నల్గొండ

పారదర్శకంగా ఉజ్వల లబ్ధిదారుల ఎంపిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యాపేట, ఏప్రిల్ 22: ఉజ్వల్ పధకం కింద పేద కుటుంబాల వారికి గ్యాస్ కనెక్షన్‌లను అందించాలని రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉజ్వల్ పధకం అమలు తీరుపై జిల్లాలోని హెచ్‌పీ సీ ఎల్, బీపీ సీ ఎల్ గ్యాస్ సంస్థలు, మండలస్థాయి గ్యాస్ డీలర్లు, సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాలో ఈపధకం కింద 5,966 గ్యాస్ కనెక్షన్‌లు అర్హులైన లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు సిద్దంగా ఉన్నట్లు తెలిపారు. లబ్ధిదారులు చేసుకున్న దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా లబ్ధిదారులను గుర్తించాలని సూచించారు. మొదట ఈపధకం పర్యవేక్షణను మండల అభివృద్ది అధికారులకు అప్పగించడం జరిగిందని ఆతర్వాత తహశీల్దార్‌లకు బదిలీచేయడం జరిగిందన్నారు. జిల్లా పరిధిలోని సూర్యాపేట నియోజకవర్గంలో 5,731, హుజూర్‌నగర్ నియోజకవర్గంలో 2,040, కోదాడలో 5,310, తుంగతుర్తి నియోజకవర్గంలో 1,750 మొత్తంగా 14,831 దరఖాస్తులు వచ్చాయని వీటిలో 8,844 దరఖాస్తులను అర్హులుగా గుర్తించినట్లు పేర్కొన్నారు. మే 10 తేదీ నుండి రైతు బంధు చెక్కుల పంపిణీ ఉన్నందున ఈనెల 25న జిల్లాకేంద్రంలో లబ్ధిదారులకు గ్యాస్ కనెక్షన్‌ల పంపిణీకి ప్రతిపాధనలు సిద్దంగా ఉంచాలని అదేవిధంగా ఈనెల 27న మండలస్థాయిల్లో పంపిణీకి ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. మండలాల తహశీల్థార్‌లు మండలాల లబ్దిదారుల కులదృవీకరణ పత్రాల జారీలో జ్యాప్యం చేయరాదని కోరారు. జిల్లాలో ఇప్పటికి గ్యాస్ కనెక్షన్‌లు లేనివారు ఉన్నారని వారందరికి ఈపధకం ద్వారా గ్యాస్ కనెక్షన్‌లు మంజూరు చేయాలని కోరారు. గ్రామ, మండలస్ధాయిల్లో ఉజ్వల పధకంపై ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. ఈకార్యక్రమంలో జిల్లా సంయుక్త కలెక్టర్ డి.సంజీవరెడ్డి, ఆర్డీవో మోహన్‌రావు, జిల్లా పౌరసరఫరాల అధికారి అనురాధ, డీఆర్‌డీవో కిరణ్‌కుమార్, హెచ్‌పీసీఎల్ అసిస్టెంట్ సేల్స్ ఆఫీసర్ అభిలాష్, బీపీసీఎల్ సేల్స్ మేనేజర్ అరవింద్‌గోయల్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం జిల్లాలో ఏర్పాటుచేసిన నాలుగు ధాన్యం గోదాముల్లో సీసీ కెమోరాల మానిటరింగ్ సిస్టంను కలెక్టరేట్‌లోని డీఎస్‌వో కార్యాలయంలో మంత్రి ప్రారంభించారు.