క్రైమ్/లీగల్

చిన్నారిని చిదిమేసిన ట్రాక్టర్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కట్టంగూర్, మార్చి 4: సెలవుదినం రోజున సరదాగా ఇంటి ముందు ఆడుకుంటున్న ముక్కుపచ్చలారని మూడేళ్లబాలుడిని ట్రాక్టర్ ఢీకొట్టడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందిన విషాద సంఘటన మండలపరిధిలోని ఈదులూరు గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం ఈదులూరు గ్రామంలోని పందెనపల్లి రోడ్డులో అదేగ్రామానికి చెందిన జి.నర్సింహ అనేవ్యక్తికి చెందిన ట్రాక్టర్ సమీపంలో నిలిపి ఉంది. మధ్యాహ్నం సమయంలో ఎండతీవ్రత అధికంగా ఉండడంతో ట్రాక్టర్‌ను నీడలో పెట్టేందుకు నర్సింహ కుమారుడు మురళీ ట్రాక్టర్‌ను స్టార్ట్ చేయగా అదుపుతప్పి సుమారు 50మీటర్ల దూరంలో ఇంటి ముందు ఆడుకుంటున్న మూడేళ్ల చిన్నారి గద్దపాటి పవన్ ఢీకొట్టి గోడను తగిలి ఆగిపోయింది. ఈప్రమాదంలో గద్దపాటి సుధాకర్ కుమారుడైన పవన్ అక్కడికక్కడే మృతిచెందాడు.