నల్గొండ

కెసిఆర్ యాగ ఫలపే వర్షాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యాదగిరిగుట్ట, అక్టోబర్ 21: యాదాద్రి శ్రీ లక్ష్మినర్సింహ్మస్వామి దేవస్థానం అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని హోంమంత్రి నాయిని నర్సింహ్మారెడ్డి, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంధ్రఖరణ్ రెడ్డి అన్నారు. శనివారం యాదాద్రి క్షేత్రాన్ని సందర్శించుకున్నారు. ఆలయంలో స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.పూజారులు స్వామి ఆశీస్సులు అందజేశారు. అనంతరం ఆలయ అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో ఏ నాయకుడు చేయని విధంగా సిఎం కెసిఆర్ యాదాద్రికి వేల కోట్ల రూపాయలు వెచ్చించి విశ్వ విఖ్యాతి చెందేలా అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. అంతకు ముందు యాదాద్రి సమిపంలో నిర్వహిస్తున్న శ్రీ పంచాయతన సహిత అయుత శ్రీ మహావిష్ణు మహోత్కష్ట విశ్వశాన్తి మహాయాగాన్ని సందర్శించారు. అనంతరం మాట్లాడుతూ ఈ యాగం విశిష్టత చాలా గొప్పదని విశ్వశాంతి కోసం, మానవాలి కోసం, ధన ప్రాప్తికి, విద్యా, మేధాప్రాప్తికి, ఐశ్వర్య సిద్ధికి ఉపకరిస్తుందన్నారు. సిఎం కెసిఆర్ ఆనాడు అయుత చండీ యాగం నిర్వహించడం వల్లనే ఇప్పుడు మనకు వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నాయని శ్రీశైలం, నాగార్జున సాగర్ లాంటి ప్రాజెక్టులు నీటితో కలకల లాడుతున్నాయని ఇదంతా ఆనాటి యాగ ఫలితమేనని చెప్పారు. బిసి, ఎస్‌సి, ఎస్టీల అభివృద్ధికి సిఎం కెసిఆర్ ఎంతగానో కృషి చేస్తున్నారని చెప్పారు. అంతకు ముందు పెద్ద గుట్టపై జరుగుతున్న అభివృద్ధి పనులను వారు పరిశీలించారు. సమావేశంలో ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే, గొంగిడి సునితారెడ్డి, దేవస్థానం కార్యనిర్వహనాధికారి ఎన్.గీత, వంశ పారంపర్య ధర్మకర్త బి.నర్సింహమూర్తి, తహశీల్దార్ రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.