నల్గొండ

వాగ్దానాలు అమలు చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ రూరల్, జనవరి 22: ప్రభుత్వం జిల్లా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలుచేయాలని, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం తెలంగాణ సామాజిక, ప్రజా సంఘాల ఐక్యవేదిక(టీమాస్) ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన ధర్నాలో ఆయన పాల్గొని మాట్లాడారు. సామాజిక న్యాయం, సమగ్రాభివృద్ధే సాధన లక్ష్యంగా టీ మాస్ ఏర్పడిందని, గత ఆరు నెలల నుండి తెలంగాణ వ్యాప్తంగా ఆయా వర్గాలకు సామాజిక, రాజకీయ, సాంస్కృతిక రంగాల్లో కొనసాగుతున్న అసమానతలను నిర్మూలించాలని 284 సామాజిక ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ నెలలో తెలంగాణ వ్యాప్తంగా 93 శాతం ఉన్న సామాజిక తరగతుల అభివృద్ధికి, ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల అమలు కోసం పల్లె పల్లెలో కార్యక్రమాలు నిర్వహించి సంఘటితం చేస్తున్నామని తెలిపారు. అదే విధంగా ప్రజలకు కృష్ణా జలాల ద్వారా తాగు, సాగు నీరందించాలని, ఆయా వర్గాల యువతీ యువకుల వలసలను నివారించి స్థానికంగా ఉపాధి అవకాశాలు కల్పించాలని, అర్హులైన వారికి డబుల్ బెడ్ రూం ఇళ్లు, ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు మూడెకరాల భూమి, గీత, చేనేత, మత్య్స, గొర్రెల కాపరులు, రజక, నారుూ బ్రాహ్మణ, వడ్డెర, విశ్వకర్మ తదితర వృత్తిదారులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలుచేయాలన్నారు. జీవో నెం.1235 ప్రకారం ప్రతీ గ్రామానికి శ్మశాన వాటికకు స్థలం కేటాయించాలని, మెడికల్ కళాశాల, కేజీ టు పీజీ విద్య, జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు, సబ్ ప్లాన్ నిధులు కేటాయించాలన్నారు. ఎంబీసీ కులాల జాబితా ప్రకటించాలని, రైతుల రుణ మాఫీకి 37వేల కోట్లు అందించి పంటలకు లాభసాటి ధరలు కల్పించాలని, రైతుల ఆత్మహత్యలను అరికట్టాలని, సమగ్ర వ్యవసాయ అభివృద్ధికి చట్టం తీసుకరావాలని డిమాండ్ చేశారు. ప్రతీ గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటుచేసి, నియోజకవర్గంలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మించాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో సీపీయం, టీమాస్ నాయకులు డబ్బికార్ మల్లేశ్, నారి ఐలయ్య, దర్శనం నర్సింహా, బాలకృష్ణ, విప్లవ్ కుమార్, పాలడుగు నాగార్జున, నాగరాజు, ప్రమీల, బండా శ్రీశైలం, ప్రభావతి, మట్టయ్య, యాదయ్య, కొమరయ్య, మురళి తదితరులు పాల్గొన్నారు.