నల్గొండ

డిఎస్సీతో 481పోస్టుల భర్తీ !

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, అక్టోబర్ 21: రాష్ట్ర ప్రభుత్వం శనివారం జారీ చేసిన టీచర్స్ రిక్రూట్‌మెంట్ టెస్ట్(డిఎస్సీ) నోటిఫికేషన్‌తో ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలో వివిధ కేటగిరిలోని 481ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ కానున్నాయి. ప్రభుత్వం 8,792పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. ఇందులో నల్లగొండ జిల్లా పరిధిలోని 197పోస్టులు, సూర్యాపేట జిల్లాలో 156పోస్టులు, యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలో 128ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయనున్నారు. ఇందులో నల్లగొండ జిల్లా పరిధిలో సెకండరీ గ్రేడ్ టీచర్స్(ఎస్‌జిటి) పోస్టులు 26, స్కూల్ అసిస్టెంట్స్(ఎస్‌ఏ)లు 110, లాంగ్వేజ్ పండిట్స్(ఎల్‌పి)లు 37, పిఈటిలు 17పోస్టులు, సూర్యాపేట జిల్లాలో ఎస్‌జిటిలు 8, ఎస్‌ఏలు 106, ఎల్‌పిలు 27, పిఈటిలు 15పోస్టులు, యాదాద్రి భువనగిరి జిల్లాలో ఎస్‌జిటిలు 6, ఎస్‌ఏలు 71, ఎల్‌పిలు 31, పిఈటిలు 20పోస్టులు భర్తీ కానున్నాయి. టిఎస్‌పిఎస్సీ ద్వారా జరిగే ఉపాధ్యాయ పోస్టుల భర్తీ నోటిఫికేషన్ ప్రస్తుతం వివాద రహిత పోస్టులకు మాత్రమే జారీ కాగా జిల్లాల్లో మరిన్ని ఉపాధ్యాయ పోస్టులు ఖాళీ ఉన్నాయని వాటిని కూడా వెంటనే భర్తీ చేసి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఉపాధ్యాయ సంఘాలు కోరతున్నారు. మరోవైపు డిఎస్సీ నోటిఫికేషన్ జారీ పట్ల టిఆర్‌ఎస్‌వి, టిఆర్‌ఎస్ శ్రేణులు సిఎం కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకాలు నిర్వహిస్తు హర్షాతీరేకాలు వ్యక్తం చేశాయి.