నల్గొండ

నీటి ఎద్దడిని నివారించాలంటూ మహిళల నిరసన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మోత్కూర్, జనవరి 2: మండలంలోని పాలడుగు గ్రామంలో 2వ వార్డు హనుమాన్ వీధిలో నెలకొన్న తాగునీటి ఎద్దడిని నివారించాలని కోరుతూ మంగళవారం కాలనీ మహిళలు ఖాళీ బిందెలతో స్థానిక గ్రామపంచాయతీ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. గత రెండు నెలలుగా నీళ్లు రాకపోవడంతో అర కిలోమీటర్ దూరంలో ఉన్న వ్యవసాయ బావుల వద్దకు వెళ్లి నీళ్లు తెచ్చుకోవాల్సి వస్తుందని, వృద్ధులు, మహిళలు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాపోయారు. సర్పంచ్, అధికారులకు ఎన్ని సార్లు మొరపెట్టుకున్నా ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు. మహిళలు బి.వెంకటమ్మ, ఎం.వసంత, బి.వీరమ్మ, ఎం.లక్ష్మమ్మ, రమాదేవి, ఇ.ఊర్మిళ, యాదమ్మ, ఐలమ్మ, కొమరమ్మ, రజిత, సోమలక్ష్మి, అండాలు, నర్సమ్మ, లక్ష్మమ్మ, లింగమ్మ, లక్ష్మి, గ్రామస్తులు గుండు వెంకటనర్సు, నారాయణ తదితరులు పాల్గొన్నారు.

చేనేత కార్మికుల రుణాలు మాఫీ చేయాలి
నల్లగొండ రూరల్, జనవరి 2: చేనేత కార్మికుల గత రుణాలు మాఫీ చేసి, తిరిగి వారికి లక్ష రూపాయల వరకు వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పాశికంటి లక్ష్మీనర్సయ్య, సీపీఐ జిల్లా కార్యదర్శి పల్లా నర్సింహారెడ్డి, వృత్తిసంఘాల జిల్లా కన్వీనర్ పబ్బు వీరస్వామిలు డిమాండ్ చేశారు. మంగళవారం పట్టణంలో నిర్వహించిన జిల్లా కమిటీ సమావేశంలో వారు మాట్లాడారు. అనేక పోరాటాల ఫలితంగానే గత ప్రభుత్వాల ద్వారా వృద్ధాప్య పింఛన్ 50 సంవత్సరాలకే సాధించుకోవడం జరిగిందని, రుణమాఫీ చేయించుకోగలిగినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను మాత్రం అమలుచేయడం లేదన్నారు. ఇటీవల చేనేత కార్మికులు చేస్తున్న ఉద్యమాల ఫలితంగా ప్రభుత్వం స్పందించి థ్రిప్ట్, నూలు సబ్సిడీ పథకాలను అమలు చేస్తుందన్నారు. అదే విధంగా చేనేత సంఘానికి నిధులు విడుదల చేసి, డబుల్ బెడ్ రూం ఇళ్లు అందించాలని, చేనేత పరిశ్రమను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఇడం గోపయ్య, చేపూరి ధనుంజయ, రావిరాల గణేష్, చిలుకూరి వెంకటేశం, చుక్కయ్య, సత్యనారాయణ, వెంకట్రావ్ తదితరులు పాల్గొన్నారు.