నల్గొండ

జూన్ 2కల్లా ఓడీఎఫ్ జిల్లాగా ప్రకటన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మిర్యాలగూడ టౌన్, డిసెంబర్ 13: నల్లగొండ జిల్లాను జిల్లా వచ్చే జూన్ 2 జిల్లా పునర్విభజన నాటికి మలవిసర్జన రహిత (ఓడిఎఫ్) జిల్లాగా ప్రకటిస్తామని జిల్లా పరిషత్ సీఈవో హనుమానాయక్ తెలిపారు. మంగళవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ స్వచ్ఛ్భారత్ కింద నిర్మల్ భారత్, జాతీయ గ్రామీణ ఉపాధి పధకం కింద వ్యక్తిగత మరుగుదొడ్లను సంపూర్ణంగా 400 గ్రామాల్లో నిర్మించి మలవిసర్జన రహిత గ్రామాలుగా ప్రకటించామన్నారు. ఇంకా 300 గ్రామాలను జూన్ 2 కల్లా ప్రకటించేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు. ఆ కార్యాచరణ కింద 300 గ్రామాల్లో సంపూర్ణంగా వ్యక్తిగత మరుగుదొడ్లను నిర్మించి ఓడిఎఫ్‌గా ప్రకటిస్తామన్నారు. జిల్లాలోని 59 మండల పరిషత్ కార్యాలయాల్లో ఇప్పటి వరకు 28 మండలాల్లో ఆడిట్, తనిఖీలు నిర్వహించడం జరిగిందన్నారు. మిగిలిన మండలాల్లో జనవరి 12 కల్లా పూర్తి చేస్తామన్నారు. ఉమ్మడి జిల్లాలో సుమారు 315 లంబాడీ తండాలను గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేసేందుకు గాను ప్రతిపాదనలు కింది స్థాయి నుండి వచ్చాయన్నారు, ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు. అదే విధంగా స్థానిక సంస్థల ఎన్నికలకు గాను గ్రామ పంచాయతీల్లో ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం జరుగుతుందన్నారు. ఆయన వెంట స్థానిక ఎంపీడీఓ ఎస్.వెంకట్‌రెడ్డి, సూపరింటెండెంట్ ఆర్.రామయ్యలు పాల్గొన్నారు.
రైతు బజారులోకి కూరగాయల మార్కెట్ తరలింపు
నల్లగొండ టౌన్, డిసెంబర్ 12: జిల్లా కేంద్రం గడియారం సెంటర్ కూడలిలో తాత్కాలికంగా కొనసాగుతున్న కూరగాయల మార్కెట్‌ను వ్యవసాయ మార్కెట్‌లో నూతనంగా నిర్మించిన రైతు బజారులోకి తరలించారు. ఇటీవల 77 లక్షలతో నిర్మించిన రైతు బజారులోకి కూరగాయల మార్కెట్ తరలింపుపై అమ్మకందారులు తొలుత నిరాసక్తత కనబర్చినా అధికారులు నచ్చజెప్పడంతో క్రమంగా రైతు బజారుకు తరిలారు. పట్టణ ప్రజలు, వినియోగదారులు కూరగాయల కోసం రైతు బజారుకు రావాలని మార్కెటింగ్ ఏడి అలీం, సెక్రటరీ సుగుణకుమారి సూచించారు.