క్రైమ్/లీగల్

ఆస్తి కోసం అత్తను చంపిన అల్లుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కనగల్, మార్చి 5: మండలంలోని దర్వేశీపురంలో నాలుగు రోజుల క్రితం జరిగిన కంచరకుంట నర్సమ్మ హత్య కేసును పోలీసులు ఛేదించారు. నిందితులను అరెస్ట్ చేసి సోమవారం రిమాండ్‌కు తరలించారు. హత్యకు పాల్పడిన ఏ1 నిందితుడు వేమిరెడ్డి మాధవరెడ్డి నర్సమ్మకు అల్లుడు కాగా, ఏ3 నిందితురాలు ఏశమ్మ కుమార్తె కావడం గమనార్హం. సీఐ రమేష్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం హతురాలు నర్సమ్మకు మొత్తం 6 ఎకరాల భూమి ఉంది. పెద్ద కుమార్తె ఏశమ్మకు 3.19 ఎకరాలు, రెండో కుమార్తెకు 2.18 ఎకరాలను పట్టా చేశారు. భూ విషయమై వివాదం చోటుచేసుకోగా.. పెద్ద కుమార్తె ఏశమ్మ, భర్త మాధవరెడ్డి, నర్సమ్మ ఇంటి పక్కనే నివాసం ఉంటున్న ఏ2 నిందితుడు నకిరెకంటి శంకర్‌గౌడ్‌లు పథకం ప్రకారం నర్సమ్మను బండరాళ్లతో కొట్టి హత్య చేసినట్లు వివరించారు. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి కోర్టుకు రిమాండ్ చేసినట్లు సీఐ వెల్లడించారు.