నల్గొండ

ఎస్సీ, ఎస్టీల ఫిర్యాదులపై తక్షణమే కేసులు నమోదు చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యాపేట, ఫిబ్రవరి 20: జిల్లాలో ఎస్సీ, ఎస్టీ వర్గాలపై దాడులు, దౌర్జన్యాలపై ఫిర్యాదులు అందిన వెంటనే కేసులు నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ కె.సురేంద్రమోహన్ పోలీస్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ తన చాంబర్‌లో జిల్లా విజిలెన్స్ మానీటరింగ్ కమిటీ సమావేశాన్ని నిర్వహించి జిల్లాలో ఇప్పటి వరకు నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులపై జిల్లా ఎస్పీ ప్రకాశ్ జాదవ్‌తో సమీక్షించారు. 2014 నుండి ఇప్పటి వరకు ఎస్సీ, ఎస్టీలపై జరిగిన దాడులు, నమోదైన కేసులతో పాటు పెండింగ్‌లో ఉన్న కేసుల గురించి చర్చించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన నాటి నుండి జిల్లాలో ఇప్పటి వరకు 63కేసులు నమోదైనట్లు తెలిపారు. వీటిలో సకాలంలో సాక్షులు హజరుకాక 14కేసులు, మెడికల్ రిపోర్టులు అందక 8కేసులు, భూరికార్డులను తహశీల్ధార్‌లు సకాలంలో పంపనందున మరో 6కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు తెలిపారు. 2కేసులు పూర్తివిచారణ అనంతరం మూసివేసినట్లు ఎస్పీ కలెక్టర్‌కు వివరించారు. హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న 9కేసులకు సంబంధించి హోంశాఖ ప్రభుత్వ న్యాయవాదితో సంప్రదించి కేసుల త్వరగా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అదేవిధంగా ప్రభుత్వ భూమల కేసులకు సంబంధించిన తహశీల్ధార్‌ల నుండి హక్కుపత్రాలను పోలీస్ అధికారుకు అందించే విధంగ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ, అటవీశాఖల మధ్య వివాదాస్పద భూములకు సంబంధించిన కేసులను రెండుశాఖలు సంయుక్తంగా విచారణ చేసి నివేదికను అందించేవిధంగా చర్యలు తీసుకోవాలని డీ ఆర్‌వో యాదిరెడ్డిని ఆదేశించారు. ఇటీవల నాగారం మండలం వర్ధమానుకోటలో దళిత యువతి ఆకారపు అనపూర్ణ హత్యకు గురైందని హతురాలి తల్లికి గ్రామంలో నిర్మించే రెండుపడక గదుల్లో ఇంటిని మంజూరుచేస్తున్నట్లు తెలిపారు. అత్యాచార బాధితులకు అందించే పరిహరాన్ని ఇకనుండి మంత్రి జగదీశ్‌రెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈసమావేశంలో ఎఎస్పీ షేక్ ఇస్మాయిల్, సూర్యాపేట, కోదాడ డీఎస్పీలు నాగేశ్వరరావు, రమణారెడ్డి, జిల్లా రెవిన్యూ అధికారి పబ్బతిరెడ్డి ఆదిరెడ్డి, జిల్లా ఎస్సీ సంక్షేమ అధికారి దయానందరాణి, గిరిజన సంక్షేమ అధికారి సంజీవరావు తదితరులు పాల్గొన్నారు.