నల్గొండ

ఎస్‌టీ జాబితా నుండి తొలగింపు ఉపసంహరించుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మిర్యాగూడ, డిసెంబర్ 12: లంబాడీలను ఎస్‌టీ జాబితా నుండి తొలగించాలన్న ఆలోచనను ఉపసంహరించుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ భారతి రాగ్యనాయక్‌లు అన్నారు. మంగళవారం లంబాడీల ఐక్యవేదిక అధ్వర్యంలో పట్టణంలోని ఎన్‌ఎస్‌పి క్యాంపులోని అమరవీరుల స్ధూపం నుండి ఆర్‌డీఓ కార్యాలయం వరకు ర్యాలి నిర్వహించి ధర్నా చేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ లంబాడీలపై దాడులు చేస్తున్నవారిపై, దుష్ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జనాభా ధామాషా ప్రకారం 10 శాతం రిజర్వేషన్‌లు కలిపిస్తు ప్రభుత్వం ఉత్తర్వులు జారిచేయాలని, లంబాడీలను ఎస్‌టీ జాబితా నుండి తొలగిస్తారని ప్రచారం చేస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జడ్పీటీసి శంకర్‌నాయక్ మాట్లాడుతూ గిరిజనుల జీవితాలతోసీఎం కేసీఆర్ చలగాటం ఆడవద్దని హెచ్చరించారు. ఎస్‌టీలను విభజించి విభేదాలు సృష్టించి గొడవలు పెట్టడం కేసీఆర్‌కు తగదన్నారు. ఎన్నికలలో కొన్ని నియోజక వర్గలాలో లంబాడీల ఓట్లు నిర్ణయాత్మకంగా ఉంటాయని, 2019 ఎన్నికలలో ఇదేవైఖరి కొనసాగితే బుద్ధిచెబుతారన్నారు. కార్యక్రమంలో పీఎసీఎస్ చైర్మన్ చిరుమర్రి కృష్ణయ్య, గిరిజన నేతలు చిట్టిబాబునాయక్, స్కైలాబ్‌నాయక్, మేగ్యానాయక్, లింగానాయక్, నాగునాయక్, తిరుపతినాయక్, పాపానాయక్, డాక్టర్ మాతృనాయక్, రవినాయక్, దశరధనాయక్, చాంప్లానాయక్, ఎంపీటీసి లలిత, శంకర్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.

‘లచ్చిమి’ లఘు చిత్రానికి జాతీయ ఉత్తమ అవార్డు
చౌటుప్పల్, డిసెంబర్ 12: మండలంలోని తంగడపల్లి గ్రామానికి చెందిన దర్శకుడు రంజి దాసరి నిర్మించిన ‘లచ్చిమి’ లఘు చిత్రానికి జాతీయ ఉత్తమ అవార్డు లభించింది. జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో కాకినాడలో ఈ నెల 9న నిర్వహించిన జాతీయ లఘు చిత్రాల పోటీలో మూఢనమ్మకాలపై నిర్మించిన లచ్చిమి లఘు చిత్రాన్ని జాతీయ ఉత్తమ అవార్డుకు ఎంపిక చేశారు. అమలాపురం పార్లమెంటు సభ్యుడు రవీంద్రబాబు, ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావుల చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు. లఘు చిత్ర నిర్మాత, నటులను అభినందించారు.