నల్గొండ

కాంగ్రెస్‌లో ఫుల్ జోష్...!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, ఏప్రిల్ 17: కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌ల శాసన సభ్యత్వాల రద్ధును హైకోర్టు కొట్టివేస్తు వారి శాసన సభ్యత్వాలను పునరుద్ధరిస్తు మంగళవారం తీర్పు వెలువరించడంతో కోమటిరెడ్డి అనుఛరుల్లో, కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో హర్షాతీరేకాలు వ్యక్తమయ్యాయి. కోర్టు తీర్పు పట్ల కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు వ్యక్తం చేస్తు ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా బాణసంఛాను కాల్చి, స్వీట్లు పంపిణీ చేసుకుని ర్యాలీలతో తమ ఆనందోత్సాహాలు వ్యక్తం చేశారు. నల్లగొండ, మిర్యాలగూడ, దేవరకొండ, హుజూర్‌నగర్, సాగర్, కోదాడ, సూర్యాపేట, నకిరేకల్, ఆలేరు, మునుగోడు, చౌటుప్పల్, భువనగిరి, తుంగతుర్తి తదితర ప్రాంతాల్లో హైకోర్టు తీర్పు పట్ల కాంగ్రెస్ శ్రేణులు విజయోత్సవ ర్యాలీలతో సంబరాలు జరుపుకున్నారు. పిసిసి చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హైకోర్టు తీర్పుపై స్పందిస్తూ
కోర్టు తీర్పు టిఆర్‌ఎస్ నిరంకుశ పాలనకు చెంపపెట్టుగా అభివర్ణించారు. కాగా కోమటిరెడ్డి, సంపత్‌ల శాసన సభ్యత్వాల పునరుద్ధరిస్తు హైకోర్టు ఇచ్చిన తీర్పుతో వారి స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతాయన్న ఊహగానాలకు తెరపడినట్లయ్యింది. త్వరలో పంచాయితీ ఎన్నికలు జరుగుతాయన్న ప్రచారం నేపధ్యంలో హైకోర్టులో కోమటిరెడ్డి, సంపత్‌లు సాధించిన విజయం కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహాన్ని రేకెత్తించింది. కోర్టు తీర్పు పట్ల హర్షాతీరేకాలు వ్యక్తం చేస్తు కోమటిరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నల్లగొండ అసెంబ్లీ నియోజకవర్గంలోని మండలాల్లో, గ్రామాల్లో కాంగ్రెస్ శ్రేణులు ర్యాలీలు, స్వీట్ల పంపిణీ, బాణసంఛా పేలుళ్లతో సందడి చేశారు. ఇదే ఊపులో కోమటిరెడ్డి తన నియోజకవర్గంలోని గ్రామాల్లో ప్రజల్లోకి వెళ్లేందుకు సన్నాహాలు చేసుకుంటుండటం ఆసక్తికరం. కోమటిరెడ్డి, సంపత్‌ల శాసన సభ్యత్వాల రద్ధు కేసులో ప్రభుత్వం హైకోర్టులో ఓడిపోవడం జిల్లా టీఆర్‌ఎస్ నాయకత్వానికి ఇబ్బందికరంగా తయారైంది. ఇప్పటికే కోమటిరెడ్డి అనుఛరుడైన నల్లగొండ మున్సిపల్ చైర్ పర్సన్ లక్ష్మి భర్త బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్యోదంతం, సూర్యాపేట కలెక్టరేట్ స్థల వివాదాలు ఉమ్మడి జిల్లాలో టీఆర్‌ఎస్ పార్టీకి రాజకీయంగా ఇబ్బందికర పరిణామాలను కల్గించిన క్రమంలో కోమటిరెడ్డి, సంపత్‌ల కేసులో హైకోర్టు తీర్పు టిఆర్‌ఎస్‌కు మరింత సంకటంగా తయారైంది.
న్యాయం గెలిచింది : కోమటిరెడ్డి
తనతో పాటు పార్టీ ఎమ్మెల్యే సంపత్‌ల శాసన సభ్యత్వాల రద్ధు కేసులో హైకోర్టు తమకు అనుకూలంగా తీర్పునివ్వడం ఎంతో సంతోషాన్నిచ్చిందని సీఎల్పీ ఉపనేత, నల్లగొండ శాసన సభ్యుడు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. శాసన సభ్యత్వాల రద్ధును కొట్టివేస్తు తమ సభ్యత్వాలను పునరుద్ధరిస్తు హైకోర్టు ఇచ్చిన తీర్పు న్యాయాన్ని గెలిపించిందని ఈ తీర్పు దేశంలో చరిత్రాత్మకంగా నిలిచిపోతుందన్నారు. కోర్టు తీర్పు సీఎం కేసీఆర్ అప్రజాస్వామిక నిర్ణయాలకు చెంప పెట్టు అన్నారు. నెల రోజులుగా తనను రకరకాలుగా ఇబ్బంది పెడుతు మానసికంగా హింసించారని, తన అనుఛరుడు బొడ్డుపల్లి శ్రీనివాస్‌ను హత్య చేయించారన్నారు. ఐనప్పటికి న్యాయస్థానాలు తనకు రక్షణగా నిలిచాయని, కెసిఆర్ వంటి సీఎం తెలంగాణకు ఉండటం దౌర్భాగ్యకరమన్నారు. అసెంబ్లీలో కెసిఆర్ ప్రభుత్వ పాలనా వైఫల్యాలను ఎత్తిచూపుతామన్న భయంతోనే కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై బహిష్కరించారన్నారు. కెసిఆర్ మోసాలు ఇక సాగవని, వందమంది కెసిఆర్‌లు వచ్చిన తనను ఏమి చేయలేరని వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనన్నారు.