నల్గొండ

గ్రంథాలయాల అభివృద్ధిలో భాగస్వాములు కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

- రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ అయాచితం శ్రీ్ధర్
మోత్కూర్, నవంబర్ 22: గ్రంథాలయాల అభివృద్ధిలో ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులతో పాటు ప్రతీ ఒక్కరూ భాగస్వాములు కావాలని రాష్ట్ర గ్రంథాలయాల చైర్మన్ అయాచితం శ్రీ్ధర్ కోరారు. బుధవారం స్థానిక గ్రంథాలయంలో నిర్వహించిన గ్రంథాలయ వారోత్సవాల ముగింపు కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. తన గౌరవ వేతనం నుంచి మోత్కూర్ శాఖా గ్రంథాలయ అభివృద్ధికి నిధులు అందజేస్తానని హామీ ఇచ్చారు. గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలని, కనీసం గంట సమయమైనా కేటాయించాలన్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు విధిగా సభ్యత్వం తీసుకొని గ్రంథాలయ అభివృద్ధికి పాటుపడాలన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గ్రంథాలయాలు అభివృద్ధికి నోచుకున్నట్లు తెలిపారు. వచ్చే గ్రంథాలయ వారోత్సవాలకు స్థానిక గ్రంథాలయం అదనపు భవనం ఏర్పాటుకు కృషి చేయనున్నట్లు తెలిపారు. మోత్కూర్ గ్రంథాలయం గతంతో పోల్చుకుంటే చాలా అభివృద్ధికి నోచుకుందని, ఆ ఘనత కోమటి మత్స్యగిరికే చెందుతుందని పలువురు కొనియాడారు. ఈ సందర్భంగా ఎస్‌విఎన్ కిడ్స్ పాఠశాల విద్యార్థులు వివిధ కులవృత్తులపై నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని అలరించాయి. అనంతరం పలు పోటీల్లో విజేతలైన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ అమరేందర్‌గౌడ్, రాష్ట్ర ఉన్నత విద్యామండలి సభ్యుడు నర్సింహారెడ్డి, టీఆర్‌ఎస్ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి, మార్కెట్ చైర్మన్ మహేంద్రనాథ్, ఎంపీపీ ఓర్సు లక్ష్మి, జడ్పీటీసీ సిహెచ్.వరలక్ష్మి, సర్పంచ్ పిచ్చయ్య, ఎంపీటీసీలు జయశ్రీ, శ్రీను, అరవిందరాయుడు, భాస్కరాచారి, వెంకన్న, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.

సీఎం యాదాద్రి పర్యటనను అడ్డుకుంటాం
టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండ్రు శోభారాణి

ఆంధ్రభూమి బ్యూరో
నల్లగొండ, నవంబర్ 22: సీఎం కెసిఆర్ యాదాద్రి పర్యటనను యాదాద్రి భువనగిరి జిల్లా టిడిపి శాఖ ఆలేరు, భువనగిరి నియోజకవర్గం ప్రజలతో కలిసి అడ్డుకుంటుందని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఆలేరు నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జి బండ్రుశోభారాణి ప్రకటించారు. భువనగిరిలో ఆమె పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి జక్కుల ఐలయ్య యాదవ్‌తో కలిసి విలేఖరులతో మాట్లాడారు. ఇటీవల సీఎం కెసిఆర్ సూర్యాపేట బహిరంగ సభలో కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని గంథమల్ల, బస్వాపురం రిజర్వాయర్‌లు పేరుకే భువనగిరి డివిజన్‌లో ఉన్నా నీళ్లు మాత్రం సూర్యాపేట జిల్లాకు అందుతాయని ప్రకటించడాన్ని టిడిపి తీవ్రంగా నిరసిస్తుందన్నారు. గంథమల్ల, బస్వాపురం రిజర్వాయర్ల కింద వేల ఎకరాల భూములతో పాటు