క్రైమ్/లీగల్

టిప్పర్ ఢీకొని ఒకరు..అదుపుతప్పి మరొకరు దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బొమ్మలరామారం, ఏప్రిల్ 23: మండలంలోని రంగాపురం గ్రామం లో హైద్రాబాద్‌రోడ్‌పై టిప్పర్ బైక్‌ను డీకొట్టిన ప్రమాద సంఘటనలో తిమ్మాపురం బోటిమీది తండా గ్రామానికి చెందిన ఇస్లావత్ నరేష్(25)కు తలకు తీవ్రగాయాలు కావడంతో సంఘటనస్థలంలోనె మృతిచెందాడు. వృత్తిరిత్యా మేడ్చల్ జీల్లా కీసర మండలకేంద్రంలోని పెట్రొల్ బంకులో పనిచేసి ఇంటికి తిరిగి వస్తుండగా ప్రమాదానికి గురయ్యాడు. ఇస్లావత్ జాను పిర్యాదు మెరకు ఎస్సై వెంకటేశం కేసు దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు.

బైక్ అదుపు తప్పి వ్యక్తి మృతి
నాంపల్లి : ద్విచక్రవాహనం అదుపు తప్పి కింద పడటంతో వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలంలోని తుంగపాడ్ గ్రామం వద్ద సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన యాచారం పెద్దయ్య(51)కు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. రెండో కుమార్తె పెళ్లికార్డుల పంపిణీ కోసం తుంగపాడ్ నుండి మల్లపురాజుపల్లి గ్రామానికి వెళ్తుండగా మార్గమధ్యలో బైక్ అదుపు తప్పి పడటంతో తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘటన స్థలాన్ని సీఐ ప్రభాకర్‌రెడ్డి పరిశీలించి ప్రమాద వివరాలను తెలుసుకున్నారు. కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.