నల్గొండ

రైతుబంధు చెక్కుల కోసం రైతుల్లో ఆతృత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, ఏప్రిల్ 17: రైతుబంధు చెక్కుల కోసం రైతులు ఆతృతగా ఎదురుచూస్తున్నారని ఇప్పటివరకు 3,300గ్రామాలకు చెందిన 16లక్షల చెక్కులు రైతులకు పంపిణీ చేసేందుకు సిద్ధమయ్యాయని రాష్ట్ర రైతు సమన్వయ సమితి చైర్మన్, ఎంపి గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన నల్లగొండ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి కంచర్ల భూపాల్‌రెడ్డితో కలిసి నల్లగొండలో విలేఖరులతో మాట్లాడారు. కొత్త పాసుపుస్తకాలు ప్రింట్ అవుతున్నాయని వాటితో పాటే రైతులకు చెక్కులు అందించాల్సివుండటంతో చెక్కుల పంపిణీలో ఆలస్యం నెలకొందన్నారు. ఈనెల చివరి వారం నుండి చెక్కుల పంపిణీ మొదలవుతుందన్నారు. సీఎం కెసిఆర్ రైతు సంక్షేమానికి కోటి ఎకరాల సాగుభూమికి నీరు, సరిపడేంత విద్యుత్, క్లస్టర్‌ల ఏర్పాటుతో రైతులకు పంటల సాగులో సూఛనలు అందించే కార్యక్రమాలు అమలు చేస్తున్నారన్నారు. భూరికార్డులను ప్రక్షాళన చేసి ధరణి వెబ్‌సైట్‌తో పారదర్శకం చేశారన్నారు. రైతుబంధుకు 12వేల కోట్లు, బీమాకు 500కోట్లు, యాంత్రీకరణకు 530కోట్లు ప్రభుత్వం కేటాయించిందన్నారు. పాడి రైతుల ప్రొత్సాహాకాల చెల్లింపు త్వరలోనే పూర్తవుతుందన్నారు. తెలంగాణకు నది జలాల సాధనలో జరిగిన అన్యాయాలపై పోరాడి రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన విద్యాసాగర్‌రావు పేరును డిండి ఎత్తిపోతల పథకం పెట్టడం హర్షనీయమన్నారు. ఈ నెల 19న విద్యాసాగర్ వర్ధంతిని టిఆర్‌ఎస్ ఘనంగా నిర్వంచనుందన్నారు. సూర్యాపేట కలెక్టరేట్ నిర్మాణంలో భూ కుంభకోణం జరిగిందంటు ప్రతిపక్షాలు చేసిన ఆరోపణలు కేవలం రాజకీయ దుష్ప్రచారం మాత్రమేనన్నారు. నల్లగొండ కలెక్టరేట్ కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలో నిర్మితమవ్వగా నేటికి దాని చుట్టు భూముల విలువ పెరిగిందేమిలేదన్నారు. నల్లగొండ మెడికల్ కళాశాలను జిల్లా కేంద్ర ఆసుపత్రిలో ప్రారంభించి నిర్మాణాలను ఎస్‌ఎల్‌బిసి భూముల్లో కొనసాగించేలా ప్రభుత్వానికి సెర్చ్ కమిటీ ప్రతిపాదనలు చేసిందన్నారు. కెసిఆర్ పాలనకు వ్యతిరేకంగా పిసిసి చీఫ్ ఉత్తమ్ చెబుతున్న నిశ్శబ్ధ విప్లవం ఆయనకు తప్ప ఇంకెవరికి కనబడటం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఆ పార్టీ నాయకులే శత్రువులని, సర్వే సత్యనారాయణ సైతం తాజాగా నేనే సీఎం అవుతానంటు చెప్పిన తీరు కాంగ్రెస్‌లో సీఎం పదవి పోటీదారుల జాబితాను మరింత పెంచేసిందన్నారు. యాసంగి ధాన్యం కొనుగోలులో రాష్ట్రంలో నల్లగొండ ప్రథమ స్థానంలో ఉందని అకాల వర్షాల ముంపు పొంచి ఉన్నందునా రైతులు నష్టపోకుండా తగిన జాగ్రత్తలు పాటించాలన్నారు.
సమస్యలు పరిష్కారమయ్యే వరకూ పోరాటం
* 48 గంటల దీక్షలో బీజేపీ నేత వీరెల్లి
రామగిరి, ఏప్రిల్ 17: నల్లగొండ పట్టణంలోని 28, 31 వార్డుల్లో నెలకొన్న సమస్యలను తక్షణం పరిష్కరించి, అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వీరెల్లి చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. బీజేవైయం నేతలు వంగూరి రాఖీ, మాలె శ్రీరాంరెడ్డిల ఆధ్వర్యంలో పట్టణంలో చేపట్టిన 48 గంటల దీక్షా శిబిరాన్ని రెండో రోజు మంగళవారం బీజేపీ నేతలు సందర్శించి మాట్లాడారు. పట్టణంలో మురికి కాల్వలు, వీధి దీపాలు, రహదారి సౌకర్యాలు సక్రమంగా లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇప్పటికైనా మున్సిపల్ పాలక వర్గం నిర్లక్ష్యాన్ని వీడి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. దీక్షలో పార్టీ నాయకులు బండారు ప్రసాద్, నిమ్మల రాజశేఖర్‌రెడ్డి, దాయం భూపాల్‌రెడ్డి, కంకణాల నాగిరెడ్డి, దర్శనం వేణుకుమార్, కౌన్సిలర్లు రావుల శ్రీనివాస్‌రెడ్డి, బొజ్జ నాగరాజు, మొరిశెట్టి నాగేశ్వర్‌రావు, జివి.యాదవ్, గడ్డం మహేష్, ముంత సైదులు, హరీష్, కోటి,కిశోర్, శివ, అఖిల్, వినయ్, కోటేష్, శ్రీనివాస్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.