నల్గొండ

మార్కెట్ రాబడికి కరవు కష్టాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, ఏప్రిల్ 28: జిల్లాలో నెలకొన్న తీవ్ర కరవు మార్కెటింగ్ శాఖ ఆదాయ వనరులను దెబ్బతీసింది. వర్షాభావంతో పంటల సాగు విస్తీర్ణం, దిగుబడులు తగ్గిపోవడంతో ఈ మేరకు మార్కెటింగ్ శాఖకు వచ్చే ఆదాయం సైతం పడిపోయింది. కరవు దెబ్బకు 2015-16ఆర్ధిక సంవత్సరంలో ఏకంగా 30శాతం తక్కువగా 17కోట్ల ఆదాయం మార్కెటింగ్ శాఖ కోల్పోయింది. జిల్లాలో 19వ్యవసాయ మార్కెట్‌లు, 22ఉప మార్కెట్‌లున్నాయి. యార్డులలో జరిగే కొనుగోలు విలువపై ఒక శాతం మొత్తాన్ని మార్కెట్ ఫీజుగా వసూలు చేస్తుంటారు. అలాగే గోదాంల అద్దె, చెక్‌పోస్టు ఫీజుల రూపంలో మార్కెటింగ్ శాఖకు ఆదాయం లభిస్తుంది. 2014-15ఆర్ధిక సంవత్సరంలో 40కోట్ల 65లక్షల మార్కెట్ ఫీజు ఆదాయ లక్ష్యాన్ని అధిగమించి 43కోట్ల 81లక్షల 94వేల రాబడి సాధించారు. 2015-16లో 53కోట్ల 5లక్షలు మార్కెట్ ఫీజు ఆదాయం లక్ష్యంగా పెట్టుకోగా ఆర్ధిక సంవత్సరం ముగిసేనాటికి మార్చి 31వ తేదికల్లా 35కోట్ల 95లక్షల 44వేలు మాత్రమే మార్కెట్ ఫీజు ఆదాయం సాధించారు. అంటే నిర్ధేశించుకున్న లక్ష్యం కంటే 17కోట్ల 1లక్ష రూపాయల ఆదాయం మార్కెటింగ్ శాఖ కోల్పోయింది. ఆదాయం కోల్పోవడానికి కరవు ప్రధాన కారణంగా కనిపిస్తుంది. కరవుతో 2015-16ఖరీఫ్ సీజన్‌లో 3,63,976హెక్టార్ల పంటల సాగు జరుగగా, అంతకుముందు 2014-15తో పోల్చితే 1,57,280హెక్టార్ల పంటల సాగు తక్కువైంది. 2015-16రబీ సీజన్‌లో 86,710హెక్టార్ల పంటల సాగు జరుగగా 2014-15రబీ సీజన్‌తో పోల్చితే 78,399హెక్టార్ల పంటల సాగు తక్కువగా ఉంది. ఈ గణంకాలను విశే్లషిస్తే కరవుతో తగ్గిన పంటల సాగు విస్తీర్ణం ప్రభావం మార్కెట్ ఫీజు రాబడికి ఆటంకంగా మారిందని తేలుతుంది. అటు పత్తి సాగు దెబ్బతిని దిగుబడులు పడిపోవడం కూడా మార్కెటింగ్ శాఖ ఆదాయానికి నష్టం చేసింది.
ఇక జిల్లాలో 19వ్యవసాయ మార్కెట్‌లలో మార్కెట్ ఫీజు లక్ష్యాల్లో చౌటుప్పల్, చండూర్ మార్కెట్‌లు నిర్ధేశిత లక్ష్యాలను అధిగమించాయి. చౌటుప్పల్ 1కోటి 60లక్షల లక్ష్యానికి 1కోటి 89లక్షలు, చండూర్ 1కోటి 61లక్షలకు 1కోటి 83లక్షలు వసూళ్లు సాధించాయి. వలిగొండ, మిర్యాలగూడ, తిరుమలగిరి, ఆలేరు, హాలియా, మోత్కూర్, దేవరకొండ, నకిరేకల్, చిట్యాల, భువనగిరి, సూర్యాపేట, నల్లగొండ, కోదాడ, నిడమనూర్, హుజూర్‌నగర్, నేరడుచర్ల, మాల్ మార్కెట్‌లు నిర్ధేశిత లక్ష్యాలను అందుకోలేపోయాయి.