పలు గ్రామాలు ముంపుకు గురవుతున్నాయన్నారు. ముంపు బాధిత ప్రజలకు, రైతులకు నీరివ్వకుండా సూర్యాపేట జిల్లాకు నీటిని తరలించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నామన్నారు. దీనిపై సీఎం కెసిఆర్ ఆలేరు, భువనగిరి నియోజవకర్గ ప్రజలకు వివరణ ఇచ్చి ఈ ప్రాంతంలోని యాదాద్రి పర్యటనకు రావాలని తాము డిమాండ్ చేస్తున్నామన్నారు. అలాగే తపాస్‌పల్లి రిజర్వాయర్ ద్వారా దిగువన ఉన్న ఆలేరు, భువనగిరి నియోజకవర్గాలకు 10కోట్ల ఖర్చుతో నీరివ్వకుండా ఎగువన ఉన్న సిద్ధిపేట, కొండపాకలపై ప్రేమతో 50కోట్లు పెట్టి నీళ్లు తరలించుకపోవడంతో తమ ప్రాంతానికి అన్యాయం జరుగుతుందన్నారు. దీనిపై కూడా కెసిఆర్ ఈ ప్రాంత ప్రజలకు న్యాయమైన వివరణ ఇవ్వాలన్నారు. అలాగే ఆలేరు నియోజకవర్గంలోని యాదాద్రి దేవస్థానం అభివృద్ధి పనుల పురోగతిపై సీఎం కెసిఆర్ ప్రజలకు శే్వతపత్రం విడుదల చేయాలని తాము డిమాండ్ చేస్తున్నామన్నారు. ఆలయ అభివృద్ధి పనుల్లో తరుచు డిజైన్లు మారుస్తున్నారని, ఏడాదిలోగా పనులు పూర్తి చేస్తామని చెప్పి తరుచు పనుల పూర్తి గడువు మారుస్తున్నారని అసలు ఇప్పటిదాకా విడుదల చేసిన నిధులు, జరిగిన ఖర్చు, పనుల పూర్తి గడువులను వైటిడిఏ చైర్మన్‌గా సీఎం కెసిఆర్ పారదర్శకంగా ప్రజలకు శే్వతపత్రంతో వివరాలు వెల్లడించాలని కోరుతున్నామన్నారు. ఈ డిమాండ్లపై టిడిపి తమ నిరసన తెలుపుతు రేపు జరిగే సీఎం కెసిఆర్ యాదాద్రి పర్యటనను భువనగిరి డివిజన్ పరిధిలో అడ్డుకునేందుకు టిడిపి అన్ని ప్రయత్నాలు చేస్తుందని ఆమె స్పష్టం చేశారు.

నేత కార్మికులకు రుణాలందించాలి
- ఆర్‌డీడీ అంజయ్య
భూదాన్‌పోచంపల్లి, నవంబర్ 22: చేనేత కార్మికుల అభ్యున్నతి కోసం థ్రిఫ్ట్, చేనేత, ముద్ర రుణాలు అందించేందుకు అధికారులు కృషి చేయాలని హ్యాండ్లూమ్ రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ అంజయ్య అన్నారు. బుధవారం మండల పరిషత్ కార్యాలయంలో కలెక్టర్ ఆదేశాల మేరకు బ్యాంక్ అధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. థ్రిఫ్ట్, చేనేత, ముద్ర రుణాల మంజూరులో జాప్యం జరుగుతుందని, పోచంపల్లి, కొయ్యలగూడెం గ్రామాలను క్లస్టర్‌గా ఏర్పర్చామన్నారు. జిల్లాలో 17 వేల మగ్గాలకు గాను 5 వేల మగ్గాలకు జియో ట్యాగింగ్‌ను పూర్తి చేశామని తెలిపారు. పోచంపల్లిలో 1765 మగ్గాలు పూర్తయ్యాయని, 10 వేల థ్రిఫ్ట్ ఖాతాలు తెరిపించాలనే లక్ష్యం పెట్టుకున్నట్లు ఆయన వివరించారు. జియో ట్యాగింగ్ చేసిన మగ్గంపై ఆధారపడిన కుటుంబంలో ఇద్దరు థ్రిఫ్ట్ పథకంలో చేరవచ్చన్నారు. థ్రిఫ్ట్ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం 300 కోట్లు కేటాయించిందని, నేత కార్మికులందరూ ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో డీఆర్‌డీవో వెంకట్రావు, లీడ్ బ్యాంక్ అధికారి శ్రీనివాస్, సూపరింటెండెంట్ రవీంద్రబాబు, కెనరా బ్యాంక్ మేనేజర్ కృష్ణమోహన్, ఎస్‌బీఐ మేనేజర్ కార్తీక్, చేనేత నాయకులు చింతకింది రమేష్, ఎస్.శ్రీనివాస్, గంజి అంజయ్య, కర్నాటి పురుషోత్తం, రచ్చ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

భవిష్యత్ కమ్యూనిస్టులదే..
- సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి
నల్లగొండ రూరల్, నవంబర్ 22: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అడ్డగోలు వాగ్ధానాలతో ప్రజలను మభ్యపెడుతున్నాయని, పేద బడుగు బలహీన వర్గాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, రానున్న రోజుల్లో భవిష్యత్ కమ్యూనిస్టులదేనని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి అన్నారు. బుధవారం పట్టణంలోని లెక్చరర్స్ భవనంలో నిర్వహించిన నల్లగొండ మండల 6వ మహా సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. జాతీయ స్థాయిలో మోదీ ప్రభుత్వం దేశాన్ని అభివృద్ధిలోకి తీసుకొస్తామని, అవినీతిని నిర్మూలిస్తామని, నల్లధనాన్ని వెలికితీస్తామని తెలిపి నేడు ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తుందన్నారు. జీఎస్టీ, పెద్దనోట్ల రద్దు వంటి ఏకపక్ష నిర్ణయాలతో సామాన్య ప్రజలపై ఆర్థిక భారాన్ని మోపారని విమర్శించారు. తెలంగాణ సెంటిమెంట్‌తో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలుచేయకుండా అందుకు భిన్నంగా పరిపాలన కొనసాగిస్తుందన్నారు. ప్రాజెక్టుల డిజైన్లు మార్చడం, ఉద్యమాలను అణచివేయడం, పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ నైజాం పాలనను మరిపిస్తున్నారని ఎద్దేవా చేశారు. ప్రపంచంలో అత్యధిక దేశాల్లో ఉన్న పార్టీ సీపీఎం అని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్కువ అంచనా వేయవద్దన్నారు. ప్రపంచ వ్యాప్తంగా 150 కోట్ల ప్రజలకు కమ్యూనిస్టు పార్టీ అండగా ఉందన్నారు. రాష్ట్రంలో దిగజారుడు రాజకీయాలు, వలసల పరంపర కొనసాగుతుందని, దీనిని ఎండగట్టి కేసీఆర్‌ను గద్దె దించాలన్నారు. రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు నాయకులు, కార్యకర్తలు చురుగ్గా పాల్గొనాలన్నారు. ఫిబ్రవరిలో నల్లగొండలో నిర్వహించే రాష్ట్ర మహా సభలను జయప్రదం చేసేందుకు ప్రతీ ఒక్కరూ ఇప్పటి నుంచే కృషి చేయాలని పిలుపునిచ్చారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని పని చేయాలని, ఎన్నికల్లో నిజాయితీగా, మాయమాటలు చెప్పకుండా ఓట్లు వేయించుకోవాలన్నారు. ఈ మహా సభలో జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు పి.అనంతరామశర్మ, తుమ్మల వీరారెడ్డి, జిల్లా నాయకులు పాలడుగు నాగార్జున, ఎండీ.సలీం, పాలడుగు ప్రభావతి, ఊట్కూరి నారాయణరెడ్డి, బొల్లు వసంతకుమార్, కృష్ణారెడ్డి, సైదులు, సత్యనారాయణ, గుండాల యాదగిరి, అంజయ్య, కొండా వెంకన్న, గోపాల్, నగేష్, లింగస్వామి, బిక్షం, భారతమ్మ, యాదయ్య, బక్కయ్య, రాఘవాచారి తదితరులు పాల్గొన్నారు.

