నల్గొండ

కలెక్టరేట్ స్థలం చుట్టూ ముప్పేట రాజకీయం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, ఏప్రిల్ 23: సూర్యాపేట కలెక్టరేట్ స్థలాన్ని రియల్ ఎస్టెట్ వ్యాపార కోణంలో ఎంపిక చేసి మంత్రి జగదీష్‌రెడ్డి 300కోట్ల మేర భూదందా సాగిస్తున్నారంటు పేట కాంగ్రెస్, బిజెపి నాయకులు సాగిస్తున్న ఆరోపణలు ఉమ్మడి నల్లగొండ జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. మంత్రి జగదీష్‌రెడ్డిని రాజకీయంగా దెబ్బతీసేందుకు కలెక్టరేట్ నిర్మాణ స్థల ఎంపిక వివాదాన్ని కాంగ్రెస్, బిజెపిలు రాజకీయ అస్త్రంగా మలుచుకోవడం టిఆర్‌ఎస్ పార్టీకి సమస్యగా మారింది. కలెక్టరేట్ స్థల ఎంపికను ఆర్ధికంగా సొమ్ము చేసుకునే లక్ష్యంతో మంత్రి జగదీష్‌రెడ్డి ముందస్తు పథకంతో కలెక్టరేట్ నిర్మాణ స్థలాన్ని మార్చివేశారని కాంగ్రెస్ మాజీ మంత్రులు ఆర్. దామోదర్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పిసిసి నేత పటేల్ రమేష్‌రెడ్డి, బిజెపి నేత సంకినేని వెంకటేశ్వర్‌రావులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే కలెక్టరేట్ స్థల మార్పిడిని నిరసిస్తు సూర్యాపేట బంద్ సైతం నిర్వహించి నిరసన తెలిపారు. మంత్రి జగదీష్‌రెడ్డి భూదందా ఆలోఛనతో ముందుగా కలెక్టరేట్‌ను జాతీయ రహదారి వెంట ఉన 671సర్వే నెంబర్ భూముల్లో కడుతున్నారని ప్రచారం చేయించి, ఇదే సమయంలో కుడకుడ గ్రామ సమీపంలో పెద్ద ఎత్తున తక్కువ ధరకు తన అనుఛరులతో భూములు కొనుగోలు చేయించాడని విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. కుడకుడలోని సర్వేనెంబర్ 301, 302లోని ప్రైవేటు వ్యక్తుల భూములను ప్రభుత్వంతో కొనుగోలు జరిపించి కలెక్టరేట్ సముదాయ నిర్మాణాన్ని ఈ భూముల్లోకి మంత్రి జగదీష్‌రెడ్డి మార్పించాడని వారు విమర్శిస్తున్నారు. అంతకుముందే ముందస్తు పథకం మేరకు మంత్రి తన బినామీలైన అనుఛరులతో కుడకుడలో భారీ ఎత్తున తక్కువ ధరకు కొనుగోలు చేయించిన భూములను ఇప్పుడు ఎక్కువ ధరకు అమ్మేస్తు 300కోట్ల మేర రియల్ వ్యాపారానికి తెరలేపారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇదే ఆరోపణలతో చకిలం రాజేశ్వర్‌రావు సైతం కోర్టులో కేసు వేశారు. కలెక్టరేట్ స్థల మార్పిడి చుట్టు మంత్రి జగదీష్‌రెడ్డి రియల్ ఎస్టేట్ భూదందా ఆలోఛన ఉందంటు వారు చేస్తున్న ఆరోపణలను ఇప్పటికే మంత్రి పలుపర్యాయాలు ఖండించారు. ఐనప్పటికి ఇదే ఆరోపణలతో విపక్షాలు సూర్యాపేట జిల్లాలో ప్రజల్లోకి వెలుతుండటం రాజకీయంగా టిఆర్‌ఎస్‌కు ఇబ్బందికరంగా తయారైంది. ముఖ్యంగా అవినీతి ఆరోపణల పేరుతో గతంలో డిప్యూటీ సీఎం రాజయ్యను మంత్రివర్గం నుండి తొలగించిన సీఎం కెసిఆర్ ఇప్పుడు జగదీష్‌రెడ్డిని ఎందుకు మంత్రివర్గం నుండి తొలగించడం లేదంటు విపక్షాలు విమర్శల దాడి సాగిస్తున్నాయి. ప్రజలకు సౌకర్యంగా ఉన్న 671సర్వేనెంబర్ భూములను కాదని, కుడకుడ వద్ధ కలెక్టరేట్ నిర్మాణం ఎంతవరకు సమంజసమంటు ప్రశ్నిస్తున్నాయి. కలెక్టరేట్ స్థల మార్పిడి కుంభకోణంలో మంత్రితో పాటు జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ల ప్రమేయం ఉందని, భూసేకరణ చట్టం నిబంధనలు సైతం పాటించలేదంటు బిజెపి నేత సంకినేని విమర్శల దాడి ఉదృతం చేస్తున్నారు. ప్రభుత్వం సిట్టింగ్ జడ్జీతో విఛారణ జరిపిస్తే అవినీతి నిరూపిస్తామని లేదంటు రాజకీయాల నుండి తప్పుకుంటానంటు సంకినేని సవాల్ విసురుతున్నారు. మొత్తంగా సూర్యాపేట కలెక్టరేట్ స్థల వివాదంపై ప్రచార, ప్రసార సాధనాల్లో, సామాజిక మాద్యమాల్లో విస్తృత ప్రచారం సాగుతుండగా త్వరలో గ్రామ పంచాయితీ ఎన్నికలు రానున్న నేపధ్యంలో రాజకీయంగా ఈ వివాదం ప్రాధాన్యత సంతరించుకుంది.