నల్గొండ

యాదాద్రిలో భక్తజన సందడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యాదగిరిగుట్ట, ఏప్రిల్ 22: యాదాద్రి శ్రీ లక్ష్మీనర్సింహ స్వామి దేవాలయంలో ఆదివారం నిత్యారాధనలు, భక్తుల ఆర్జిత సేవలు సాంప్రదాయబద్ధంగా జరిగాయి. సుప్రభాతంతో స్వామివారిని మేల్కొల్పి బిందె తీర్థంతో నిత్య కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. తొలుత ప్రతిష్టామూర్తులకు ఆరాధనలు నిర్వహించిన పూజారులు స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు పాలాభిషేకం జరిపి తులసీ దళాలు, వివిధ రకాల పూలతో అందంగా అలంకరించారు. కవచ మూర్తులను స్వర్ణపుష్పాలతో ఆరాధించి అర్చించారు. ఆలయంలో వేద పండితులు వేద మంత్రోచ్చారణలతో స్వామి, అమ్మవార్ల నిత్య కల్యాణాన్ని వైష్ణవ సాంప్రదాయం ప్రకారం పాంచరాత్ర ఆగమ శాస్త్రం ప్రకారం వైభవంగా నిర్వహించారు. ముందుగా ఆలయంలో శ్రీ సుదర్శన నారసింహ హోమం జరిపారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కొనసాగిన అష్టోత్తరం, సహస్త్ర నామార్చనలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సాయంత్రం స్వామి, అమ్మవార్లకు వెండిజోడి సేవోత్సవం నిర్వహించారు.
స్వామి వారి ఆదాయం రూ.19.49లక్షలు
యాదాద్రి శ్రీ లక్ష్మీనర్సింహ స్వామి దేవాలయం ఆదాయం ఆదివారం 19లక్షల 49వేల 125 రూపాయలు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ప్రధాన బుకింగ్ ద్వారా లక్షా 50 వేల 482రూపాయలు, అతి శీఘ్ర దర్శనం రూ.47,800, వీఐపీ దర్శనాలు 4లక్షల 16వేల 550, వ్రతాలు లక్షా 39వేల 500, కళ్యాణకట్ట రూ.68వేలు, విచారణ శాఖ లక్షా 3వేల 310రూపాయలు, ప్రసాద విక్రయాలు 8లక్షల 32వేల 660 రూపాయలు, టోల్‌గేట్ ద్వారా రూ.3,120, శాశ్వత పూజలు 34,232, అన్న ప్రసాదం 6,386, వాహన పూజలు రూ.23,100ల ఆదాయం లభించినట్లు అధికారులు వెల్లడించారు.