నల్గొండ

పేదోడి గూడుకు మోక్షం ఎన్నడో..?!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హుజూర్‌నగర్, మే 2: ఐదేళ్లుగా హుజూర్‌నగర్‌లో పేదోడి సొంతింటి కలకు మోక్షం లభించడం లేదు. పట్టణ సమీపంలోని రామస్వామి గట్టు వద్ద ఐదేళ్ల క్రితం అప్పటి కాంగ్రొస్ ప్రభుత్వం 120 ఎకరాలలో 4వేల పక్కా గృహాలు నిర్మించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుండి రూ.250 కోట్ల నిధులతో పథకం రూపొందించింది. ఇందులో 2వేల గృహాలు గ్రౌండ్ ప్లస్ వన్, 2వేల గృహాలు విడిగా స్వతంత్రంగా నిర్మాణం చేయించాలని మంజూరు చేసి పనులు ప్రారంభించింది. పక్కా గృహాల నిర్మాణం కొన్ని పూర్తి కాగా తొలుత పట్టాలు పొందిన కొందరు లబ్ధిదారులు గృహాలలో చేరారు. ఈలోగా 2014 సంవత్సరంలో టిఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తూనే పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మాణం చేయించి ఇస్తామని వాగ్ధానం చేసింది. కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక కూడా ఊడిపోయినట్లు పక్కా గృహాల నిర్మాణం పూర్తి కాక, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు కాక పట్టణంలోని పేదలు సుమారు 4, 5 వేల మంది రామస్వామి గట్టు వద్ద ఇండ్ల నిర్మాణం ఎప్పుడు పూర్తి అవుతుందోనని గత 3 సంవత్సరాల నుండి ఎదురుచూస్తున్నారు. గ్రౌండ్ ప్లస్ వన్ పక్కా గృహాలు సుమారు 1000 వరకు నిర్మాణం పూర్తి అయినా జిల్లా కలెక్టర్లు వీటిపై నిర్ణయం తీసుకోలేక సతమతమైతున్నారు. ప్రభుత్వ పాలసీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కావటంతో వీటిని డబుల్ చేయాలా ఇలాగే ఉంచి పంపిణీ చేయాలా, ఒక వేల డబుల్ చేయాలంటే నిర్మాణాలను ఎలా చేయాలనే దానిపై గత 3 సంవత్సరాలుగా పర్యటనలు చేయటం తప్ప ఒక నిర్ణయం తీసుకుని రోడ్ల పక్కన, సాగర్ కాలువ కట్టలపై గత 30, 40 సంవత్సరాల నుండి నివసిస్తున్న పేదలకు పంపిణీ చేయలేకపోతున్నారు. 4వేల గృహాల కాలనీకి ప్రస్తుతం 1200 గృహాలు మాత్రమే అరకొరగా నిర్మాణం చేశారు. ఇంకా 2800 గృహాలు నిర్మాణం చేయవలసి ఉన్నది. జిల్లా కలెక్టర్లు, మంత్రులు ఇప్పటికే చాలా సార్లు రామస్వామి గట్టు వద్ద గృహాల కాలనీని పరిశీలించారు కాని ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవటంతో పేద బలహీన వర్గాల ప్రజలు ఎదురు చూపులతో కాలం గడుపుతున్నారు.

కెసిఆర్ పాలనలో రాష్ట్రం అభివృద్ధి
* 20ఏళ్ల వరకు టిడిపి, కాంగ్రెస్‌లకు రాజకీయ నిరుద్యోగమే..
* ఎంపి బూర నర్సయ్య గౌడ్

అర్వపల్లి, మే 2: అరవై ఏళ్ల తర్వాత వలస పాలకుల నుండి విముక్తి పొందిన రాష్ట్రంలో అభివృద్ధి ఎలా చేయాలో ముఖ్యమంత్రి కెసిఆన్ చేసి చూపిస్తున్నారని ఎంపి బూర నర్సయ్యగౌడ్ అన్నారు. మంగళవారం నాగారం మండలం ఈటూరు, వర్దమానుకోటలో మిషన్ కాకతీయ పనులను, అర్వపల్లి, నాగారం మండల కేంద్రాల్లో మిషన్ భగీరథ వాటర్ ట్యాంకుల శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన సమావేశంలో ఎంపి బూర మాట్లాడుతూ ఈటూరు చెర్వుకు రూ.40లక్షలు, వర్దమానుకోట పెద్దచెర్వుకు రూ.86లక్షలతో అభివృద్ధి పనులు చేస్తున్నట్లు తెలిపారు. బంగారు తెలంగాణే ధ్యేయంగా ముందుకు వెళ్తున్న ముఖ్యమంత్రి కెసిఆర్‌కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. మరో 20ఏళ్ల వరకు టిడిపి, కాంగ్రెస్ నాయకులు రాజకీయ నిరుద్యోగులుగా ఉండాల్సిందే అన్నారు. పూర్తిగా వెనుకబడిన తుంగతుర్తి నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేసేందుకు వెలుగుపల్లిలో ఉన్న రుద్రమచెర్వును రిజర్వాయర్‌గా మార్చి కాళేశ్వరం నీటితో నింపేందుకు మంత్రి జగదీశ్‌రెడ్డి కృషితో పనులు చేస్తున్నామన్నారు. ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కుమార్ మాట్లాడుతూ 2019 నాటికి రైతులకు సాగునీరు, తాగునీరు, 24గంటల ఉచిత విద్యుత్, గుంటలు లేని రహదారులు నిర్మించి తుంగతుర్తి నియోజకవర్గాన్ని రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలుపుతామన్నారు. తుంగతుర్తిలో ఉన్న ప్రభుత్వం ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేస్తామన్నారు. వెలుగుపల్లిలో ఉన్న ప్రభుత్వ భూమిలో లెదర్ ఫ్యాక్టరీ ఏర్పాటుచేసి 3వేల మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తామన్నారు. స్టేషన్ ఘన్‌పూర్ నుండి సూర్యాపేట వరకు కేంద్ర మంత్రులు, ఎంపి సహకారంతో రైల్వే లైన్‌ను సాధిస్తామన్నారు. కార్యక్రమంలో తిరుమలగిరి మార్కెట్ కమిటీ చైర్మన్ పాశం విజయయాదవ్‌రెడ్డి, పిఏసిఎస్ చైర్మన్ అశోక్‌రెడ్డి, ఎంపిపిలు కొమ్మినేని సతీష్, దావుల మనీషా, జడ్పీటిసిలు సంద అమల, పేరాల పూలమ్మ, వైస్ ఎంపిపి సుంకరి జనార్దన్, బొడ్డు వెంకన్న, సర్పంచ్‌లు సిహెచ్ చంద్రవౌళి, మామిడి రమణమ్మ, ప్రమీళ, సావిత్రమ్మ, ఎంపిటిసిలు రజిత, మధు, రాణి, టిఆర్‌ఎస్ నాయకులు అంబయ్య, సురేందర్‌రెడ్డి, కె. ఉప్పలయ్య, శోభన్‌బాబు, రఘునందన్‌రెడ్డి, సత్తిరెడ్డి, జగన్నాథం తదితరులు పాల్గొన్నారు.