నల్గొండ

ముగిసిన ఎమ్మెల్యే గాదరి ప్రగతిబాట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అర్వపల్లి, జనవరి 21: రాష్ట్ర ఏర్పాటు తర్వాత నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిపై ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ చేపట్టిన ప్రగతిబాట కార్యక్రమం ఆదివారం తిమ్మాపురం, కోడూరు గ్రామాలతో ముగిసింది. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముడున్నరేళ్లలో నియోజవర్గంలో జరిగిన అభివృద్దిని ప్రజలకు తెలిపి వారి సమస్యలను తెలుసుకున్నట్లు తెలిపారు. నియోజవర్గంలోని అన్ని గ్రామల్లో సీసీరోడ్లు, మంచినీటి సౌకర్యం, మురికికాలువల నిర్మాణాలకు నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. కోడూరు గ్రామంలో అభివృద్ది పనులకు రూ.15లక్షలు, తిమ్మాపురం గ్రామానికి రూ.13లక్షలతో వౌలిక సదుపాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. వచ్చే నెల నుండి నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో పల్లెనిద్ర నిర్వహించనున్నట్లు తెలిపారు. మంత్రి జగదీశ్‌రెడ్డి సహకారంతో నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ది చేస్తున్నామన్నారు. ఈకార్యక్రమంలో స్థానిక ఎంపీపీ దావుల మనీషావీరప్రసాద్‌యాదవ్, సర్పంచ్‌లు జీడి వీరస్వామి, గంట కళమ్మ, నాయకులు సురేందర్‌రెడ్డి, కేవీ, లక్ష్మినర్సయ్య, మొరిశెట్టి ఉపేందర్, శోభన్‌బాబు, తిరుమలరావు, సోమేష్‌గౌడ్, శేఖర్‌రెడ్డి, సైదులు, శంకర్‌నాయక్, శ్రీనివాస్, వెంకట్‌రెడ్డి, పద్మ, నాగేందర్ తదితరులు పాల్గొన్నారు.

సీఎం కెసిఆర్‌ది ఆదర్శ పాలన
* రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ మందుల సామేల్
అడ్డగూడూరు, జనవరి 21: సీఎం కెసిఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తు దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శనీయ రీతిలో పాలన సాగిస్తున్నారని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ మందుల సామేల్ అన్నారు. ఆదివారం రాత్రి మండలంలోని ధర్మారం గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన 150మంది కార్యకర్తలు మందుల సామేల్ ఆధ్వర్యంలో టిఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు దేశంల ఏ రాష్ట్రంలో లేని రీతిలో సంక్షేమ రంగానికి 40వేల కోట్లు ఖర్చు చేస్తుందని, 24గంటల ఉచిత విద్యుత్ అందిస్తుందన్నారు. మే నుండి ఎకరాకు పెట్టుబడికి రైతుకు పంటకు నాలుగువేలు అందిస్తుందన్నారు. కాగా టిఆర్‌ఎస్ పార్టీలో చేరిన రెడ్డిమల్ల యాదగిరి, బాల్నే ప్రశాంత్, బండారు ప్రసాద్, మహేష్, ఈశ్వర్, రమేష్, నర్సయ్య ప్రభృతులు మాట్లాడుతు టిఆర్‌ఎస్ ప్రభుత్వం అభివృద్ధి పనులను చూసి తాము ఆ పార్టీలో చేరినట్లుగా తెలిపారు. గ్రామసర్పంచ్ మందుల విజయ, టిఆర్‌ఎస్ గ్రామశాఖ అధ్యక్షులు శీలం జావీద్, నాయకులు జక్కుల రవి, కత్తుల నరేష్, భిక్షం, కొమురయ్యలు పాల్గొన్నారు.