నల్గొండ

గరుడ గమనునికి ఘనంగా గజవాహనోత్సవం..స్వర్ణపుష్పార్చన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యాదగిరిగుట్ట, ఏప్రిల్ 23: యాదాద్రి శ్రీ లక్ష్మీనర్సింహ స్వామి దేవస్థానంలో సోమవారం ఉదయం నిత్యారాధనలు, భక్తుల ఆర్జిత సేవలు శాస్త్రోక్తంగా జరిగాయి. ప్రతిష్టామూర్తులకు ఆరాధన నిర్వహించిన పూజారులు ఉత్సవమూర్తులను పంచామృతాలతో అభిషేకం జరిపి తులసీ దళాలతో అర్చించి ఆరాధించారు. కవచ మూర్తులను స్వర్ణ పుష్పాలతో పూజలు చేశారు. ఆలయ మండపంలో వేద మంత్రోచ్ఛరణలతో స్వామి, అమ్మవార్ల నిత్య కల్యాణోత్సవాన్ని వైష్ణవ సాంప్రదాయం ప్రకారం పాంచరాత్ర ఆగమ శాస్త్రం రీత్యా నిర్వహించారు. అంతకు ముందు ఆలయంలోని యజ్ఞశాలలో శ్రీ సుదర్శన నారసింహ హోమం నిర్వహించారు. ఆలయంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు అష్టోత్తరం, సహస్త్ర నామార్చనలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అదే విధంగా సత్యనారాయణ స్వామి వ్రతాలను భక్తులు ఆచరించారు. సాయంత్రం స్వామి, అమ్మవార్ల వెండిజోడి సేవోత్సవం నిర్వహించారు.
మహేశ్వరుడికి రుద్రాభిషేకం
యాదగిరికొండపై వేంచేసి ఉన్న శ్రీ పర్వతవర్థిని రామలింగేశ్వర స్వామి ఆలయంలో సోమవారం ఉదయం మహన్యాస పూర్వక రుద్రాభిషేకం జరిపారు. అనంతరం అష్టోత్తరం, అర్చనలు, వివిధ రకాల పూజలు నిర్వహించారు. అభిషేకం అనంతరం శివుడికి ఇష్టమైన బిల్వ పత్రాలు, వివిధ రకాల పూలతో స్వామి వారిని అలంకరించి పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రధాన అర్చకులు నర్సింహరాములు, తదితరులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

సాక్షరభారత్ కో-ఆర్డినేటర్ల కట్టడి
* ప్రగతి భవన్ ముట్టడికి వెళ్లేవారి బైండోవర్
నాంపల్లి, ఏప్రిల్ 23: సాక్షరభారత్ (వయోజన విద్య) కో ఆర్డినేటర్ల పని కాలం ముగిసినందున మరల కొనసాగించి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆ సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమానికి తరలివెళ్తున్న మండలంలోని కో ఆర్డినేటర్లను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకొని బైండోవర్ చేశారు. గ్రామ కో ఆర్డినేటర్లు మాట్లాడుతూ వివిధ ప్రభుత్వ పథకాలలో కో ఆర్డినేటర్లను వినియోగించుకొని నేడు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. కో ఆర్డినేటర్లను తక్షణమే విధుల్లోకి తీసుకొని ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. బైండోవర్ అయిన వారిలో గ్రామ కో ఆర్డినేటర్ పద్మ, రాధాకృష్ణ, రమణ, సంతోష, శోభారాణి, దేవేందర్, నాగరాజు, లోహిత్‌రెడ్డి, నర్సింహా, విజయ్‌కుమార్ ఉన్నారు.

ఆటోడ్రైవర్ల ధర్నా
రామగిరి, ఏప్రిల్ 23: ఆటోల ఇన్సూరెన్స్‌ను ప్రభుత్వమే చెల్లించాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఆటోడ్రైవర్స్, వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నల్లగొండ ఆర్టీవో కార్యాలయం ఎదుట ఆటో డ్రైవర్లు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు నూనె వెంకటస్వామి మాట్లాడుతూ రోడ్డు రవాణా పన్నుల పెంపు నుండి ఆటోలను మినహాయించాలని కోరారు. ఆర్టీవో కార్యాలయాల్లో అవినీతిని అరికట్టాలని, ఆటో డ్రైవర్లకు ప్రత్యేక సెల్ ఏర్పాటుచేయాలన్నారు. ఆటోలపై అన్ని రకాల అపరాధ రుసుములను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. అనంతరం డీటీసీ చంద్రశేఖర్‌గౌడ్‌కు పలు డిమాండ్లపై వినతి పత్రం అందించగా, సానుకూలంగా స్పందించిన ఆయన ఆటోడ్రైవర్ల సౌకర్యార్థం మే 1నుంచి ప్రత్యేక సెల్ ఏర్పాటుచేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు గోపిరెడ్డి శ్యాంసుందర్‌రెడ్డి, బండారు షణ్ముక, మానుపాటి శంకర్, యనమళ్ల ఫృథ్వీరాజ్, వెంకన్న, ఇంద్రకంటి రాములు, యాదయ్య, నరేందర్‌రెడ్డి, కొప్పుల రాములు, యాతాకుల రవి, శ్రీనివాస్‌గౌడ్, హన్మంత్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.