నల్గొండ

ఏఎంఆర్‌పి ప్రధాన కాల్వకు నీరు విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెద్దఅడిశర్లపల్లి, జనవరి 21: ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు ప్రధాన కాల్వకు ఆదివారం నీటిపారుదల శాఖ అధికారులు నీటిని విడుదల చేశారు. కోదండాపురం ప్లాంట్ సమీపంలోని ప్రధాన కాల్వపై ఉన్నటువంటి గేట్లను ఎత్తి కిందికి నీటిని విడుదల చేశారు. పై అధికారుల ఆదేశాల మేరకు రెండో విడతలో భాగంగా ఆరుతడి పంటలకు నీటిని విడుదల చేస్తున్నట్లు ప్రాజెక్టు కార్యనిర్వాహక ఇంజినీర్ కరుణాకర్‌రెడ్డి తెలిపారు. దాదాపు పది రోజుల పాటు నీటి విడుదల కొనసాగనున్నట్లు ఆయన పేర్కొన్నారు. మొదటి రోజు 637 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామని, సోమవారం నుండి వెయ్యి క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.

అప్పుల బాధతో పత్తి రైతు ఆత్మహత్య
నాంపల్లి, జనవరి 21: అప్పుల బాధ భరించలేక, ఇటీవల వేసిన పత్తి పంట దిగుబడి రాకపోవడంతో మనస్థాపానికి గురైన పత్తి రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని శర్కాపురం గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన ఆడెపు అంజయ్య(49) గత మూడు సంవత్సరాల నుండి తనకున్న నాలుగు ఎకరాల వ్యవసాయ భూమితో పాటు మరికొంత భూమిని కౌలుకు తీసుకొని పత్తి పంటను సాగుచేస్తున్నాడు. మూడేళ్లలో ఐదున్నర లక్షల అప్పు కావడంతో తీర్చలేని స్థితిలో తన వ్యవసాయ బావి వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు వెల్లడించారు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కేసు నమోదు చేసినట్లు ఏఎస్‌ఐ శ్రీనివాస్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు ఎలుగోటి వెంకటేశ్వర్ రెడ్డి పరామర్శించి 10వేల రూపాయల ఆర్ధిక సహాయం అందజేశారు.