నల్గొండ

దశాబ్ధాల కల సాకారమవుతున్న వేళ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తుంగతుర్తి,ఏప్రిల్ 22: దశాబ్దాల కాలంగా ప్రజానీకం కంటున్న కలలు సాకారమయ్యే సమయం ఆసన్నమైంది. శ్రీరాంసాగర్ రెండోదశ కాలువల ఆధునీకరణ, వెలుగుపల్లి గ్రామం వద్ద రిజర్వాయర్ ఏర్పాటు అనుకూలత పరిస్దితులను రాష్టమ్రంత్రులు హరీష్‌రావు, జగదీశ్వర్‌రెడ్డిలు ఈనెల 24న స్వయంగా పరిశీలించబోతున్నారు. తుంగతుర్తి నియోజకవర్గంలోని పలు ప్రాంతాలలోగత కొంతకాలంగా అధ్వాన్నిస్థితిలో ఉన్న శ్రీరాంసాగర్ రెండోదశ కాలువలను వారు ప్రత్యేకంగా పరిశీలించనున్నారు. తొలుత తిమ్మాపురం గ్రామం నుంచి దాదాపు 6కి.మీ దూరంలో సీతారంపురం వరకు ఉన్న 71డీబీఎం ఎస్సారెస్పీ కాలువలను పరిశీలిస్తారు. అనంతరం వెలుగుపల్లి గ్రామ వద్దనున్న రుద్రమ్మ చెరువుని రిజర్వాయరుగా మార్చే అనుకూల పరిస్దితిలను పరిశీంచనున్నారు. దీంతోపాటు వెంపటి గ్రామ పెద్ద చెరువుని కూడా రిజర్వాయరు ఏర్పాటుపై పరిశీలన చేసి అక్కడి నుండి 69 డీబీఎం ద్వారా కాలువను పరిశీలిస్తారు. ఇదిలా ఉంటే కాలువల ఆధునీకరణ పరిస్దితులపై గతంలో స్దానిక శాసనసభ్యులు గాదరి కిషోర్‌కుమార్ స్వయంగా అధికారులతో కలిసి పరిశీలన చేశారు. ఈమేరకు రూ.220కోట్ల నిధులు అవసరమున్నట్లుగా ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపారు.
స్వయంగా మంత్రులతోనే పరిశీలన
తనతోపాటు అధికారుల పరిశీలనలు ఎలా ఉన్నప్పటికీ సాక్షాత్తు రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు, జగదీశ్వరెడ్డిలను రంగం మీదికి తీసుకొచ్చి అనుకున్న లక్ష్యాన్ని చేధించాలనే దృఢసంకల్పంతో స్దానిక ఎమ్మెల్యే కిషోర్‌కుమార్ ఉన్నారు. ముఖ్యంగా రాష్ట్ర మంత్రులు స్వయంగా కాలువలు పరిశీలించడం నియోజకవర్గ చరిత్రలో తొలిసారైనప్పటికి ఆ క్రెడిట్‌నంతా కిషోరే మూటకట్టుకోనున్నారు.
ఆ ప్రాంతాలకు ముప్పే
వెలుగుపల్లి వద్దనున్న రుద్రమ్మ చెరువుని ఎస్సారెస్పీ రెండోదశ కింద రిజర్వాయరుగా మారిస్తే దాని పరిధిలో ఉన్న జొన్నలగడ్డ, కాశీ, మేగ్య తండాలు ఖాళీ కావాల్సిందే. ప్రస్తుతం ఈచెరువు మూడొందల ఎకరాల వైశాల్యంలో ఏడొందల మీటర్ల కట్టపొడవుతో ఉంది. దీని కింద వెలుగుపల్లి, అన్నారం తదితర గ్రామాలలోని వేయి ఎకరాల భూములు సేద్యమవుతున్నాయి. ప్రస్తుతం ఎన్ని టీఎంసీల నీటి నిల్వతో రిజర్వాయరుగా మార్చాలనేది ఖచ్చితంగా తేలలేదు. ఒక టీఎంసీనా లేక రెండు అంతకంటే ఎక్కువ సామర్ద్యంలో దీన్ని నిర్మించాలా..? అనే లెక్కలు పక్కాగా త్వరలోనే తేలనున్నాయి. అయితే రెండు టీఎంసీల సామర్ద్యం కంటే ఎక్కువగా రిజర్వాయరుని మార్చాలను కుంటే పై మూడు ప్రాంతాలతోపాటు వాటి పక్కనే ఉన్న లక్ష్మాపురం, ఎగువ భాగాన ఉన్న పర్సాయిపల్లి ప్రాంతాల ప్రజలు గ్రామాలను ఖాళీ చేయాల్సిందే. కాగా రిజర్వాయరు ఏర్పాటుతో భూములు, నివాస గృహలు కోల్పోయే వారికి ఏ రకంగా సహాయాలు అందించాలనే దానిపై ఇప్పుడిప్పుడే అంచనాలు తయారవుతున్నాయి. ముఖ్యంగా రిజర్వాయరు ఏర్పాటు వల్ల నియోజకవర్గంలోని పలు ప్రాంతాల ముఖ చిత్రాలే అభివృద్ధిపరంగా మారనున్నాయి.