నల్గొండ

టీమాస్ కలెక్టరేట్ ముట్టడి ఉద్రిక్తం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యాపేట, జనవరి 22: టీమాస్ ఆధ్వర్యంలో ప్రజాసమస్యల పరిష్కారం కోసం సోమవారం నిర్వహించిన కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. కలెక్టరేట్ గేటు ముందు బైఠాయించి ఆందోళన చేస్తున్న వారి వద్దకు వచ్చి కలెక్టర్ వినతిపత్రం స్వీకరించే సమయంలో అడ్డుకోవడంతో తోపులాట జరగగా పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు స్వల్ప లాఠీచార్జి జరిపారు. టీమాస్ ఆధ్వర్యంలో ఇటీవల గ్రామాల్లో ప్రజాసమస్యలపై నిర్వహించిన సర్వేలో గుర్తించిన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కలెక్టరేట్ ముట్టడి చేపట్టారు. తొలుత ఈకార్యక్రమంలో టీమాస్ జిల్లా చైర్మన్ వసంత సత్యనారాయణపిళ్లే, ములకలపల్లి రాములులు మాట్లాడుతూ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హమీలన్నీంటిని మంజూరు చేయాలని, పేదలందరికి డబుల్ బెడ్‌రూం ఇళ్ల మంజూరు చేయాలని, దళితులకు మూడెకరాల చొప్పున భూపంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా గ్రామల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని కోరారు. వినతిపత్రం స్వీకరించేందుకు జిల్లా కలెక్టర్ సురేంద్రమోహన్ అక్కడికి చేరుకొని సమస్యలు పరిష్కరిస్తామని మాట్లాడుతున్న సమయంలో సమస్యలు పరిష్కారం కావడం లేదంటూ కొందరు నినాదాలు చేయడంతో తోపులాట జరిగింది. ఈక్రమంలో పోలీసులు స్వల్పంగా లాఠీచార్జీ చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. దీంతో అక్కడ కొంత సేపు ఉద్రిక్త వాతారణం నెలకొంది. ఈధర్నాలో టీమాస్ నాయకులు మల్లు నాగార్జున్‌రెడ్డి, రవినాయక్, నెమ్మాది వెంకటేశ్వర్లు, మల్లు లక్ష్మి, కోట గోపి, మేకనబోయిన శేఖర్, మట్టిపల్లి సైదులు తదితరులు పాల్గొన్నారు.