గ్రంథాలయ పోస్టులను భర్తీ చేస్తాం
రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ ఆయాచితం శ్రీ్ధర్
భువనగిరి, నవంబర్ 22: రాష్ట్రంలోని గ్రంథాలయాలలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తామని రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ ఆయాచితం శ్రీ్ధర్ అన్నారు. బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని గ్రంథాలయాన్ని ఆకస్మికంగా సందర్శించారు. గ్రంథాలయానికి సంబంధించిన వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. రికార్డులను, గ్రంథాలయంలోని వివిధ రకాల పుస్తకాలను పరిశీలించారు. గ్రంథాలయ పనితీరును పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జిల్లా గ్రంథాలయ సంస్థచైర్మెన్ జడల అమరేందర్‌గౌడ్ ఆధ్వర్యంలో రాష్ట్ర చైర్మన్ ఆయాచితం శ్రీ్ధర్‌ను శాలువ పూలమాలతోఘనంగా సన్మానించి జ్ఞాపికను అందజేశారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు డాక్టర్ జడల అమరేందర్‌గౌడ్, మున్సిపల్ చైర్‌పర్సన్ సుర్వి లావణ్యశ్రీనివాస్‌గౌడ్, పాలకమండలి సభ్యులు ఆడెపు బాలస్వామి, పొలిశెట్టి అనిల్‌కుమార్, తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి సభ్యుడు నర్సింహారెడ్డి, గ్రంథాలయాధికారి టి.మధుసూధన్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి బాలమ్మ, గ్రంథాలయ సిబ్బంది యాదగిరిస్వామి, రాజ్యలక్ష్మి, శ్రీనివాస్, శంకరయ్య తదితరులు పాల్గొన్నారు.

పారదర్శకంగా డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం
* కలెక్టర్ కె.సురేంద్రమోహన్
సూర్యాపేట, నవంబర్ 22: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణ పనులు జిల్లాలో శరవేగంగా జరుగుతున్నట్లు జిల్లా కలెక్టర్ కె.సురేంద్రమోహన్ తెలిపారు. హడ్కో డిజిఎం రహీమొద్దీన్, ట్రైనీ ఆఫీసర్ సురేష్‌కుమార్‌లు బుధవారం స్ధానిక కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్‌ను కలిశారు. ఈ సందర్భంగా జిల్లాలో డబుల్‌బెడ్ రూం ఇళ్ల పథకంపై సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ గతనెలలో సిఎం కేసీఆర్ జిల్లా కేంద్రంలోని గొల్లబజార్‌లో నిర్మించిన 192 ఇళ్లను ప్రారంభించారని, లబ్ధిదారులకు లాటరీ పద్దతిలో ఇళ్లను కేటాయించినట్లు వివరించారు. అదేవిధంగా మంత్రి కేటీఆర్ ఆదేశం మేరకు జిల్లాకేంద్రం శివారులోని జమునానగర్‌లో ఒక నిరుపేదకు ఇల్లును మంజూరు చేసినట్లు చెప్పారు. సూర్యాపేట మున్సిపాలిటీలో డబుల్ బెడ్‌రూం ఇళ్ల కోసం దరఖాస్తులు ఎక్కువగా రాగా 15 రెవెన్యూ బృందాలను ఏర్పాటుచేసి ప్రభుత్వ నిబంధనల మేరకు పరిశీలన జరిపి దరఖాస్తు చేసుకున్న వారిలో 1500 మందిని అర్హులుగా గుర్తించామని, వారిలోంచి లబ్ధిదారులకు లాటరీ ద్వారా ఎంపిక చేశామన్నారు. పెన్‌పహాడ్ మండలం సింగిరెడ్డిపాలెంలో 102 ఇళ్లను, చివ్వెంల మండలం తిరుమలగిరిలో 80, కేసారంలో 384 ఇళ్ల పనులు పురోగతిలో ఉన్నట్లు చెప్పారు. ఇళ్ల నిర్మాణానికి ఇసుక ఉచితంగా అందిస్తున్నామని, ఫ్లైయాష్ ఇటుకను వాడుతున్నామని, జిల్లాలో సిమెంట్ పరిశ్రమలు ఉన్నందున ఇళ్ల నిర్మాణం కోసం సిమెంట్‌ను తక్కువధరకు సరఫరా చేస్తున్నాయన్నారు. స్వచ్చ భారత్ కింద మరుగుదొడ్ల నిర్మాణం చేపడుతున్నామన్నారు. అనంతరం చివ్వెంల మండలం తిరుమలగిరి గ్రామంలో నిర్మిస్తున్న ఇళ్ల పనులను పరిశీలించారు. ఈసందర్భంగా హడ్కో డిజిఎం రహీమొద్దీన్ మాట్లాడుతూ డబుల్‌బెడ్ రూం ఇళ్ల పనులను వేగంగా పూర్తిచేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో పబ్బతిరెడ్డి యాదిరెడ్డి, ఆర్‌అండ్‌బి ఈఈ యాదగిరి తదితరులు ఉన్నారు.

