నల్గొండ

దివ్య సుందర క్షేత్రంగా యాదాద్రి * ఎంపీ కవిత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యాదగిరిగుట్ట, ఏప్రిల్ 19: దేశంలోనే ఎక్కడా లేని విధంగా కనీవిని ఎరుగని రీతిలో యాదాద్రి శ్రీ లక్ష్మీనర్సింహస్వామి క్షేత్రాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ అభివృద్ధి చేస్తున్నారని ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. గురువారం యాదాద్రి శ్రీ లక్ష్మీనర్సింహ స్వామి దర్శనార్థం ఆమె యాదగిరిగుట్టకు వచ్చారు. ఈ సందర్భంగా కవితకు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. ఆలయంలో స్వామి వారికి ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఈవో గీత, అధికారులు ఎంపీ కవితకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి పనులకు ఎటువంటి ఆటంకం కలుగకుండా చూసి బంగారు తెలంగాణ నిర్మించాలని, ప్రజలందరూ సుఖ శాంతులతో ఉండాలని స్వామి వారిని కోరుకున్నట్లు తెలిపారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ ప్రతీక అయిన యాదాద్రి ఆలయం మరికొన్ని రోజుల్లో మహాద్భుతంగా, దివ్య సుందర క్షేత్రంగా రూపుదిద్దుకుంటుందని చెప్పారు. ఆలయ అభివృద్ధికి ఇప్పటికే 650కోట్లతో పనులు జరిగాయని, రేయింబవళ్లు శిల్పులు చెమటోడ్చి శిల్పాలు చెక్కుతున్నారని ఆమె తెలిపారు. ఎంపీ వెంట ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే గొంగిడి సునీత ఉన్నారు.

భానుడి భగభగ
* నల్లగొండలో 41డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు
నల్లగొండ రూరల్, ఏప్రిల్ 19: భానుడి ప్రతాపంతో రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. గత నాలుగైదు రోజుల నుండి ఉష్ణోగ్రతల శాతం 40డిగ్రీలను దాటుతుంది. గురువారం గరిష్టంగా 41.5డిగ్రీలు, కనిష్టంగా 29.2డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో ప్రజలు ఉదయం 10నుండి సాయంత్రం 5గంటల వరకూ ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే భయపడ్డారు. ఉష్ణతాపాన్ని తట్టుకునేందుకు గ్రామాల్లో ఏఎంఆర్‌పీ కాల్వల వద్ద, పానగల్లు ఉదయసముద్రం నీటిలో చిన్నారులు, యువకులు ఈతలతో ఉపశమనం పొందుతున్నారు. అదే విధంగా ప్రజలు కొబ్బరి నీళ్లు సేవించి వేసవి తాపం నుంచి ఉపశమనం చెందుతున్నారు.