నల్గొండ

పడ్మట్‌పల్లిలో టిఆర్‌ఎస్, సిపిఐ కార్యకర్తల మధ్య ఘర్షణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేవరకొండ, మే 3: దేవరకొండ మండలం పడ్మట్‌పల్లి గ్రామంలో సోమవారం రాత్రి టి ఆర్ ఎస్, సిపి ఐ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. గ్రామపంచాయతి నల్లా విషయంలో చోటు చేసుకున్న వివాదం చిలికిచిలికి గాలివానగా మారడంతో టి ఆర్ ఎస్, సిపి ఐ కార్యకర్తలు ఒకరిపై ఒకరు కర్రలతో దాడి చేసుకోవడంతో టి ఆర్ ఎస్ కు చెందిన ముగ్గురు, సిపి ఐ కి చెందిన ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. పడ్మట్‌పల్లి గ్రామంలోని ఓ వీధిలో ఇటీవలి కాలంలో గ్రామపంచాయతి నల్లాను ఏర్పాటు చేసింది. గ్రామసర్పంచ్ టి ఆర్ ఎస్ పార్టీకి చెందిన వ్యక్తి కావడంతో ఆయన అనుచరులు నల్లా వచ్చినంత సేపు నల్లాకు పైపు వేసి పట్టుకుంటున్నారని వారు నీటిని పట్టుకున్న అనంతరం పైపును తీసి వేస్తుండడంతో అడిగినందుకు తమపై దాడి చేశారని సిపి ఐ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.
కాగా పాత కక్ష్యలను దృష్టిలో పెట్టుకొని తమపై సిపి ఐ కార్యకర్తలు దాడి చేశారని టి ఆర్ ఎస్ వర్గీయులు ఆరోపిస్తున్నారు. సోమవారం రాత్రి జరిగిన దాడిలో టి ఆర్ ఎస్‌కు చెందిన దాసరి పర్వతాలు, దాసరి ఆంజనేయులు, దాసరి అంబయ్యలు తీవ్రంగా గాయపడగా, సిపి ఐకి చెందిన ఉడత సత్యనారాయణ, ఉడత వెంకటయ్యలు తీవ్రంగా గాయపడ్డారు. టి ఆర్ ఎస్‌కు చెందిన దాసరి అంతమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సిపి ఐకి చెందిన ఉడత వెంకటయ్య, బొడ్డుపల్లి వెంకటయ్య, కడారి దేవేందర్‌లతో సహా ఎనిమిది మందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌హెచ్‌వో గట్టుమల్లు తెలిపారు. సిపి ఐ వర్గీయులు ఎలాంటి ఫిర్యాదు చేయలేదని ఆయన చెప్పారు.
జడ్పీ చైర్మన్ బాలూనాయక్ పరామర్శ
పడ్మట్‌పల్లి గ్రామంలో సిపి ఐ కార్యకర్తల దాడిలో గాయపడి దేవరకొండ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న టి ఆర్ ఎస్ కార్యకర్తలను మంగళవారం రోజు జిల్లా పరిషత్ చైర్మన్ నేనావత్ బాలూనాయక్ పరామర్శించారు. దాడికి గల కారణాలను బాధితులనుండి అడిగి తెలుసుకున్నారు. గాయపడ్డ వారికి మెరుగైన చికిత్స అందించాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు. అకారణంగా దాడికి పాల్పడ్డ సిపి ఐ కార్యకర్తలను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. బాధితులను పరామర్శించిన వారిలో టి ఆర్ ఎస్ మండల అధ్యక్షుడు మారుపాకుల సురేశ్‌గౌడ్, ఎం ఎ సిరాజ్‌ఖాన్, చింతపల్లి సుభాష్, ముచ్చర్ల ఏడుకొండల్ ఉన్నారు.