క్రైమ్/లీగల్

స్కూల్ బస్ కింద పడి విద్యార్థి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మోత్కూర్, మార్చి 14: ఓ ప్రైవేట్ పాఠశాల బస్సు కింద పడి విద్యార్థి మృతి చెందిన సంఘటన బుధవారం సాయంత్రం మండల కేంద్రంలో చోటుచేసుకుంది. స్థానికులు, మృతుని బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. జవ్వారి జనార్థన్, భాగ్యమ్మల పెద్ద కుమారుడు విజయ్‌సాయి (10) స్థానిక ప్రైవేట్ పాఠశాలలో నాల్గవ తరగతి చదువుతున్నట్లు తెలిపారు. మిర్యాలగూడ సొంత గ్రామం కాగా, సంవత్సరం క్రితం బతుకుదెరువు కోసం మోత్కూర్ పరిధిలోని ఇందిరానగర్‌లో నివాసముంటున్నట్లు తెలిపారు. విద్యార్థి విజయ్‌సాయి హాస్టల్‌లో ఉండి చదువుకుంటుండగా..బుధవారం పాఠశాల విడిచిపెట్టిన సమయంలో స్థానిక విద్యార్థులతో కలిసి బస్సులో బయటకు వెళ్లి తిరిగి అదే బస్సులో పాఠశాలకు వస్తూ ఫుట్‌బోర్డుపై ప్రయాణిస్తుండగా.. జారి కిందపడటంతో బస్సు వెనుక టైరు విద్యార్థిపై నుంచి వెళ్లడంతో తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం భువనగిరి ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. పాఠశాల లోపలికి వెళ్తున్న క్రమంలో టర్నింగ్‌లో డ్రైవర్ వేగంగా బస్సును నడపడంతోనే విద్యార్థి జారిపడి ఉండవచ్చని కొందరు, ఉపాధ్యాయులకు చెప్పకుండా బయటకు వెళ్లడంతో ఉపాధ్యాయులు తిడతారని ముందుగానే దిగే క్రమంలో విద్యార్థి బస్సు నుంచి దూకవచ్చని మరికొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బస్సు వేగంగా ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. విద్యార్థి మృతికి కారణమైన స్కూల్ ఫాదర్‌ను సస్పెండ్ చేయాలని, బస్సు డ్రైవర్‌ను కఠినంగా శిక్షించి పాఠశాల గుర్తింపును రద్దు చేయాలని పలు విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.