భూదస్త్రాల శుద్ధీకరణలో సాదాబైనామాలకు మోక్షం
* తెరపైకి 54వేల పెండింగ్ దరఖాస్తుల పరిశీలన
తుంగతుర్తి, నవంబర్ 22: వివిధ కారణాలతో తిరస్కరణకు గురైన సాదాబైనామాల తతంగం మళ్లీ తెర మీదికొచ్చింది. ఈమేరకు వీటిపై మళ్లీ చేపట్టే విచారణలో అర్హతగా తేలిన భూములకు ఉచిత పట్టా రిజిస్ట్రేషన్ చేయాలని పేర్కొంటూ జిల్లా ఉన్నతాధికారులు ఆదేశాలు జారీచేశారు. దీంతో భూదస్త్రాల ప్రక్షాళనలో భాగంగా వీటిని కూడా అధికారులు పరిగణలోకి తీసుకుంటున్నారు. ఈ పరిణామాలతో మొన్నటి వరకు తిరస్కరణకు గురైన రైతుల్లో ఆశలు చిగురించాయి. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 54 వేల దరఖాస్తులు ప్రాథమిక దశలోనే తిరస్కరణకు గురైన విషయం తెలిసిందే. తెల్లకాగితంపై రాసుకున్న భూవిక్రయాలకు చట్టబద్దత కల్పించేందుకు సాదాబైనామాలను ఉచిత రిజిస్ట్రేషన్‌తో సహ పట్టాపాసుపుస్తకాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించడంతో రైతుల్లో సంతోషాలు వ్యక్తమయ్యాయి.
అడుగడుగునా అడ్డంకులతో ముందుకు..
గత ఏడాది జూన్ 1నుండి 15వరకు మీసేవా కేంద్రాల ద్వారా రైతుల నుండి సాదాబైనామాల దరఖాస్తులను స్వీకరించారు. తరువాత మళ్లీ వారం రోజులు పొడిగించడంతో దరఖాస్తుల సంఖ్య పెరిగి జిల్లాలో దాదాపు ఒకలక్ష 10వేలకు చేరింది. వీటిపై విచారణ జరపాలని భావిస్తున్న తరుణంలో జిల్లాల పునర్విభన అడ్డొచ్చింది. తిరిగి జిల్లాలు, మండలాల ఏర్పాటుకావడం, వచ్చిన దరఖాస్తులు విభజించడం వంటి పనులతో మరింత ఆలస్యమైంది. చివరికి జనవరిలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో సాదాబైనామాల ప్రక్రియలో కదలిక ఏర్పడింది. అప్పటివరకు ఉన్న ఐదెకరాల లోపు సాదాబైనామాల భూముల పట్టాల పరిమితి తిరిగి పదెకరాలకు పెంచుతూ ప్రభుత్వం మళ్ళీ ఉత్తర్వులు జారీచేసింది. దీంత అప్పటికే ఐదెకరాలలోపు పట్టాలను అందుకున్న రైతుల అభ్యర్థనతో మళ్ళీ విచారణలు జరిగాయి. ఈప్రక్రియ మొత్తంలో తిరస్కరణకు గురైన దరఖాస్తులను పరిశీలిద్దామంటే భూదస్త్రాల ప్రక్షాళన తెరమీదికొచ్చింది. జిల్లాలో స్వీకరించిన దాదాపు లక్షా10వేల దరఖాస్తుల్లో దాదాపు 54 వేల దరఖాస్తులు వివిధ కారణాలతో తిరస్కరణలకు గురవ్వడం అప్పట్లో ఆశ్చర్యాన్ని కలిగించింది. బాధితులకైతే అప్పటి వరకు ఉన్న ఆశలన్నీ నీరుగారాయి. ఇదిలా ఉంటే జిల్లా జాయింట్ కలెక్టర్ సంజీవరెడ్ది మాట్లాడుతూ భూదస్త్రాల ప్రక్రియలో భాగంగా తిరస్కరణకు గురైన సాదాబైనామాల దరఖాస్తులను విచారిస్తున్నామని తెలిపారు. ఈక్రమంలోమరిన్ని దరఖాస్తులు పరిష్కారమయ్యే అవకాశాలు ఉన్నాయని ఆయన వివరించారు. ప్రస్తుతం తిరస్కరణకు గురైన రైతుల సాదాబైనామాలను మళ్ళీ విచారించాలంటూ ఉన్నతాధికారుల నుండి ఆదేశాలు వెలువడటంతోరైతుల్లో మరోమారు సంతోషాలు వ్యక్తమయ్యాయి.
తిరస్కరణకు అనేక కారణాలు
చాలామంది రైతులు వద్ద నిర్ణీత పత్రాలు లేకపోవడం, విక్రయించిన వారు మరణించడం, భూమి స్వాధీనంలో ఉన్నప్పటికి వారి వారసులు పట్టాలు చేయకపోవడం, భూమి స్వాదీనంలో ఉన్నప్పటికి వారి వారసులు పట్టాలు చేసేందుకు నిరాకరించడం, తదితర ప్రధాన కారణాలతోసాదాబైనామాల దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం రెవెన్యూ దస్త్రాల ప్రక్షాళన కార్యక్రమంలో అధికారయంత్రాంగమంతా గ్రామాల బాటపట్టింది. గ్రామస్థుల సమక్షంలో ఆయా భూముల వివాదాలు కూడా పరిష్కరిస్తున్నారు. ఇదే సమయంలో సాదాబైనామాల దరఖాస్తులను పరిశీలిస్తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. గ్రామానికి వెళ్లినప్పుడు క్షేత్రస్దాయిలో పునర్విచారణ చేపట్టి నిబంధనలకు అనుగుణంగా అర్హులకు న్యాయం చేసే దిశలో వారు ఉన్నారు.

కాళేశ్వరం నీటిపై సీఎం కేసీఆర్ స్పష్టతనివ్వాలి
* లేదంటే కేసీఆర్ పర్యటనను అడ్డుకుంటాం
- డీసీసీ అధ్యక్షుడు బూడిద

ఆత్మకూర్(ఎం), నవంబర్ 22: కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని గంధమళ్ల, బస్వాపురం రిజర్వాయర్ల నీళ్లు సూర్యాపేట జిల్లా ప్రజలకు అందుతాయని ఇటీవల సూర్యాపేట సభలో సీఎం కేసీఆర్ ప్రకటించడంపై ఆలేరు నియోజకవర్గ ప్రజల్లో నెలకొన్న అనుమానాలపై సీఎం కేసీఆర్ రేపు జరిపే యాదాద్రి పర్యటన సందర్భంగా స్పష్టతనివ్వాలని డీసీసీ అధ్యక్షుడు బూడిద బిక్షమయ్యగౌడ్ డిమాండ్ చేశారు. బుధవారం ఆత్మకూర్(ఎం) మండల కేంద్రంలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ యాదాద్రి పర్యటనకు రావడం వెనుక ఉద్దేశాలేమిటో ఆయన ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేశారు. గంధమళ్ల, బస్వాపురం ముంపు బాధిత ఆలేరు, భువనగిరి నియోజకవర్గ ప్రజలకు, రైతులకు నీళ్లివ్వకుండా సూర్యాపేట జిల్లాకు కాళేశ్వరం నీళ్లను తరలించడం ముంపు ప్రాంతాల ప్రజలకు అన్యాయం చేయడమేనన్నారు. దీనిపై సీఎం కేసీఆర్ వివరణ ఇవ్వాలని, లేనట్లయితే