నల్గొండ

టీఆర్‌ఎస్‌తోనే గ్రామీణాభివృద్ధి సాధ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేవరకొండ, ఏప్రిల్ 22: టీ ఆర్ ఎస్ తోనే గ్రామాల అభివృద్ధి జరుగుతోందని ఎమ్మెల్యే రవీంద్రకుమార్ అన్నారు. మండలం లోని తెలుగుపల్లి గ్రామంలో ఆదివారం ఆయన 5 లక్షల వ్యయంతో వేయనున్న సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడుగు, బలహీనవర్గాల సంక్షేమం కోసం సీ ఎం కేసీ ఆర్ అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నాడన్నారు. మారుమూల గ్రామాలకు సైతం బీటీ రోడ్లు వేసిన ఘనత టీ ఆర్ ఎస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు. గ్రామాలలో వౌళిక సదుపాయాల కల్పన కోసం అధిక ప్రాధాన్యతను ఇస్తున్నట్లు చెప్పారు. 10 కోట్లతో నియోజకవర్గం లోని గ్రామాలలో సీసీ రోడ్లు వేయనున్నట్లు ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మేకల శ్రీనివాస్‌యాదవ్, జడ్పీటీసీ ఆలంపల్లి నర్సింహ్మ, టీ ఆర్ ఎస్ నాయకులు చాట్ల రాములు, పేర్ల యాదయ్య, ఓర్సు వెంకటయ్య, యాదగిరి, బొడ్డుపల్లి వెంకటయ్య, కుంభం అంజల్‌రెడ్డి, ఏకుల విష్ణు, టీ ఆర్ ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేముల రాజు, బొడ్డుపల్లి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ఆసిఫా నిందితులను శిక్షించాలంటూ వినూత్న నిరసన

గుర్రంపోడు, ఏప్రిల్ 22: ఆసిఫాపై అత్యాచారం జరిపిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ దళిత విద్యార్థి సంఘం, టీఆర్‌ఎస్‌వీ ఆధ్వర్యంలో కళ్లకు గంతలు కట్టుకొని కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఆదివారం మండల కేంద్రంలోని నల్లగొండ- దేవరకొండ ప్రధాన రహదారిపై నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా టీఆర్‌యస్‌వీ నియోజకవర్గ ఇన్‌చార్జి పిల్లి అభినయ్ యాదవ్, దళిత విద్యార్థి సంఘం మండల అధ్యక్షులు గుర్రం లక్ష్మణ్‌లు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఆసిఫా హత్య నిందితులను శిక్షించాల్సింది పోయి కాపాడే ప్రయత్నం చేస్తుందన్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోకపోతే తీవ్ర పరిణామాలు చోటుచేసుకుంటాయని హెచ్చరించారు. టీఆర్‌ఎస్‌వీ నియోజకవర్గ నాయకులు షేక్ మహిమూద్, మండల అధ్యక్షులు బైరు మధు, సమీర్, సైదులు, ప్రసాద్, చిరంజీవి, రవి తదితరులు పాల్గొన్నారు.