నల్గొండ

కన్నుల పండువగా కల్యాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నార్కట్‌పల్లి, జనవరి 2: కమలాద్రి శ్రీ లక్ష్మీనర్సింహ స్వామి కల్యాణం కన్నుల పండువగా వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య మంగళవారం మండలంలోని షాపెల్లి గ్రామంలో గల కొండపైన చూడముచ్చటగా జరిగింది. పురాతన కాలంలో వెలసిన శ్రీ లక్ష్మీనర్సింహ స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు యాదగిరిగుట్ట ప్రధాన అర్చకులు లక్ష్మీనర్సింహాచార్యుల ఆధ్వర్యంలో వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా జరిగిన కల్యాణ వేడుకల్లో వేలాది మంది భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. ముందుగా వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య కొండపైన గల పుర వీధుల్లో స్వామి వారి ఎదుర్కోళ్ల ఉత్సవం నిర్వహించారు. అనంతరం నూతన పట్టు వస్త్రాలు అలంకరించి ఆలయ మండపంలో స్వామి వారి కల్యాణాన్ని రమణీయంగా, కమణీయంగా నిర్వహించారు. స్వామి వారి బ్రహ్మోత్సవ విశేషాలను, స్వామి వారి పురాణ గాథల గురించి ప్రవచనంలో పేర్కొంటూనే కల్యాణాన్ని వైభవోపేతంగా నిర్వహించారు. వందలాది మంది దంపతులు కల్యాణోత్సవంలో పాల్గొన్నారు. నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, ఎంపీపీ రేగట్టె మల్లికార్జున్‌రెడ్డి, జడ్పీటీసీ దూదిమెట్ల సత్తయ్య యాదవ్, సర్పంచ్ స్వామిగౌడ్ స్వామి వారి కల్యాణోత్సవంలో పాల్గొని పట్టు వస్త్రాలు సమర్పించారు. మండల, జిల్లా నలుమూలల నుండి వేలాది మంది భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.