నల్గొండ

మూసీ కాలువల పనుల్లో వేగం పెంచాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, డిసెంబర్ 12: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మూసీ కాలువలు పిల్లాయిపల్లి, ధర్మారెడ్డిపల్లి, బునాదిగాని కాలువల ఆధునీకరణ పనులు, అసంపూర్తి పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎస్.కె.జోషి ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. మంగళవారం జలసౌధలో ప్రభుత్వ విప్ గొంగిడి సునిత, ఎంపిలు గుత్తా సుఖేందర్‌రెడ్డి, బూర నర్సయ్యగౌడ్, ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్‌రెడ్డి, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, వేముల వీరేశం, కలెక్టర్లు గౌరవ్ ఉప్పల్, అనితారామచంద్రన్‌లతో కలిసి ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు, కాంట్రాక్టు ఎజెన్సీ ప్రతినిధులతో మూసీ కాలువల పనుల పురోగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా జోషి మాట్లాడుతు ప్రస్తుతం క్రాప్ హాలిడే కొనసాగుతున్నందునా ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుని పనుల్లో వేగం పెంచాలన్నారు. ఈ కాలువల పూర్తితో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 60వేల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. కాలువలకు సంబంధించిన భూసేకరణ పనులను వేగవంతం చేయాలని సూచించారు. ఈ కాలువల అసంపూర్తి పనులకు, ఆధునీకరణ పనులకు 248కోట్లను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. నిధుల కొరత లేనందునా కాలయాపన చేయకుండా పనులు నిర్ధేశిత గడువులోగా పూర్తి చేయాలన్నారు. గతంలో మాదిరిగా ఏళ్ల తరబడిగా పనుల్లో జాప్యం చేస్తే సహించేది లేదన్నారు. పనుల పురోగతిపై ప్రతి 15రోజులకొకసారిస సమీక్ష నిర్వహిస్తామన్నారు. ఈ కాలువల పూర్తితో నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల పరిధిలోని ఆలేరు, భువననగిరి, మునుగోడు, నకిరేకల్, తుంగతుర్తి, సూర్యాపేట అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పలు మండలాలకు సాగునీరు వసతి లభిస్తుందని ప్రభుత్వం ఈ పనులపై సీరియస్‌గా ఉన్నందునా అధికారులు గడువులోగా పనులు జరిపించడంలో అవసరమైన అన్ని చర్యలుచేపట్టాలన్నారు. గతంలో బునాదిగాని, పిల్లాయిపల్లి, ధర్మారెడ్డిపల్లి కాలువలకు సంబంధించి చేసిన భూసేకరణ వివరాలు తెలుసుకుని కాలువల పొడగింపు, ఆధునీకరణకు కావాల్సిన మిగతా భూసేకరణ వెంటనే జరిపి పాత, కొత్త నిర్వాసితులందరికి పరిహారం చెల్లింపులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఇరిగేషన్ ఎస్‌ఈ హమీద్‌ఖాన్‌తో పాటు సూర్యాపేట, నల్లగొండ, భువనగిరి జిల్లాల ఈఈలు, డిఈలు పాల్గొన్నారు.

అక్రమ ఇసుక రవాణా నియంత్రణకు చర్యలు
* నాగారం, జాజిరెడ్డిగూడెం, పెన్‌పహాడ్‌లలో చెక్‌పోస్టుల ఏర్పాటు * సమీక్షా సమావేశంలో కలెక్టర్ సురేంద్రమోహన్

సూర్యాపేట, డిసెంబర్ 12: జిల్లాలో ఇసుక అక్రమ రవాణాను నియంత్రించేందుకు పటిష్టమైన చర్యలు చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ కె.సురేంద్రమోహన్ తెలిపారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్‌లో ఎస్పీ ప్రకాశ్‌జాదవ్, జాయింట్ కలెక్టర్ సంజీవరెడ్డిలతో ఇసుక అక్రమ రవాణాపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మూసీ పరివాహక ప్రాంతాలైన నాగారం, జాజిరెడ్డిగూడెం, పెన్‌పహాడ్ మండలాల్లో ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణా నియంత్రణ కోసం ప్రత్యేక చెక్‌పోస్టులను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఈచెక్‌పోస్టుల్లో సీసీ కెమోరాలతో పాటు డ్రోన్ కెమోరాలను ఏర్పాటుచేయాలని అదేవిధంగా అక్రమ రవాణాను అడ్డుకునేందుకు అవుట్ సోర్సింగ్ సిబ్బందిని నిఘా కోసం నియమించాలని భూగర్భ గనులశాఖ ఎడీని ఆదేశించారు. ఇసుకు సీనరేజ్ ద్వారా వచ్చిన నిధులను గ్రామాల అభివృద్దికి కేటాయించాలని, అక్రమంగా తరలుతునన ఇసుకను నియంత్రించేందుకు పటిష్ట చర్యలు తీసుకోవాలని సూచించారు. సంబంధిత తహశీల్ధార్ కార్యాలయాల్లో టీ ఎస్‌ఎండీసీ ద్వారా ముద్రించిన వేబిల్లు పుస్తకాలను తప్పక వినియోగించాలన్నారు. అదేవిధంగా కలెక్టరేట్, ఆర్డీవో, తహశీల్ధార్ కార్యాలయాల్లో ప్రజలకు తెలిసేవిధంగా ఇసుక కొనుగోలు వివరాలు, ఫ్లెక్సీలను ఏర్పాటుచేయాలని కోరారు. ఇసుక కొనుగోలుకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్లు తన దృష్టికి వచ్చిందని చెప్పారు. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోని అధికారులు, సిబ్బందిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. చెక్‌పోస్టుల్లో వచ్చి వెళ్లే వాహనాల పూర్తివివరాలు నమోదు చేయాలని, రెవిన్యూ, పోలీస్, పంచాయితీ సిబ్బందితో జాయింట్ యాక్షన్ కమిటీని ఏర్పాటు చేయాలని సూచించారు. పెన్‌పహాడ్, నాగారం, జాజిరెడ్డిగూడెం మండలాల్లో నీటి నిల్వలు అధికంగా ఉన్నందున ఇసుక తక్కువ మోతాదులో వస్తున్నట్లు మైన్స్ ఎడీ తెలిపారు. జిల్లాలో నిర్మాణంలో ఉన్న రెండు పడక గదుల ఇండ్లకు నాణ్యమైన ఇసుకను సరఫరాచేయాలని సూచించారు. జిల్లా ఎస్పీ ప్రకాశ్‌జాదవ్ మాట్లాడుతూ జిల్లాలో అక్రమ ఇసుక రవాణాపై రోజుకు ఆరు కేసుల చొప్పున నమోదవుతున్నాయని చెప్పారు. అక్రమ రవాణాను నియంత్రించేందుకు ప్రత్యేక బృందాలను నియమించామన్నారు. ఈసమావేశంలో జాయింట్ కలెక్టర్ డి.సంజీవరెడ్డి, డీఆర్‌వో పి.యాదిరెడ్డి, మైన్స్ ఎడీ వెంకటేశ్వర్లు, డీఆర్‌డీవో కిరణ్‌కుమార్, ఆర్డీవోలు మోహన్‌రావు, బిక్షునాయక్ తదితరులు పాల్గొన్నారు.