నల్గొండ

అసంపూర్తి పనులను వెంటనే పూర్తి చేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చౌటుప్పల్, ఫిబ్రవరి 20: హైవే విస్తరణలో భాగంగా అసంపూర్తిగా మిగిలిపోయిన పనులను వెంటనే పూర్తి చేసేందుకు కృషి చేస్తానని జీఎంఆర్ జీఎం శ్రీ్ధర్‌రెడ్డి హామీ ఇచ్చారు. అసంపూర్తి పనులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలు సోమవారం పంతంగి టోల్‌ప్లాజాను ముట్టడించి ధర్నా చేయడంతో జీఎంఆర్ హైవే అధికారులు స్పందించి మంగళవారం పద్మావతి ఫంక్షన్ హాల్‌లో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసారు. ముఖాముఖీ చర్చ నిర్వహించారు. హైవే వెంట మిగిలిపోయిన పనులు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జాతీయ రహదారి వెంట రోడ్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేసేందుకు, వీధి లైట్లు వెలిగించేందుకు చర్యలు తీసుకుంటానని శ్రీ్ధర్‌రెడ్డి హమీ ఇచ్చారు. వై జంక్షన్ ఏర్పాటుకు భూసేకరణ జరగాల్సి ఉందన్నారు. అవసరమైన చోట అండర్ పాసింగ్‌వేలను ఏర్పాటు చేసేందుకు జీఎంఆర్ యాజమాన్యానికి ప్రతిపాదనలు పంపించి చర్యలు తీసుకుంటానన్నారు. చౌటుప్పల్ పట్టణంలో సర్వీస్ రోడ్లు పూర్తి, డ్రైనేజీల ఏర్పాటుకు తక్షణమే చర్యలు తీసుకుంటానన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కారం చేసేందుకు జీఎంఆర్ సంస్థ సిద్ధంగా ఉందని శ్రీ్ధర్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ సమావేశంలో జెడ్పీటీసీ సభ్యుడు పెద్దిటి బుచ్చిరెడ్డి, జాతీయ రహదారి సంస్థ అధికారులు జితేందర్‌రెడ్డి, కృష్ణమూర్తి, జీఎంఆర్ ప్రతినిధులు కృష్ణారెడ్డి, రవీందర్, పట్టణ సీఐ వెంకటయ్య, ట్రాఫిక్ సీఐ గోపాల్, గ్రంథాలయం చైర్మన్ ఊడుగు మల్లేశంగౌడ్, సర్పంచ్‌లు ముటుకులోజు దయాకరాచారి, సుర్వి మల్లేశంగౌడ్, రిక్కల సుధాకర్‌రెడ్డి, నందగిరి మహేశ్వరిశ్యామ్, కానుగు యాదమ్మబాలరాజు, మాచర్ల కృష్ణ, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ కొత్త పర్వతాలు, చింతల దామోదర్‌రెడ్డి, ముత్యాల భూపాల్‌రెడ్డి, జింకల కృష్ణ, కంది భూపాల్‌రెడ్డి, తడక కిరణ్, ఊడుగు శ్రీనివాస్‌గౌడ్ ఎం.డి.బాబాషరీఫ్, ఢిల్లీ శంకర్‌రెడ్డి, ఎం.డి.ఖలీల్, రహీం, అయోధ్య, బొడ్డు శ్రీనివాస్‌రెడ్డి, రిక్కల భాస్కర్‌రెడ్డి, బొమ్మిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఢిల్లీ మాధవరెడ్డి, వీరమళ్ల సత్తయ్య, రఘు పాల్గొన్నారు.

దేవాలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు
- సీఎల్పీ ఉప నేత కోమటిరెడ్డి
రామగిరి, ఫిబ్రవరి 20: దేవాలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలని సీఎల్పీ ఉప నేత, నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. మంగళవారం పట్టణంలోని రవీంద్రనగర్‌లో శ్రీశ్రీశ్రీ విజయ గణపతి, సరస్వతి దేవాలయం త్రిరాత్రి బ్రహ్మోత్సవ కార్యక్రమాల్లో ముఖ్య అతిథిగా పాల్గొని స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలో స్వామి వారికి మూలమంత్ర జపాలు, హోమ కార్యక్రమాలు, పూర్ణాహుతి, అభిషేకాలు నిర్వహించారు.అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు పాదూరి మోహన్‌రెడ్డి, గౌరవ అధ్యక్షులు కూతురు లక్ష్మారెడ్డి, ఉపాధ్యక్షులు సురిగి మారయ్య, నాళ్ల వెంకన్న, నంద్యాల వీరబ్రహ్మానందరెడ్డి, పైళ్ల మధుసూదన్‌రెడ్డి, జెల్లా శ్రీశైలం, సూరెడ్డి సరస్వతి మోహన్‌రెడ్డి, వంగాల నరేందర్‌రెడ్డి, కాసోజు విశ్వనాధం, కొత్త సీతయ్య, ఓరుగంటి శ్రీనివాస్, వీరమళ్ల భాస్కర్ పాల్గొన్నారు.