ఆయన యాదాద్రి పర్యటనను అడ్డుకొని నిరసన తెలుపతామన్నారు. అలాగే బునాదిగాని మూసీ కాల్వ రైతులకు నీళ్లివ్వకుండా సాగర్ ఆయకట్టుకు మూసీ నీళ్లను అందిస్తామంటూ కేసీఆర్ రెండు ప్రాంతాల రైతులను గందరగోళానికి గురి చేస్తున్నారని బూడిద విమర్శించారు. సీఎం కేసీఆర్ ఇప్పటికే 8 సార్లు యాదాద్రి పర్యటనకు వచ్చినా ఆలయ అభివృద్ధి పనులు ముందుకు సాగడం లేదన్నారు. దీనిపై సీఎం కేసీఆర్ ప్రజలకు వివరణ ఇవ్వాలన్నారు. ఇప్పటికే సీఎం కేసీఆర్ దళితులకు మూడెకరాల భూమి, డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇస్తామని, మిషన్ భగీరథతో ఇంటింటికీ నీటి సరఫరా చేస్తామని చెప్పి నేటికీ హామీలు అమలుచేయలేదన్నారు. సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ముద్దసాని సిద్ధులు, నాయకులు నరేందర్‌గుప్తా, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ యాస లక్ష్మారెడ్డి, శ్రీను, నగేష్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

కొనసాగుతున్న తెలంగాణ ఉద్యమ కేసులు
చౌటుప్పల్, నవంబర్ 22: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి మూడున్నరేళ్లు పూర్తి అయినప్పటికీ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న యువకులు మాత్రం కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి రాగానే తెలంగాణ ఉద్యమకారులపై నమోదు చేసిన కేసులను ఎత్తివేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించినా అమలుకు నోచుకోవడంలేదు. తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న యువకులు నేడు కేసుల కోసం కోర్టుల చుట్టూ తిరుగుతూ తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బుధవారం రోజుల స్థానిక పోలీసులు 19 మందిని రామన్నపేటలో హాజరుపరిచారు. కోర్టుకు హాజరైన యువకులు ప్రభుత్వ తీరును నిరసించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కేసులు మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. కోర్టుకు హాజరైన వారిలో తాడూరి పరమేష్, పెద్దగోని రమేష్‌గౌడ్, ఉప్పు కృష్ణ, జెల్ల శంకర్, తూర్పాటి రవి, బోరెం ప్రకాష్‌రెడ్డి, సాయిరెడ్డి బుచ్చిరెడ్డి, నల్ల అరుణ్‌కుమార్, ఫకీరు శ్రీనివాస్‌రెడ్డి, కట్టెల లింగస్వామి, బోయ లింగస్వామి, రిక్కల ప్రవీణ్, గరిసె మహేష్, రిక్కల మహేందర్‌రెడ్డి పాల్గొన్నారు.
