నల్గొండ

మళ్లీ పలుచోట్ల భారీ వర్షం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యాపేట, ఏప్రిల్ 22: జిల్లాకేంద్రంలో ఆదివారం సాయంత్రం భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. ఉదయం నుండి ఎండ ప్రభావం తీవ్రంగా ఉండగా సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఒక్కసారిగా వాతావరణం చల్లబడి భారీగా ఈదురుగాలులు వీచాయి. ఈదురుగాలులతో పాటు ఓమోస్తారుగా వర్షం కురిసింది. విచిత్రమేమిటంటే జిల్లాకేంద్రంలోని పోస్ట్ఫాస్ పరిసర ప్రాంతాల నుండి ఇందిరమ్మ కాలనీ వరకు వడగండ్ల వర్షం పడగా పోస్టాపీస్ నుండి కొత్త బస్టాండ్ వరకు దోడ్డు చినుకులతో వర్షం పడింది. సుమారు 10నిమిషాల పాటు వాన కురిసి ఆతర్వాత ఎండ వేడిమి యధాతధంగా కొనసాగింది. ఈదురుగాలుల కారణంగా పట్టణంలో విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. గాలుల ప్రభావం తగ్గిన తర్వాత విద్యుత్‌ను పునరుద్దరించారు.
ఆలేరులో..
ఆలేరు : ఆలేరు మండల పరిధిలో ఆదివారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురవడంతో మార్కెట్, ఐకేపీ కేంద్రాల్లో ఉన్న ధాన్యం రాశులు పూర్తిగా తడిసిపోయాయి. చేతికొచ్చిన వరి పంట మరికొద్ది రోజుల్లో కోత దశలో ఉండగా.. ఈదురుగాలులతో కూడిన వర్షానికి పూర్తిగా నేలకొరిగింది. పంట నేలకొరగడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అకాల వర్షంతో నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలని, తక్షణమే క్షేత్ర స్థాయిలో అధికారులతో పంట నష్టం అంచనా వేయించాలని వివిధ రాజకీయ పార్టీల నాయకులు డిమాండ్ చేశారు.
ఫోటో రైటప్..22ఏఎల్‌ఆర్ 3: ఆలేరు మార్కెట్ యార్డులో వర్షంలో తడుస్తున్న ధాన్యం రాశులు
పిడుగుపాటుకు రెండు ఆవులు, దూడ మృతి
చింతపల్లి, ఏప్రిల్ 22: మండలంలోని మల్లారెడ్డిపల్లి గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న బోజ్యాతండాలో ఆదివారం పిడుగుపాటుకు రమావత్ మోతీరాంనాయక్‌కు చెందిన సుమారు 80వేల రూపాయల విలువ గల రెండు ఆవులు, ఒక కోడె దూడ మృతి చెందాయి. మోతీరాంకు ప్రభుత్వం పరిహారం అందించి ఆదుకోవాలని సర్పంచ్ విజయ్ కోరారు.