నల్గొండ

కందుల కొనుగోలులో సర్కార్ విఫలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, ఫిబ్రవరి 20: కందుల కొనుగోలులో టిఆర్‌ఎస్ ప్రభుత్వం దారుణంగా విఫలమైందని దళారుల కొమ్ముకాస్తు సామాన్య రైతులకు అన్యాయం చేస్తుందని టి.జెఎసి నల్లగొండ జిల్లా కమిటీ ధ్వజమెత్తింది. మంగళవారం నల్లగొండ మార్కెట్ యార్డులో కందుల కొనుగోలు తీరుతెన్నులను టి.జెఎసి జిల్లా కన్వీనర్లు పన్నాల గోపాల్‌రెడ్డి, పందుల సైదులల ఆధ్వర్యంలోని బృందం పరిశీలించింది. యార్డులో నిల్వ ఉన్న కందుల రాసులను, బస్తాలను తనిఖీ చేసి వాటి వివరాలు పరిశీలించింది. దళారి వ్యాపారులు మార్కెట్ వెనుక గేటు నుండి నాలుగు ట్రాక్టర్లలో తెచ్చిన కందుల బస్తాలను యార్డులోకి తీసుకరాగా గమనించిన జెఎసి నాయకులు వాటిని స్థానిక పోలీసులకు అప్పగించారు. యార్డులోని రైతులు జెఎసి బృందానికి కందుల అమ్మకంలో తాము ఎదుర్కోంటున్న సమస్యలను ఏకరవు పెట్టారు. తాము మూడు రోజులుగా కందుల కొనుగోలుకు యార్డులోనే పడిగాపులు పడుతున్నామని, దళారీ వ్యాపారుతో కుమ్మక్కైన కొందరు సిబ్బంది ముందుగా వారి కందులు కొనుగోలు చేసి తమను నిర్లక్ష్యం చేస్తున్నారంటు మొర పెట్టుకున్నారు. తమ కందులకు అన్ని పత్రాలు అడుగుతున్న అధికారులు రైతుల ముసుగులో ఉన్న దళారులను మాత్రం ఇష్టారాజ్యంగా యార్డులోకి కందులను తీసుకరానిస్తున్నారన్నారు. తమను ఐదు క్వింటాళ్లు దాటితే మండల విజిలెన్స్ కమిటీ నుండి దృవీకరణ కోరుతున్న మార్కెట్ అధికారులు దళారుల కందులను మాత్రం యథేచ్ఛగా కొనుగోలు చేస్తున్నారంటు ఆరోపించారు. బయట మార్కెట్‌లో కందులను తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్న వ్యాపారులు మార్కెట్‌కు తీసుకవచ్చి మద్ధతు ధర పొందే ప్రయత్నం చేస్తుండటంతో సాధారణ రైతులకు అన్యాయం జరుగుతుందంటు మొరపెట్టుకున్నారు. ఈ సందర్భంగా టి.జెఎసి నాయకులు గోపాల్‌రెడ్డి, సైదులు మాట్లాడుతు రాత్రివేళ మార్కెట్‌లోకి దళారులు అక్రమంగా కందులను లోనికి తీసుకొస్తున్నారన్నారు. అధికారులు నిజమైన రైతులను నిర్లక్ష్యం చేస్తు, ఆంక్షలు పెడుతు వ్యాపారుల కందులను కొనుగోలు సాగిస్తు రైతులకు అన్యాయం చేస్తున్నారంటు ఆరోపించారు. పదేపదే సెలవులు ప్రకటించి రైతులను తిప్పలు పెడుతున్నారన్నారు. జిల్లా యంత్రాంగం కంది రైతుల సమస్యలను పరిష్కరించని పక్షంలో ఆందోళన చేపడుతామన్నారు. ఈ కార్యక్రమంలో జెఎసి నాయకులు గద్దెపాటి సురేందర్, తోట నరసింహాచారి, వీరానాయక్, బొమ్మడి నగేశ్, కట్టా సైదులు, బత్తిని వెంకన్న, గోవర్ధన్, యాదగిరిచారి పాల్గొన్నారు.