నల్గొండ

రూ.40వేల కోట్లతో రాష్ట్రంలో సంక్షేమ పథకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుర్రంపోడు, జనవరి 21: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలు కోసం 40వేల కోట్లు ఖర్చు చేస్తుందని నల్లగొండ పార్లమెంట్ సభ్యులు గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. మండలంలోని తేనేపల్లిలో 12లక్షలతో నిర్మించిన రెండు కమిటీ హాళ్లను ప్రారంభించి పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎంపీ గుత్తా మాట్లాడుతూ టీఆర్‌ఎస్ ప్రభుత్వం దేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వనటువంటి వ్యవసాయానికి 24 గంటల విద్యుత్‌ను సరఫరా చేస్తుందన్నారు. ఆసరా పింఛన్లు, కల్యాణ లక్ష్మి, షాదీముబారక్, కేసీఆర్ కిట్ తదితర పథకాలతో ప్రభుత్వం ప్రజాభిమానాన్ని చూరగొంటుందన్నారు. డిండి ఎత్తిపోతల పథకం పూర్తయితే గుర్రంపోడు ఎగువ ప్రాంతం, దేవరకొండ, మర్రిగూడ, నాంపల్లి మండలాల్లో లక్షల ఎకరాలు సాగులోకి వస్తాయని, ఫ్లోరోసిస్ నుండి విముక్తి కలుగుతుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం సాగు, తాగు నీటి కోసం అనేక ప్రాజెక్టులు నిర్మిస్తుందన్నారు. అనంతరం తేనేపల్లి తండాలో టీ ఆర్‌యస్ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ గాలి రవికుమార్‌గౌడ్, టీ ఆర్‌యస్ రాష్ట్ర నాయకులు గడ్డంపల్లి రవీందర్‌రెడ్డి, వైస్ ఎంపీపీ పూల చౌదరమ్మ, సర్పంచ్ నీల భారతమ్మ, టీ ఆర్‌యస్ పార్టీ మండల అధ్యక్షుడు గుండెబోయిన కిరణ్‌కుమార్ యాదవ్, టీ ఆర్‌యస్‌వీ నియోజకవర్గ ఇన్‌చార్జి పిల్లి అభినయ్ యాదవ్, పార్టీ నాయకులు గట్టుపల్లి భూపాల్‌రెడ్డి, సర్పంచులు ఎరుకల రామలింగం, గిరి ధనుంజయ, కాలం శ్రీ్ధర్‌రెడ్డి, షేక్ జుబేదా ఉమర్, పొలిశెట్టి సునీత రవీందర్, గోలి లలిత వెంకటేశ్వర్లు, టీ ఆర్‌యస్‌వీ నియోజకవర్గ నాయకులు షేక్ మహిమూద్, వడిత్యా నాగరాజు, టీ ఆర్‌యస్‌వీ మండల అధ్యక్షుడు బైరు మధు, నాయకులు మంచికంటి వెంకటేశ్వర్లు, పోలేని ముత్యాలు, షేక్ సయ్యద్‌మియా పాల్గొన్నారు.