నల్గొండ

8 విడతలు.. 40 టీఎంసీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగార్జున సాగర్, డిసెంబర్ 11: నాగార్జున సాగర్ జలాశయం నుంచి ఎడమ కాల్వ పరిధిలో యాసంగి పంట(రబీ)కు గాను 8 విడతలుగా 40 టీఎంసీల నీటిని విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించి షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఇందులో భాగంగానే ఆదివారం ఎడమ కాల్వకు నీటి విడుదలను రాష్ట్ర మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డిలు ప్రారంభించారు. కాగా, 8 విడతల షెడ్యూల్‌ను సోమవారం డ్యాం అధికారులు వెల్లడించారు. మొదటి విడతగా ఈ నెల 10వ తేదీ నుంచి వరుసగా 12 రోజుల పాటు రోజుకు 5,500 క్యూసెక్కుల నీటి చొప్పున 66వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయనున్నారు. ఇది 5.70 టీఎంసీలకు సమానం. రెండో విడతగా ఈ నెల 28వ తేదీ నుంచి జనవరి 5వ తేదీ వరకు వరుసగా 9 రోజులు 4.28 టీఎంసీలను రోజుకు 5,500 క్యూసెక్కుల నీటి చొప్పున 49,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేయనున్నారు. మూడవ విడతగా జనవరి 12 నుంచి 20వ తేదీ వరకు 9 రోజుల పాటు 5.05 టీఎంసీల నీటిని రోజుకు 6,500 క్యూసెక్కుల చొప్పున 58,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేయనున్నారు. నాల్గవ విడతగా జనవరి 27 నుంచి ఫిబ్రవరి 4 వరకు 9 రోజుల పాటు 5.44 టీఎంసీల నీటిని రోజుకు 7 వేల క్యూసెక్కుల చొప్పున 63వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయనున్నారు. ఐదవ విడతగా ఫిబ్రవరి 11 నుంచి 19 వరకు 9 రోజుల పాటు 5.44 టీఎంసీలను రోజుకు 7 వేల క్యూసెక్కుల చొప్పున 63 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయనున్నారు. ఆరవ విడతగా ఫిబ్రవరి 26 నుంచి మార్చి 6వ తేదీ వరకు 9 రోజుల పాటు 4.67టీఎంసీల నీటిని రోజుకు 6వేల క్యూసెక్కుల చొప్పున 54 వేల క్యూసెక్కులను విడుదల చేయనున్నారు. ఏడవ విడతగా మార్చి 13 నుంచి 21వరకు 9రోజుల పాటు 4.28టీఎంసీల నీటిని రోజుకు 5,500 క్యూసెక్కుల చొప్పున 49,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేయనున్నారు. చివరి విడతగా మార్చి 28 నుంచి ఏప్రిల్ 5వ తేదీ వరకు 9 రోజుల పాటు 2.33టీఎంసీల నీటిని రోజుకు 3 వేల క్యూసెక్కుల చొప్పున 27 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయనున్నారు. దీంతో పాటు ఆయకట్టు రైతుల అవసరాన్ని బట్టి మరో 2.80 టీఎంసీల నీటిని విడుదల చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. మొత్తం యాసంగి పంటకు గాను డ్యాం అధికారులు ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు 40 టీఎంసీల నీటిని విడుదల చేయనున్నారు.