నల్గొండ

నేటి బాల మేథావులే రేపటి శాస్తవ్రేత్తలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భువనగిరి, డిసెంబర్ 11: నేటి బాలమేథావులే శాస్తవ్రేత్తలుగా ఎదిగి పర్యావరణ సమస్యలకు పరిష్కారం చూపాలని విద్యుత్, షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని దివ్యబాల హైస్కూల్ ఆవరణలో 45వ జిల్లాస్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శన - 2017ను మంత్రి జగదీశ్‌రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆయన విద్యార్థును ఉద్దేశించి ప్రసంగించారు. విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలు విద్యార్థులలోని సృజానాత్మకతను మేథోశక్తి పెంపొందుతుందన్నారు. విద్యార్థులలో శాస్ర్తియ విజ్ఞానం పెంపొందించుకుని సమాజంలో నిత్యం ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం కనుగొనే దిశగా పరిశోధనలు చేయాలని పిలుపునిచ్చారు.
పర్యావరణానికి ముప్పుగా ఎరువులు, ప్లాస్టిక్
అవసరం కోసం ఉత్పత్తిని ప్రారంభించిన ఎరువులు, ప్లాస్టిక్ వస్తువులు ప్రస్తుతం భూగోళానికి పెనుముప్పుగా మారాయని మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. విద్యార్థి దశ నుండే ఎరువులు, ప్లాస్టిక్ వ్యర్థాలను నిరోధిస్తు పర్యావరణ పరిరక్షణకు బాలమేథావులు ప్రజలలో అవగాహన కల్పిస్తు కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ప్రపంచ మానవ కల్యాణం కోసం శాస్ర్తియ పరిజ్ఞానాన్ని ఉపయోగించేలా కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన ప్రయోగాలను ఆయన పరిశీలించారు. విద్యా వైజ్ఞానిక ప్రదర్శన నేడు ప్రారంభం కాగా మరో రెండు రోజులు కొనసాగనుండగా ప్రారంభం రోజున విద్యార్థులు 361 ప్రయోగాలను ప్రదర్శించారు. భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన వైజ్ఞానిక ప్రదర్శన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు ఎలిమినేటి కృష్ణారెడ్డి, పూల రవీందర్, మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, కలెక్టర్ అనితారామచంద్రన్, ట్రైనీ కలెక్టర్ ఆలె ప్రియాంక, జాయింట్ కలెక్టర్ రవినాయక్, జిల్లా విద్యాశాఖ అధికారి రోహిణి, భువనగిరి మున్సిపల్ చైర్‌పర్సన్ సుర్వి లావణ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ డాక్టర్ జడల అమరేందర్ గౌడ్, ఎంపిపి తోటకూరి వెంకటేశ్‌యాదవ్, సర్పంచ్ రాయపాక అశోక్, ఎంపిటిసి దాసరి పాండు, వివిధ శాఖల అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.