నల్గొండ

సమస్యల పరిష్కారంలో వైఫల్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆలేరు, ఏప్రిల్ 17: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సమస్యల పరిష్కారంలో పూర్తిగా విఫలమయ్యాయని ఏఐసీసీ సభ్యులు బూడిద బిక్షమయ్యగౌడ్ విమర్శించారు. మంగళవారం మండల పరిధిలోని మందనపల్లి గ్రామంలో ఇంటింటికీ కాంగ్రెస్ మ్యానిఫెస్టో కార్యక్రమంలో భాగంగా ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అకాల వర్షానికి నష్టపోయిన పంటలకు, ఎండిన వరి పైరుకు పరిహారం అందించడంలో ప్రభుత్వం ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. వరికి మద్దతు ధర పెంచాలని, పెట్టుబడులకు డబ్బులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు జనగాం ఉపేందర్‌రెడ్డి, కొల్పుల హరినాథ్, నీలం పద్మ వెంకటస్వామి, ఎంఏ.ఎజాజ్, శివమల్లు, సాగర్, పరుశురాములు తదితరులు పాల్గొన్నారు.

మతిస్థిమితం లేని మహిళను
అమ్మానాన్న ఆశ్రమానికి తరలింపు
మర్రిగూడ, ఏప్రిల్ 17: గత నాలుగు రోజుల నుండి మర్రిగూడ గ్రామంలో మతిస్థిమితం లేని మహిళ తిరుగుతుండటాన్ని గమనించిన సామాజిక కార్యకర్త నల్లా యాదయ్య మంగళవారం పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఎస్‌ఐ కొండల్‌రెడ్డి స్పందించి మహిళను చౌటుప్పల్ మండలంలో గల అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి పంపించారు.