నల్గొండ

పేటలో క్యాన్సర్ కేర్ కేంద్రం ఏర్పాటుకు సన్నాహాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యాపేట, డిసెంబర్ 11: సూర్యాపేట జిల్లాలో క్యాన్సర్ కేర్ సెంటర్‌ను ఏర్పాటుచేసేందుకు సన్నాహాల చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కె.సురేంద్రమోహన్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లో సీఐపీఎస్ అదనపు సంచాలకుడు సీ.అచలేందర్‌రెడ్డి, సికింద్రాబాద్ రోటరీ క్లబ్ అధ్యక్షుడు జెఎం.రెడ్డి, సురేన్‌కెపోరూరి, ఎంఎన్‌జె క్యాన్సర్ ప్రత్యేక వైద్య నిపుణుడు డాక్టర్ కృష్ణ ఆధ్వర్యంలో క్యాన్సర్ ఆసుపత్రి ఏర్పాటుపై కలెక్టర్ సమావేశం నిర్వహించాడు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్తగా ఏర్పడిన సూర్యాపేట జిల్లాలో ఇటీవల పర్యటించిన ముఖ్యమంత్రి కేసీఆర్ మెడికల్ కళాశాలను మంజూరు చేశారని బృందం సభ్యులకు తెలిపారు. జిల్లాలో వైద్యాధికారులు, సిబ్బంది వ్యాధిగ్రస్తులకు మెరుగైన వైద్యం అందిస్తూ సత్ఫలితాలు సాధిస్తున్నారన్నారు. జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు 15 నుండి 65 శాతం పెరిగాయన్నారు. జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆసుపత్రుల్లో కార్పోరేట్ వసతులు కల్పించడం జరిగిందన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అవుట్ పేషంట్ల్ సంఖ్య గణనీయంగా పెరిగిందన్నారు. జిల్లాలో ఏర్పాటుచేసే క్యాన్సర్ కేర్ సెంటర్‌కు సూర్యాపేట జిల్లాకు చెందిన గవ్వ చంద్రారెడ్డి తన తల్లి నర్సమ్మ జ్ఞాపకార్థం రూ.కోటి, రోటరీ క్లబ్ ఆఫ్ వెస్ట్ సికింద్రాబాద్ కంటోమెంట్ అధ్యక్షుడు జెఎం రెడ్డి రూ.కోటి నిధులు సమకూర్చనున్నట్లు తెలిపారు. ఈక్యాన్సర్ సెంటర్ వలన వ్యాధిగ్రస్తులను గుర్తించి మెరుగైన వైద్యం అందించడం జరుగుతుందన్నారు. ఈ సెంటర్‌లో క్యాన్సర్ మోబైల్ వాహనం కూడా అందుబాటులో ఉంచడం జరుగుతుందన్నారు. జిల్లా కేంద్రంలోని ఏరియా ఆసుపత్రిలో 1500 నుండి 2000 చదరపు అడుగుల స్థలం కావాలని కోరగా ప్రతిపాదనలు అందజేస్తే ఆమోదం కోసం వైద్య ఆరోగ్యశాఖ సంచాలకులకు పంపించడం జరుగుతుందన్నారు. ఈకార్యక్రమంలో డీఎంహెచ్‌వో డాక్టర్ టి.మురళిమోహన్, డిప్యూటీ డిఎంహెచ్‌వో డాక్టర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

అధికారమే లక్ష్యంగా కార్యకర్తలు పని చేయాలి
* బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు పాదూరి కరణ

మిర్యాలగూడ, డిసెంబర్ 11: రానున్న 2019లో జరిగే ఎన్నికలలో రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా కార్యకర్తలు సైనికుల్ల పనిచేయాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు పాదూరి కరుణ అన్నారు. సోమవారం పట్టణంలోని జరిగిన పట్టణ కార్యవర్గ సమావేశంలో ఆమె ముఖ్యఅతిధిగా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి పార్టీని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. కేంద్రంలో నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలోని పేద ప్రజల సంక్షేమం కోసం పలు అభివృద్ధి పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారన్నారు. గత ఎన్నికలలో ఆచరణన సాధ్యం కాని హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీలను అమలు చేయకుండా విస్మరించారన్నారు. ఎన్నికల వాగ్ధానాలను అమలు చేయడంలో కేసీఆర్ ప్రభుత్వ పూర్తిగా విఫవమైదన్నారు. దళితులకు మూడు ఎకరాలు, పేదలకు డబుల్ బెడ్ రూం ఇండ్లు, విద్యార్థులకు ఫీజు రీయంబర్స్‌మెంట్, యువతకు ఉద్యోగావకాశాలు కల్పించడంలో కేసీఆర్ ఘోరంగా విఫలమైనారన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు కేసీఆర్ ప్రభ్వుంపై అసంతృప్తితో ఉన్నారన్నారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయ శక్తిగా ప్రజలు చూస్తున్నారన్నారు. రాబోయే ఎన్నికలలో బీజేపీకి అధికారం అప్పగించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి బంటు సైదులు, ఉపాధ్యక్షుడు దొండపాటి వెంకట్‌రెడ్డి, సీనియర్ నాయకులు చెర్వుపల్లి చంద్రవౌళి, పట్టణ అధ్యక్షుడు రేపాల పురుషోత్తంరెడ్డి, నాయకులు ఎడ్ల రమేష్, బంటు యాదగిరి, కొండవీటి సరిత, కనపర్తి సత్యప్రసాద్, రాజశేఖర్‌నాయక్, మూల రాజిరెడ్డి, పోరెడ్డి శ్రీనివాసరెడ్డి, రావులపాటి శ్రీనివాస్, రామకృష్ణారెడ్డి, శేఖర్, జానునాయక్ తదితరులు పాల్గొన్నారు.