నల్గొండ

కరవు సహాయక చర్యలేవీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ టౌన్, ఏప్రిల్ 28: జిల్లాలో తీవ్ర కరవు నెలకొని వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉండగా ప్రభుత్వం నుండి కరవు సహాయక చర్యలు చేపట్టడంలో ఎందుకు జాప్యం జరుగుతుందంటు జడ్పీ వ్యవసాయ స్థాయి సంఘం సభ్యులు అధికారులను నిలదీశారు. గురువారం చైర్మన్ కర్నాటి లింగారెడ్డి అధ్యక్షతన జరిగిన స్థాయి సంఘం సమావేశంలో జడ్పీటీసిలు గాలి రవికుమార్, నర్సింగ్‌శ్రీనుగౌడ్‌లు మాట్లాడుతు గ్రామాల్లో పశుగ్రాసం కొరత ఏర్పడిందని, నీటి తొట్లు ఎక్కడ కనిపించడం లేదన్నారు. పశుగ్రాసం పంపిణీ చేపట్టి రైతులను ఆదుకోవాలన్నారు. ఖరీఫ్ పంటలకు విత్తనాలు, ఎరువులు సబ్సిడీపై అందించాలన్నారు. చైర్మన్ లింగారెడ్డి మాట్లాడుతు కరవు సహాయక చర్యలలో అధికార యంత్రాంగం విఫలమైందని, ప్రజాప్రతినిధులకు అధికారులు సమాచారం కూడా ఇవ్వడం లేదన్నారు. ఉపాధి కూలీలకు వేతన బకాయిలు చెల్లించాలని, రైతుల పంట రుణాలన్నింటిని మాఫీ చేయాలన్నారు. జెడిఏ నర్సింహారావు మాట్లాడుతు ప్రభుత్వం కరవు సహాయక చర్యల్లో భాగంగా పశుగ్రాసం విత్తనాలు పంపిణీ చేసిందన్నారు. ప్రభుత్వం నుండి నిధులు విడుదల జరిగితే రైతులకు పరిహారం అందుతుందన్నారు. మన తెలంగాణ మన వ్యవసాయం ద్వారా ఖరీఫ్‌లో పంటల మార్పిడి ఆవశ్యకత, పత్తి సాగు తగ్గింపు, కూరగాయల సాగులాభాలపై రైతులకు అవగాహాన కల్పిస్తున్నామన్నారు. ఎమ్మెల్సీ కర్నే ప్రభాకర్ రైతులకు పంట మార్పిడి, పత్తికి ప్రత్యామ్నాయంగా వేయాల్సిన పంటలపై అధిక ప్రచారం కల్పించాలన్నారు. పండ్ల తోటలు, కంది, మొక్కజొన్న, పప్పు ధాన్యాలు, కూరగాయాలు, పూల సాగుతో లాభాలను రైతులకు విశదీకరించాలన్నారు. డ్రిప్, స్ప్రింక్లర్ల సేద్యాన్ని ప్రొత్సహించాలన్నారు. వరంగల్ నుండి తాను సమావేశానికి వస్తుండగా మరిపెడ గ్రామం హరీఫ్ అనే రైతు తనకు ఇచ్చిన హైబ్రిడ్ జామకాయాలను ఆయన అందరికి చూపించారు. డ్వామా పిడి దామోదర్‌రెడ్డి మాట్లాడుతు జిల్లాలో 149నీటి తొట్లు పశువులకు తాగునీటి కోసం నిర్మించామని మరో 229పూర్తి చేయాల్సివుందన్నారు. ఇంకుడు గుంతలు 4440మంజూరు చేశామన్నారు. ఉపాధి హామీ పథకం కింద ఉద్యాన పంటలు, కూరగాయల సాగుకు ప్రోత్సహాకాలు అందిస్తున్నామన్నారు. ఉపాధి కూలీల బకాయిలు ప్రభుత్వం విడతల వారిగా చెల్లిస్తుందన్నారు. గ్యాస్ ఎజెన్సీలు సిలిండర్లపై అదనపు వసూళ్లకు పాల్పడుతు బలవంతంగా స్టవ్‌లను అంటగడుతున్నారని సభ్యులు ఆరోపించారు. రబీ ధాన్యం కొనుగోలులో డబ్బుల చెల్లింపు ఆలస్యమవుతుందంటు అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపై చర్యలు తీసుకుంటామని ఎఎస్‌వో వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సమావేశంలో జడ్పీ సీఈవో మహేందర్‌రెడ్డి, అధికారులు, జడ్పీటీసిలు పాల్గొన్నారు.