నల్గొండ

నేటి నుండి పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామగిరి, ఏప్రిల్ 20: పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష గురువారం జరగనుంది. జిల్లా వ్యాప్తంగా మూడు కేంద్రాలలో ప్రవేశపరీక్ష నిర్వహించనున్నారు. నల్లగొండలో 16కేంద్రాలు, కోదాడలో మూడు, సూర్యాపేటలో ఏడు ప్రవేశ పరీక్షకు పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. నల్లగొండలో 7వేల 299మంది, కోదాడలో 2వేల 373మంది, సూర్యాపేటలో 2వేల 438మంది విద్యార్థులు హాజరు కానున్నారు. కాగా, ప్రవేశ పరీక్షకు జిల్లా సమన్వయ కర్తగా స్థానిక ప్రభుత్వ పాలిటెక్నిక్ ప్రిన్సిపల్ అల్లం లింగం వ్యవహరిస్తారు. వీరితోపాటు రెవిన్యూ, జిల్లా విద్యాశాఖ నుండి ఒక్కొక్క అధికారి పరీక్షా నిర్వాహణా తీరును పర్యవేక్షిస్తారు. సెంట్రల్ లెవల్ అబ్జర్వర్‌గా మహబూబ్ నగర్ జిల్లా గజ్వేల్ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ ప్రవేశ పరీక్షను పరిశీలిస్తారు.

విద్యార్థులకు సూచనలు
ప్రవేశ పరీక్షలు రాసే ప్రతి విద్యార్థి పరీక్షకు వచ్చేటపుడు హెచ్‌పి పెన్సిల్, ఎరైజర్, షార్పునర్ వెంట తెచ్చుకోవాలి. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించరు. ప్రవేశ పరీక్ష ఉదయం 11గంటల నుండి 1గంటల వరకు నిర్వహించనున్నారు. పరీక్షా హాల్‌లోకి పరీక్షా సమయానికంటే ఒక గంట ముందే ప్రవేశానికి అనుమతి ఉంది.

అన్ని ఏర్పాట్లు పూర్తి
జిల్లా వ్యాప్తంగా ప్రవేశ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని పాలిసెట్ 2016 జిల్లా కన్వీనర్, నల్లగొండ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ అల్లం లింగం బుధవారం తెలిపారు. విద్యార్థులు ప్రశాంతంగా ప్రవేశ పరీక్షకు హాజరు కావాలన్నారు. విద్యార్థులు పరీక్షకు హాజరయ్యేటపుడు వేసవి దృష్ట్యా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పరీక్షా కేంద్రాలలో వౌలిక వసతులు కూడా ఏర్పాటు చేశామన్నారు. ఆయా పరీక్షా కేంద్రాల సిఎస్‌లు, డివోలు తగు చర్యలు తీసుకోవాలన్నారు.