండ రూరల్, ఏప్రిల్ 20: ప్రజలు అగ్ని ప్రమాదాలపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా ఎస్పీ ప్రకాశ్‌రెడ్డి కోరారు. నల్లగొండ అగ్నిమాపక కార్యాలయంలో గురువారం జరిగిన అగ్నిమాపక వారోత్సవాల ముగింపు కార్యక్రమానికి ఆయన హజరై మాట్లాడారు. వేసవికాలంలో ఎక్కువగా అగ్ని ప్రమాదాలు జరుగుతాయని తక్షణమే సిబ్బంది స్పందించాలని ఆయన కోరారు. వివిధ పట్టణాల్లో ప్రభుత్వ నిభందనల మేరకు అపార్టుమెంట్లు, ఇండ్లు, షాపింగ్ మాల్స్ కట్టి అగ్ని ప్రమాదాలలో ఆస్థి, జన నష్టం జరుగకుండా చూడాలన్నారు. ఈ సందర్భంగా విద్యార్ధులకు నిర్వహించిన ప్రతిభాపాటవ పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులు షీల్డులు బహుకరించారు. అంతకు ముందు అగ్నిమాపక శాఖ నూతన బుల్లెట్‌ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఫైర్ అధికారి యజ్ఞనారాయణ్, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.