నల్గొండ

ఫసల్ బీమాను ప్రక్షాళన చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చౌటుప్పల్, అక్టోబర్ 21: ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకాన్ని రైతులకు ప్రయోజనం కల్గించేవిధంగా ప్రక్షాళన చేయాలని భువనగిరి పార్లమెంటు సభ్యుడు బూర నర్సయ్యగౌడ్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని పార్లమెంటు సమావేశాల్లో ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తానని చెప్పారు. చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్ యార్డులో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డితో కలిసి మాట్లాడారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకం లక్ష్యం గొప్పగా ఉన్న ఆచరణ శూన్యంగా ఉందన్నారు. రైతుల నుంచి బీమా సొమ్ములు తీసుకున్నారు కానీ గత యేడాది జరిగిన నష్టాన్ని మాత్రం ఇంత వరకు ఇవ్వలేదన్నారు. కనీసం జరిగిన నష్టం వివరాలు రికార్డులు, ఆన్‌లైన్‌లో కూడా ఎంట్రీ చేయలేదన్నారు. ఇప్పటికైనా కేంద్రం స్పందించి రైతులకు పరిహారం అందించి ఆదుకోవాలని, ఫసల్ బీమాను ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేశారు. చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం శివారులో కాలుష్య రహితంగా ఏర్పాటు చేయనున్న ఇండస్ట్రీయల్ పార్కును డిసెంబర్‌లో ముఖ్యమంత్రి చేతుల మీదుగా శంకుస్థాపన చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. ఇండస్ట్రీయల్ పార్కు ఏర్పాటుతో ఈ ప్రాంతంలోని నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. స్థానికులకే 80 శాతం ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుందన్నారు. పరిశ్రమలకు అవసరమైన శిక్షణను నిరుద్యోగ యువతకు ముందే ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. పరిశ్రమలకు ఎలాంటి స్కిల్స్ కావాలో ముందుగానే యువతకు శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. వచ్చే బడ్జెట్‌లో ఫ్లోరైడ్ పరిశోధన కేంద్రానికి నిధులు కేటాయించేందుకు ప్రభుత్వం అంగీకరించిందని బూర తెలిపారు. హైస్పీడ్ ఎక్స్‌ప్రెస్ రైలుకు పార్లమెంటులో బీజం వేసామన్నారు. ఎప్పుడైనా ఏర్పాటు అయ్యే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. ఈ సమావేశంలో జెడ్పీటిసి సభ్యుడు పెద్దిటి బుచ్చిరెడ్డి, సర్పంచ్‌లు బొంగు లావణ్య, ముటుకులోజు దయాకరాచారి, ఆల్మాసుపేట కిష్టయ్య, ముత్యాల భూపాల్‌రెడ్డి, కానుగు బాలరాజు, శశిధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.