నేత కార్మికులకు రుణాలందించాలి
- హ్యాండ్లూమ్ రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ అంజయ్య
భూదాన్‌పోచంపల్లి, నవంబర్ 22: చేనేత కార్మికుల అభ్యున్నతి కోసం థ్రిఫ్ట్, చేనేత, ముద్ర రుణాలు అందించేందుకు అధికారులు కృషి చేయాలని హ్యాండ్లూమ్ రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ అంజయ్య అన్నారు. బుధవారం మండల పరిషత్ కార్యాలయంలో కలెక్టర్ ఆదేశాల మేరకు బ్యాంక్ అధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. థ్రిఫ్ట్, చేనేత, ముద్ర రుణాల మంజూరులో జాప్యం జరుగుతుందని, పోచంపల్లి, కొయ్యలగూడెం గ్రామాలను క్లస్టర్‌గా ఏర్పర్చామన్నారు. జిల్లాలో 17 వేల మగ్గాలకు గాను 5 వేల మగ్గాలకు జియో ట్యాగింగ్‌ను పూర్తి చేశామని తెలిపారు. పోచంపల్లిలో 1765 మగ్గాలు పూర్తయ్యాయని, 10 వేల థ్రిఫ్ట్ ఖాతాలు తెరిపించాలనే లక్ష్యం పెట్టుకున్నట్లు ఆయన వివరించారు. జియో ట్యాగింగ్ చేసిన మగ్గంపై ఆధారపడిన కుటుంబంలో ఇద్దరు థ్రిఫ్ట్ పథకంలో చేరవచ్చన్నారు. థ్రిఫ్ట్ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం 300 కోట్లు కేటాయించిందని, నేత కార్మికులందరూ ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో డీఆర్‌డీవో వెంకట్రావు, లీడ్ బ్యాంక్ అధికారి శ్రీనివాస్, సూపరింటెండెంట్ రవీంద్రబాబు, కెనరా బ్యాంక్ మేనేజర్ కృష్ణమోహన్, ఎస్‌బీఐ మేనేజర్ కార్తీక్, చేనేత నాయకులు చింతకింది రమేష్, ఎస్.శ్రీనివాస్, గంజి అంజయ్య, కర్నాటి పురుషోత్తం, రచ్చ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
పీడీఎస్ బియ్యం పట్టివేత
దామరచర్ల, నవంబర్ 22: అక్రమంగా పీడీఎస్ బియ్యాన్ని ఆంధ్రాకు తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్న సంఘటన బుధవారం మండలంలో చోటుచేసుకుంది. సూర్యాపేట జిల్లా నుంచి మూసీ వంతెన మీదుగా లారీలో 180 బస్తాల బియ్యాన్ని ఆంధ్రాకు తరలిస్తుండగా వాడపల్లి చెక్‌పోస్టు వద్ద ఎస్‌ఐ రామన్‌గౌడ్ వాహనాల తనిఖీల్లో భాగంగా పట్టుకున్నారు.
ఈవిషయమై మిర్యాలగూడ డీఎస్పీ శ్రీనివాస్‌రావుకు సమాచారం అందించగా, ఆయన వాడపల్లి చెక్‌పోస్టు వద్దకు చేరుకొని లారీని స్వాధీన పర్చుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని పంచనామా నిర్వహించి ఆర్‌ఐ సైదులుకు బియ్యాన్ని స్వాధీనం చేశారు. అనంతరం మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటుచేసిన సీసీ కెమెరాలను డీఎస్పీ శ్రీనివాస్‌రావు పరిశీలించారు.
యాదాద్రి పనులను పరిశీలించిన సిఎంఓ అధికారి భూపాల్‌రెడ్డి
యాదగిరిగుట్ట, నవంబర్ 22: ఈనెల 24న యాదాద్రి అభివృద్ధి పనుల పరిశీలనకు సీఎం కేసీఆర్ రానున్న నేపధ్యంలో బుదవారం సిఎంఓ అధికారి భూపాల్‌రెడ్డి, వైటిడి ఏ వైస్ చైర్మన్ కిషన్‌రావు, ఆర్ అండ్ బి ఈఎన్‌సి రవిందర్‌రావు, కలెక్టర్ అనితారామచంద్రన్ యాదాద్రిని సందర్శించారు. సీఎం పర్యటన నేపధ్యంలో పనుల పురోగతి నివేదికను వైటిడిఏ అధికార్లు ముఖ్యమంత్రికి సమర్పించనున్నారు. ఈ నేపధ్యంలోనే అధికార్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో దేవస్థానం కార్యనిర్వహనాధికారి ఎన్.గీత, ఆర్కిటెక్ట్ ఆనందసాయి, స్థపతి సౌందర్‌రాజన్, తదితరులు పాల్గొన్నారు.