నల్గొండ

గ్రీవెన్స్‌డేలో వినతుల వెల్లువ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ రూరల్, జనవరి 22: పలు సమస్యలపై జిల్లా నలుమూలల నుండి బాధితులు సోమవారం నల్లగొండ కలెక్టరేట్‌లో నిర్వహించిన గ్రీవెన్స్‌లో కలెక్టర్ గౌరవ్ ఉప్పల్‌కు వినతి పత్రాలు అందజేశారు. ఆహార భద్రత కార్డులు, దళితుల మూడెకరాల భూమి, రెండు పడక గదుల ఇళ్లు, ఆసరా, వికలాంగుల పింఛన్లు తదితర సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్‌కు మొర పెట్టుకున్నారు. అదే విధంగా టీ మాస్ నాయకులు ప్రజా సమస్యలను పరిష్కరించాలని, శాలీగౌరారం మండలం పెరక కొండారం దళిత రైతులు భూముల ఆక్రమణపై వినతులను అందజేశారు. జేసీ నారాయణరెడ్డి, డీఆర్‌డీఏ పీడీ అంజయ్య తదితరులు పాల్గొన్నారు.

పల్లెల్లో వౌలిక వసతుల కల్పనే ధ్యేయం

* ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్
అడ్డగూడూరు, జనవరి 22: మారుమూల గ్రామాల్లో సైతం వౌలిక వసతులు కల్పించడమే ధ్యేయంగా కృషి చేస్తున్నట్లు తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ అన్నారు. ప్రగతి బాట కార్యక్రమంలో భాగంగా సోమవారం మండలంలోని హాజిపేట, కొండంపేట గ్రామాల్లో టీఆర్‌ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఎమ్మెల్యే గాదరి మాట్లాడుతూ త్వరలోనే కొండంపేట గ్రామాన్ని గ్రామపంచాయతీగా ఏర్పాటుచేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణానికి 5లక్షలు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. హాజిపేట గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణానికి, వెల్దేవి నుండి మానాయికుంటకు వెళ్లే 3కిలో మీటర్ల రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తానన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అలుపెరగని కృషి చేస్తున్నట్లు తెలిపారు. మార్కెట్ కమిటీ చైర్మన్ సిహెచ్.మహేంద్రనాథ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో టీఆర్‌యస్ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి, రైతు సమన్వయ సమితి మండల కో ఆర్డినేటర్ మేఘారెడ్డి, ఎంపీపీ ఓర్సు లక్ష్మి, టీఆర్‌యస్ మండల అధ్యక్షుడు పొన్నాల వెంకటేశ్వర్లు, నాయకులు పాల్గొన్నారు.