నల్గొండ

ఆరోగ్య సమాజానికి పరిశోధనలు చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యాపేట, డిసెంబర్ 12: రోజురోజుకు అభివృద్ధి చెందుతున్న శాస్తస్రాంకేతికతను ఉపయోగించుకుంటూ విద్యార్థులు ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం దిశగా నూతన పరిశోధనలు చేయాలని ఉపాధ్యాయ శాసన మండలి సభ్యుడు పూల రవీందర్ అన్నారు. జిల్లాకేంద్రంలోని ఎవీఎం పాఠశాలలో నిర్వహిస్తున్న జిల్లా వైజ్ఞానిక ప్రదర్శనలు మంగళవారం ముగిసాయి. ఈసందర్భంగా నిర్వహించిన ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా హజరై ప్రసంగించారు. సైన్స్‌ను వేల సంవత్సరాలకు పూర్వమే ప్రపంచదేశాలకు భారతదేశం పరిచయం చేసిందన్నారు. అమెరికా లాంటి అగ్రదేశాల కంటే ముందే అనేక నాగరికతలను మనదేశం ప్రపంచానికి అందించిందని గుర్తుచేశారు. విద్యార్థులకు తరగతిగదులనే ప్రదర్శనశాలలుగా మార్చి వారిలో సైన్స్‌పట్ల ఆసక్తిని పెంపొందించేలా ఉపాధ్యాయులు కృషిచేయాలని పిలుపునిచ్చారు. ప్రతివిద్యార్ధి ఎదో ఒక విషయం పట్ల ఆసక్తి కలిగి ఉంటారని ఉపాధ్యాయులు ఆఅభిరుచిని గుర్తించి వారి అభివృద్దికి తోడ్పాటును అందించాలని సూచించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యారంగానికి అధిక ప్రాధాన్యతను ఇవ్వడంతో పాటు విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించేలా విద్యావ్యవస్థలో సంమూల మార్పులు తీసుకువస్తున్నట్లు చెప్పారు. మున్సిపల్ చైర్‌పర్సన్ గండూరి ప్రవళిక మాట్లాడుతూ విద్యార్థులు పర్యావరణ పరిరక్షణపై దృష్టిసారించి ఆదిశగా ప్రయోగాలు కొనసాగించాలని కోరారు. జిల్లా ఎస్పీ ప్రకాశ్ జాదవ్ మాట్లాడుతూ సైన్స్ అభివృద్ది చెందితేనే దేశం అభివృద్ది చెందుతుందన్నారు. మనదేశానికి చెందిన వారు అనేక పరిశోధనలు చేసి ఇతర దేశాలకు వారి పరిజ్ఞానాన్ని అందిస్తున్నారన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటనర్సమ్మ మాట్లాడుతూ సమిష్టి కృషితో జిల్లా వైజ్ఞానిక ప్రదర్శన విజయవంతమైందని చెప్పారు. 502 నమూనాలను విద్యార్థులు తీసుకువచ్చినట్లు తెలిపారు. మూడు రోజుల పాటు నిర్వహించిన ఈప్రదర్శనకు 170 పాఠశాలలకు చెందిన సుమారు 45వేల మంది విద్యార్థులు తరలివచ్చినట్లు చెప్పారు. ఈకార్యక్రమంలో జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ తండు మురళిమోహన్, జిల్లా సైన్స్ అధికారి దేవరాజు, కౌన్సిలర్ తండు శ్రీనివాస్, పాఠశాల ప్రిన్సిపల్ ఫాతిమ తదితరులు పాల్గొన్నారు.
రాష్టస్థ్రాయికి ఎంపికైన పాఠశాలలు
వైజ్ఞానిక ప్రదర్శనలో రాష్టస్థ్రాయికి సీనియర్, జూనియర్ విభాగాల్లో నమూనాలను ఎంపిక చేశారు. సీనియర్ విభాగంలో ఎన్.సతీష్ జడ్పీహెచ్‌ఎస్ రత్నవరం, ఎండి.జావేద్ జడ్పీహెచ్‌ఎస్ ఎనుబాముల, ఎ.సందీప్ జడ్పీహెచ్‌ఎస్ బండరామారం, ఎం.ప్రవీణ్ జడ్పీహెచ్‌ఎస్ ఎర్రపహాడ్, పూజిత జడ్పీహెచ్‌ఎస్ జెర్రిపోతులగూడెం, అశోక్ గడ్డిపల్లి, డి.నేహ శ్రీచైతన్య సూర్యాపేట, జూనియర్ విభాగంలో కుషి జడ్పీహెచ్‌ఎస్ ముకుందాపురం, ఉదయశ్రీ మోతె, మహలక్ష్మి ఇమాంపేట, మనీషా మాధవరం, శంకర్ గరిడేపల్లి, రమ్య పెంచికల్‌దినే్న, శ్రవణి కేజీబీవీ చింతలపాలెంలను ఎంపిక చేశారు.